
ఒక అద్భుతమైన గులాబీ రేకులు గాలికి ఎగురుతున్నట్లు
నా కన్నీటి చుక్కలు గాలిలో ప్రశాంతంగా తేలిపోతున్నై.
గుర్తుతెలియని గగనాల హిమశిఖరాల
అంతరం నుండి నా దుఃఖం ప్రవహిస్తోంది.
.
నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నేలమీద కాలు మోపానా
అదంతా ఛిన్నాభిన్నమైపోతుంది.
ఒకపక్క విచారమూ, మరోపక్క ఆనందంగానూ ఉంటుంది
మాంచి కల చెదిరి అప్పుడే తెలివొచ్చేసినట్లు.
.
డిలన్ థామస్ ఈ కవిత అనేకానేక వ్యాఖ్యానాలు చెయ్యడానికి అవకాశమున్న కవిత. చంద్రుడు ఉత్ప్రేక్షలకు ఎప్పుడూ తరగని గని. చంద్రుడిలో ఒక విదూషకుడున్నాడు. అదెవరు అంటే మన బాల్యమే. అక్కడ మనకు ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు కనిపిస్తూ మనసు ఆనందంతో కేరింతలు కొడుతుంటుంది. కానీ బాల్యం ఎల్లకాలం ఉండదు గదా. అది మంచులా కరగడం ప్రారంభిస్తుంటుంది. దానితోపాటే మన దుఃఖం కూడ. “అమాయకపు” మాయ జీవితంలోంచి యౌవనమనే పచ్చి నిజానికి చేరువైనపుడు, అంటే మనకాళ్ళు నేలమీదికి వచ్చినపుడు, మనకి ఒక పక్క బాధా ఇంకొక పక్క ఆనందమూ కలుగుతాయి. అది ఎలాంటిదంటే, మంచి అందమైన కలలోంచి తెలివొచ్చేసినట్టుట. ఇది చాలా చమత్కారమైన కవిత.
.
Clown in the Moon
.
My tears are like the quiet drift
Of petals from some magic rose;
And all my grief flows from the rift
Of unremembered skies and snows.
.
I think, that if I touched the earth,
It would crumble;
It is so sad and beautiful,
So tremulously like a dream.
.

స్పందించండి