రోజు: ఫిబ్రవరి 10, 2012
-
శరద్గీతి … సరోజినీ నాయుడు
బాధాతప్త హృదిపై నవనీతపులేపనం లా, నల్లమబ్బు అంచున, గుంకుతోంది పొద్దు. అటు బంగారువన్నె వరికంకుల రెపరెపలు ఇటు కొమ్మలలో పడుచు, పండుటాకుల గలగలలు ఎక్కడో, మబ్బుతెరలలో వెర్రిగాలి అలజడులు . అదిగో విననీండి! గాలిలో నా పేరు తేలి వస్తోంది. చిలిపిగాలి ఎవరిగొంతునూ అనుకరించటం లేదు గద? అలసిపోయిన నా మనసు ఒంటరిగ దిగులుతో నిండి ఉంది. అది కన్న కలలు ఎండుటాకుల్లా ఎగిరిపోయాయి నేను మాత్రం మిగిలి చేసేదేముంది? . సరోజినీ నాయుడు (13 ఫిబ్రవరి 1879…