శరద్గీతి … సరోజినీ నాయుడు
బాధాతప్త హృదిపై నవనీతపులేపనం లా,
నల్లమబ్బు అంచున, గుంకుతోంది పొద్దు.
అటు బంగారువన్నె వరికంకుల రెపరెపలు
ఇటు కొమ్మలలో పడుచు, పండుటాకుల గలగలలు
ఎక్కడో, మబ్బుతెరలలో వెర్రిగాలి అలజడులు
.
అదిగో విననీండి! గాలిలో నా పేరు తేలి వస్తోంది.
చిలిపిగాలి ఎవరిగొంతునూ అనుకరించటం లేదు గద?
అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది.
అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి
నేను మాత్రం మిగిలి చేసేదేముంది?
.

సరోజినీ నాయుడు గారి కవితల గురించి వినడమే కానీ చదవలేదు. మీ అనువాదంతో ఆ భాగ్యం కలిగింది. ధన్యవాదాలు.
>>అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది.
అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి
నేను మాత్రం మిగిలి చేసేదేముంది?>>
కలలు కల్లలైనప్పుడు కలిగే నైరాశ్యం ఎండుటాకులు రాలడంతో పోల్చడం బావుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మా జ్యోతిర్మయీ,
సరోజిని దేవి చక్కగా రాయడమే కాదు, చాలా చక్కగా పాడేదిట ఆమె కవితల్ని (కవితాగానం) చేసేదిట.
దురదృష్టవశాత్తూ, అవి అంత సులభంగా అందుబాటులో లేవు. నెట్ లో వెతికి చూడాలి ఎక్కడైనా ఆమె రికార్డింగ్ ని ఎవరైనా డిజిటైజ్ చేసి అప్ లోడ్ చేశారేమో. ఆమె ఎంత స్వేఛ్ఛా పిపాసో, ఆమె జీవితం నిజంగా ఋజువుచేస్తుంది. 15 వ ఏట తను మనసు పడిన వ్యక్తిని, పెద్దలు చిన్నతనం అని కొట్టేసిపేరేసినా, అతనినే వివాహం చేసుకుని తన పరిపక్వతని చాటుకున్న వ్యక్తి. ఘంటశాలగారి పద్యాలు, ఆమె మీది పాట ఆ రోజుల్లో ఆమె Popular Figure అన్నది స్పష్టం చేస్తాయి.
ఆశీస్సులతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
పడుచు, పండుటాకులగలగలలు….
మెచ్చుకోండిమెచ్చుకోండి