ఒక వింత సత్యం… మాయా ఏంజెలో

.

సాహసానికి సగమెరుకై, సంతోషానికి బహిష్కృతులమై

ఏకాంతపునత్తగుల్లలోకి ముడుచుకుపోయే మనల్ని

“ప్రేమ” తన పవిత్రమైన గర్భగుడి వీడి

ఈ సంకెలలనుండి విముక్తుల్ని చేసి

జీవితాన్ని అనుగ్రహించేదాకా అలాగే ఉంటాం.
.

మనకే గనక ధైర్యం ఉంటే,ప్రేమ

ఈ పిరికిదనపు సంకెలలని అవలీలగా త్రెంపేస్తుంది.
.

మన సర్వస్వాన్నీ, మనం కాగల (మార్పుచెందగల) సకలాన్నీ

దానికి మూల్యంగా చెల్లించుకోవాలి.

ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన సత్యం ఏమిటంటే 

మనల్ని విముక్తుల్ని చెయ్యగలిగినది… అదొక్కటే!

.

ఇటువంటి ఆశ్చర్యకరమూ, సాహసోపేతమైన అయిన సత్యాన్ని

మనం తెలుసుకోగలం; తెలుసుకోవడం అవసరం కూడా.

.

కాని, ఆ సమయమాసన్నమయే వేళకి,

రోదసిలో “దిక్కు”లేకుండా తిరుగాడే

భూమి అనే ఒకానొకగ్రహం మీద

సృష్టించబడిన మనం

ప్రతి మనిషీ, స్త్రీ పురుష వివక్షలేకుండా,

దొంగభక్తి నటించనవసరం లేకుండా,

ఏ భయభీతులూ లేకుండా

జీవించగల వాతావరణాన్ని సృష్టించగల సమర్థులమై ఉండాలి.

.

అటువంటి సమయం వచ్చినపుడు,

ఇక్కడ జరుగగల అవకాశం ఉన్న వింతలు

సృష్టిలోని నిజమైన అద్భుతాలు

మనమేననీ ప్రకటించుకోవచ్చు.

కాని, అదెప్పుడు?

మనమా స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే.

.

మాయా ఏంజెలో

.

A Brave and Startling Truth

.

We, unaccustomed to courage exiles from delight
live coiled in shells of loneliness
until love leaves its high holy temple
and comes into our sight
to liberate us into life.

If we are bold, love strikes away the chains of fear from our souls.

Love costs all we are and will ever be.
Yet it is only love which sets us free.
A Brave and Startling Truth.

It is possible and imperative that we discover
A brave and startling truth.

When we come to it
We, this people, on this wayward, floating body
Created on this earth, of this earth
Have the power to fashion for this earth
A climate where every man and every woman
Can live freely without sanctimonious piety
And without crippling fear

When we come to it
We must confess that we are the possible
We are the miraculous, the true wonders of this world
That is when, and only when
We come to it.

Maya Angelou

(Text Courtesy: PoemHunter.com)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: