శరద్గీతి … సరోజినీ నాయుడు

బాధాతప్త హృదిపై నవనీతపులేపనం లా,

నల్లమబ్బు అంచున, గుంకుతోంది పొద్దు.

అటు బంగారువన్నె వరికంకుల రెపరెపలు

ఇటు కొమ్మలలో పడుచు, పండుటాకుల గలగలలు

ఎక్కడో, మబ్బుతెరలలో వెర్రిగాలి అలజడులు 

.

అదిగో విననీండి! గాలిలో నా పేరు తేలి వస్తోంది.

చిలిపిగాలి ఎవరిగొంతునూ అనుకరించటం లేదు గద?

అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది.

అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి

నేను మాత్రం మిగిలి చేసేదేముంది?

.

Image Courtesy: http://www.hindu.com

సరోజినీ నాయుడు

(13 ఫిబ్రవరి 1879 – మార్చి 2, 1949)

సరోజినీదేవి నిజాంకాలేజీ, హైదరాబాదు వ్యవస్థాపకుడూ, ప్రప్రధమ ప్రిన్సిపాలూ అయిన అఘోరనాథ్ చట్టోపాధ్యాయ్

ప్రథమసంతానం. (ఆమెకు నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్న బిరుదు ఉంది).  మద్రాస్ యూనివర్శిటీ మెట్రికులేషన్

పరీక్షలో ఫస్టురాంకు సంపాదించుకుని దేశం దృష్టినాకర్షించిన ఈమె శాస్త్రజ్ఞురాలో, గణితశాస్త్రజ్ఞురాలో కావాలని తండ్రి

ఆశించినా, ఆమె తల్లి  బాటనే  ఎంచుకుంది. ఆమె తల్లి సుందరీదేవి బెంగాలీలో మంచి కవయిత్రి. 12వ ఏటనే ఇంగ్లీషులో

కవిత్వం రాయడం ప్రారంభించిన ఆమె కవిత్వానికి ముచ్చటపడి, హైదరాబాదు నిజాం ఆమెకు విదేశీ విద్యకు

అవసరమైన ఉపకారవేతనాన్ని మంజూరుచేశాడు.

సరోజినీదేవి ఎడ్మండ్ గాసేని కలిసింది ఇంగ్లండులోనే. అతనే ఆమె కవిత్వానికి దిశానిర్దేశనం చేశాడు. ఆమె “The golden

threshold (1905)”, “The bird of time (1912)”, “The broken wing (1912)” అన్న మూడు కవితా సంకలనాలు తీసుకు

వచ్చింది. బాపూజీతో కలిసి ఉప్పుసత్యాగ్రహంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొని జైలుశిక్షకూడా

అనుభవించింది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే మొట్టమొదటి మహిళాగవర్నరుగా (ఉత్తరప్రదేశ్ కు) నియమింపబడి

పదవిలోఉండగానే కన్నుమూసింది.

కవులకు ఆమె కవిత్వమే కాదు, జీవితంకూడా మార్గదర్శకత్వమే. కవులెప్పుడూ ప్రజలపక్షాన నిలవాలని, అధికారానికి

ఎన్నడూ అర్రులుజాచని వీరనారి. గవర్నరు పదవి ఆమె ఆశించినది కాదు. ఆమెను వరించింది.

.

Autumn Song

.

Like a joy on the heart of a sorrow,
The sunset hangs on a cloud;
A golden storm of glittering sheaves,
Of fair and frail and fluttering leaves,
The wild wind blows in a cloud.

Hark to a voice that is calling
To my heart in the voice of the wind:
My heart is weary and sad and alone,
For its dreams like the fluttering leaves have gone,
And why should I stay behind?

Sarojini Naidu

(13 February 1879 – 2 March 1949)

Sarojini Devi is the first of the eight children of the Founder of Nizam College, Hyderabad (Deccan), Aghorenath Chattopadhyay. A child prodigy who attracted the attention of the nation standing first at the Matriculation Examination of the Madras University, Sarojini Devi started writing poetry in English at the young age of 12.  While her father wanted her to be a Mathematician or a scientist, she chose to become a poet and the Nizam had provided her with a Scholarship to pursue her studies in England. It’s there that she came in contact with Edmund Gosse who has given her poetry a proper direction advising her to stick to the Indian milieu in her imagery.  She published 3 volumes of Poetry:The golden threshold (1905),The bird of time (1912), and The broken wing (1912).

A staunch nationalist, he followed the footsteps of Bapuji in Salt Satyagraha and Quit India Movement and served prison sentence. After Independence she became the first Woman Governor after being appointed to Uttar Pradesh. She died while in office.

Her life, like her poetry, is a message in itself. She never hankered after power or position of power, and believed in standing behind the cause of common people. The Governorship came to her and she never tried for it.

“శరద్గీతి … సరోజినీ నాయుడు” కి 3 స్పందనలు

  1. సరోజినీ నాయుడు గారి కవితల గురించి వినడమే కానీ చదవలేదు. మీ అనువాదంతో ఆ భాగ్యం కలిగింది. ధన్యవాదాలు.
    >>అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది.
    అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి
    నేను మాత్రం మిగిలి చేసేదేముంది?>>
    కలలు కల్లలైనప్పుడు కలిగే నైరాశ్యం ఎండుటాకులు రాలడంతో పోల్చడం బావుంది.

    మెచ్చుకోండి

  2. అమ్మా జ్యోతిర్మయీ,

    సరోజిని దేవి చక్కగా రాయడమే కాదు, చాలా చక్కగా పాడేదిట ఆమె కవితల్ని (కవితాగానం) చేసేదిట.
    దురదృష్టవశాత్తూ, అవి అంత సులభంగా అందుబాటులో లేవు. నెట్ లో వెతికి చూడాలి ఎక్కడైనా ఆమె రికార్డింగ్ ని ఎవరైనా డిజిటైజ్ చేసి అప్ లోడ్ చేశారేమో. ఆమె ఎంత స్వేఛ్ఛా పిపాసో, ఆమె జీవితం నిజంగా ఋజువుచేస్తుంది. 15 వ ఏట తను మనసు పడిన వ్యక్తిని, పెద్దలు చిన్నతనం అని కొట్టేసిపేరేసినా, అతనినే వివాహం చేసుకుని తన పరిపక్వతని చాటుకున్న వ్యక్తి. ఘంటశాలగారి పద్యాలు, ఆమె మీది పాట ఆ రోజుల్లో ఆమె Popular Figure అన్నది స్పష్టం చేస్తాయి.
    ఆశీస్సులతో,

    మెచ్చుకోండి

  3. పడుచు, పండుటాకులగలగలలు….

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.