అనువాదలహరి

మబ్బులూ, సముద్రకెరటాలూ … రవీంద్రనాథ్ టాగోర్

Image Courtesy: http://2.bp.blogspot.com

.

అమ్మా! మబ్బుల్లో దాగున్న పిల్లలు నన్ను పిలుస్తారే

“ఉదయం అయింది మొదలు చీకటిపడేదాకా ఆడుకుందాం.

బంగారురంగు సూర్యోదయం తోటీ, వెండిబిళ్లలాంటి చంద్రుడుతోటీ

ఆడుకుందాం” అంటారే.

అప్పుడు నే నడుగుతాను, “మరలాగయితే, అక్కడికి చేరుకునేదెలా?” అని.

వాళ్లంటారు గదా, “ఏముందీ, భూమిఅంచుకి వచ్చి, రెండుచేతులూ

ఆకసం వైపు చేతులు జాచితే నువ్వలా మబ్బుల్లోకి తేలిపోతావు.” అని.

“మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తుంటుంది.

అమ్మని ఇంటిదగ్గర వొదిలేసి ఎలా రావడం?” అంటానే.

అప్పుడు వాళ్లు నవ్వుకుంటూ, తేలిపోతూ వెళిపోతారే.

మరయితే, అమ్మా, నాకు అంతకంటే మంచి ఆట తెలుసు. చెప్పనా?

నేనేమో మబ్బునిట, నువ్వేమో చందమామవిట.

ఇప్పుడు నేనేమో, పరిగేత్తుకుంటూ వచ్చి

నా రెండుచేతులతో నిన్నిలా కప్పేస్తానుట.

మనింటి కప్పే ఆకాసం ట. బాగుందా?

.

అమ్మా, అమ్మా! ఆ కెరటాలమీద ఆడుకునేపిల్లలు నన్నుపిలుస్తున్నారే,

“మనం పొద్దుటినుండి సాయంత్రం దాకా పాటలు పాడుకుందాం.

ఎక్కడికెళుతున్నామో తెలీకుండా అలా అలా వెళదాం” అని.

నే నడిగేనుగదా,” మరయితే నేను మీతో రావడం ఎలా?” అని.

వాళ్ళన్నారూ,” సముద్రపొడ్డుకి వచ్చి గాఠిగా కళ్ళు మూసుకో,

అపుడు నువ్వు కెరటాలమీద తేలిపోతావు, ” అని.

నేనన్నాను, “మా అమ్మకి ఏం కావలిసి వచ్చినా నేను దగ్గర ఉండాలి.

ఆమెని ఇంట్లో ఎలా విడిచిపెట్టి రాగలను?” అని.

అనగానే వాళ్ళు నవ్వుతూ, గెంతుతూ, వెళ్ళిపోయారే.

అమ్మా! నాకు అంతకంటే మాంచి ఆట తెలుసు, చెప్పనా?

నేనేమో కెరటాన్నిట. నువ్వేమో అక్కడెక్కడో… ఉన్న ఒడ్డువిట.

నేనిలా దొర్లుకుంటూ దొర్లుకుంటూ

నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతానుట, నవ్వుకుంటూ.

మనిద్దరం ఎక్కడున్నామో ఎవరికీ అస్సలు తెలీదుట. బాగుందా?”

.

రవీంద్రనాథ్ టాగోర్

.

Clouds and Waves

.

Mother, the folk who live up in the clouds call out to me-
“We play from the time we wake till the day ends.
We play with the golden dawn, we play with the silver moon.”
I ask, “But how am I to get up to you ?”
They answer, “Come to the edge of the earth, lift up your
hands to the sky, and you will be taken up into the clouds.”
“My mother is waiting for me at home, “I say, “How can I leave
her and come?”
Then they smile and float away.
But I know a nicer game than that, mother.
I shall be the cloud and you the moon.
I shall cover you with both my hands, and our house-top will
be the blue sky.

.

The folk who live in the waves call out to me-
“We sing from morning till night; on and on we travel and know
not where we pass.”
I ask, “But how am I to join you?”
They tell me, “Come to the edge of the shore and stand with
your eyes tight shut, and you will be carried out upon the waves.”
I say, “My mother always wants me at home in the everything-
how can I leave her and go?”
They smile, dance and pass by.
But I know a better game than that.
I will be the waves and you will be a strange shore.
I shall roll on and on and on, and break upon your lap with
laughter.
And no one in the world will know where we both are.
.
Rabindranath Tagore

11 thoughts on “మబ్బులూ, సముద్రకెరటాలూ … రవీంద్రనాథ్ టాగోర్”

 1. అమ్మ సాన్నిధ్యమే నాకు ప్రపంచం….ఎంత గొప్ప భావన. రవీంద్రుడి కలం ఆ భావాన్ని హృద్యంగా ఒలికించింది..మీ అనువాదం దానికి తగ్గట్టుగా ఉంది.

  మెచ్చుకోండి

 2. అమ్మా జ్యోతిర్మయీ,
  తల్లీ పిల్లల దొంగాటలు ఒక రసవద్ఘట్టం… చూసి ఆనందించగలగాలే గాని.
  టాగోర్ కవిత్వంలోని గొప్పదనం ఆయన కవిత్వం సాటి కవులకోసం (మెప్పుకోలు కోసం) కాదు. అది
  ఋషితుల్యుడైన వ్యక్తి ప్రకృతిలోదర్శించిన అవ్యక్త మధురానిభూతిని వ్యక్తం చెయ్యడానికి చేసిన ప్రయత్నం.
  అనుభూతికి శబ్దం ఎప్పుడూ ఆమడదూరమే. ఋషులకే అది అసాద్యమైనపుడు మనమనగా ఎంత. అకలుషిత సాహిత్యరసామృతసింధువులోంచి, దోసిలిపాటైనా తీసుకుని తరించే ప్రయత్నం చెయ్యడమే!
  ఆశీస్సులతో

  మెచ్చుకోండి

 3. అద్భుతంగా ఉన్నాయండీ.. టాగోర్ రాసిన కవిత మూలం, మీరు రాసిన అనువాదమూ రెండూ కూడా.. ఇంత చక్కటి కవితని మాకు పరిచయం చేసినందుకు బోలెడు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

  1. Saamaanya garu,

   Thank you for the encouraging remarks. We need not certify his greatness, but yet, it indicates his greatness in touching our finest sensibilities in so simple an imagery and clarity of thought. You notice how nicely he establishes the importance of mother to a child … in inner urge, an inalienable urge for the child… you and I have passed through. And women have the advantage of reliving such experience as ‘mother’ themselves again.
   Thanks for your visit and time.
   with regards

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: