ఇంద్రా! … ఆగస్ట్ స్త్రింద్బెర్గ్ , స్వీడిష్ నాటకకర్త.

Image Courtesy: http://img155.imageshack.us

.

ఇసకనేలల్లో చతికిలబడిపోయాం.

కోతలుపూర్తయిన చేలోని పరకల్తో

మా కాళ్ళు దుమ్ముకొట్టుకుపోయాయి

రాజమార్గాలనుండి వచ్చే దుమ్మునీ

నగరాల్లోని కాలుష్యాన్నీ

కంపుగొట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ

వంటిళ్ళలోంచీ, నేలమాళిగల్లోంచీ

వచ్చే పొగల్నీ, దుర్వాసనల్నీ

అన్నిటినీ భరించాం.

ఇకలాభం లేదని

కాస్త ఊపిరి పీల్చుకుందికి

సముద్రపొడ్డుకి పరిగెత్తాం

మా రెక్కలార్చుకుందికీ

పాదప్రక్షాళన చేసుకుందికీ

.

ఓ స్వర్గాధిపతీ! ఇంద్రా!

మా మొర ఆలకించు!

మా నిట్టూర్పుల సవ్వడి విను!

ఈ ధరిత్రి  ఒక మురికికూపం.

జీవితం పాపపంకిలం.

మనిషులు చెడో మంచో చెప్పలేం

వాళ్ళు, కుదిరినంతవరకు, రోజుల్లెక్కన

జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు

మట్టిమనుషులు, మట్టిలోనే దొర్లుతున్నారు

ధూళిలోపుట్టిన వాళ్ళు ధూళిలోనే కలిసిపోతున్నారు.

వాళ్ళకి జీవితాన్ని ఈడవడానికి

కాళ్ళే ఇచ్చావు గాని, రెక్కలివ్వలేదు

కనుకే దుమ్ముకొట్టుకుపోతున్నారు.

అయితే ఇందులో తప్పెవరిది?

నీదా? వాళ్ళదా?

.

Image Courtesy: http://upload.wikimedia.org

ఆగస్ట్ స్ట్రింద్బెర్గ్

స్వీడిష్ కవి, నాటక కర్త, నవలాకారుడు, వ్యాసకర్త, చిత్రకారుడు.

 (22 జనవరి 1849 – 14 మే 1912)

ఆధునిక స్వీడిష్ సాహిత్యానికి ఆద్యుడుగా గుర్తించబడుతున్న ఆగస్ట్ స్ట్రింద్బెర్గ్  బహుముఖప్రజ్ఞాశాలి. అతను కవీ, నవలాకారుడూ, నాటకరచయితా, చిత్రకారుడే కాక అతనికి శాస్త్రవిషయాల్లోనూ, “పరశువేది” విద్య  మీద కూడా అభిలాష ఉంది. 40 సం వత్సరాలపాటు కొనసాగిన అతని సాహిత్య కృషిలో అతను  నాటకరంగంలోనూ, ప్రక్రియలోనూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఎమిలీ జోలా పిలుపు నందుకుని, ‘మెలో  డ్రామా’ (అంటే వ్యక్తిత్వాల్నీ, సంఘటనలనీ ప్రేక్షకుడికి అనుభూతికలిగించడానికి ఉత్ప్రేక్షించి చూపడం) కి  బదులుగా, నాటకాల్లో సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ  కథలోని బిగువు కంటే, పాత్రల చిత్రణమీద ఎక్కువ శ్రధ్ధ చూపించడం ప్రవేశపెట్టాడు. అంతేగాక తననాటకాలలో, అధివాస్తవికత, వైయక్తిక చిత్రీకరణ(ఎక్స్ప్రెషనిజం) వంటి ప్రయోగాలు చేశాడు. అతని నాటకాలలో ముఖ్యమైనది (బహుశా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రభావంతో)  “The Dream Play” అన్న నాటకం లో “ఆచేతనావస్థ” యొక్క ప్రభావాన్ని నాటకీకరించడం.

.

Indra

.

Down to the sand-covered earth.
Straw from the harvested fields soiled our feet;
Dust from the high-roads,
Smoke from the cities,
Foul-smelling breaths,
Fumes from cellars and kitchens,
All we endured.
Then to the open sea we fled,
Filling our lungs with air,
Shaking our wings,
And laving our feet.

Indra, Lord of the Heavens,
Hear us!
Hear our sighing!
Unclean is the earth;
Evil is life;
Neither good nor bad
Can men be deemed.
As they can, they live,
One day at a time.
Sons of dust, through dust they journey;
Born out of dust, to dust they return.
Given they were, for trudging,
Feet, not wings for flying.
Dusty they grow–
Lies the fault then with them,
Or with Thee?

.

August Strindberg

22 January 1849 – 14 May 1912

(Johan August Strindberg was a multi-faceted genius … at once a playwright, novelist, poet, essayist and a painter. Curiously he had great interest in scientific experiments and the occult. A prolific writer  and an iconoclast by volition, Strindberg was regarded as the Father of  Modern Swedish Literature. His literary career spanned four decades during which he produced both famous (The Father, Miss Julie, and Creditors) and controversial plays (Master Olof, for example, was rejected by the Royal Theatre)  experimenting with expressionist and surrealistic dramatic techniques, outstanding novels like The Red Room and some 30 works of fiction, history and cultural analysis. Departing from the melodramatic elements of exaggeration of characters and events for appeal to emotions, he responded to  Emilie Zola’s Naturalism in Theatre by giving precedence to characterisation over plot. Of particular interest was his play The Dream Play (1902) where he radically attempted to dramatize the workings of the “unconscious” … the most current and explosive topic of his times, courtesy Sigmund Freud.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: