
.
నేను మరణించిన ఉత్తరక్షణం నుండి నా జీవితం
విశ్వవిలీనగానంలో సజీవమై ఉంటుంది
ఉత్తుంగతరంగాలు కడలిలో కలిసిపోయినపుడు
ఉత్పన్నమై, తీరానికి మోసుకుపోబడే ధవళఫేనంలా.
.
క్షణికమైన బుద్బుదప్రకాశంలా
ఈ రేయింబవళ్ళు నిమిత్తకాలం జ్వలిస్తాయి
తమ స్వక్షేత్రమైన అనంత
శూన్యంలోకి మరలిపోయేంత వరకూ.
.

సారా టీజ్డేల్.
(8-8-1884 – 29-1-1933)
(అమెరికను కవయిత్రి సారాటీజ్డేల్ కి తగినంత గుర్తింపు రాలేదని నేను భావిస్తాను. తాత్త్విక చింతన, ప్రేమ, విరహం మొదలైన విషయాల మీద ఆమె అపురూపమైన కవిత్వం వ్రాసింది. ఆమె కవితలు మరీ దీర్ఘంగా ఉండవు. ఆమె ఉపమానాలు సూటిగా పాఠకుడి గుండెలోతులను స్పృశించేలా ఉంటాయి. అందుకు ఈ కవితనే ఉదాహరణగా చెప్పవచ్చు.
మొదటిచరణంలో నశ్వరమైన మన జీవితంగురించి చెబుతూ, మనం పోయిన తర్వాత మిగిలేది, కెరటం భంగపడ్డతర్వాత మిగిలే నురుగులాంటిదని ఉపమిస్తుంది. అంతే కాక, ఆ ఉపమానాన్ని మరికొంచెం పొడిగిస్తూ, మనం పోయిన తర్వాత మనగురించి మన అభిమానులు మాటాడుకునే విషయాలు ఎలాంటివంటే ఆ నురగమీద పడి మెరిసే కిరణాలవంటివిట. కాలక్రమంలో బుడగలుపేలిపోయి శూన్యమే మిగులుతుంది. మనం శూన్యంలోకి విలీనం అవుతాము. దాన్ని, సృష్టికి కూడా అన్వయిస్తూ… ఈ సూర్యచంద్రులున్నంతకాలం సృష్టివెలుగుతుంది. తర్వాత అనంత అప్రమేయ శూన్యంలో ఒక భాగమై మిగిలిపోతుంది… అని ఆమె ఇచ్చిన ముగింపు గమనించండి.
ఇది నాకు నచ్చిన ఆమె అనేక కవితల్లో ఒకటి.)
.
A Little While
.
A little while when I am gone
My life will live in music after me
As spun foam lifted and borne on
After the wave is lost in the full sea.
.
A while these nights and days will burn
In song with the bright frailty of foam
Living in light before they turn
Back to the nothingness that is their home.
.
Sara Teasdale
(This is one of her most beautiful poems. Philosophy, love, angst of separation were her forte. Her poems are not very long but full of apposite images and drive the point straight to the reader. Perhaps she did not receive the kind of reputation she richly deserves.
In this poem you can notice that while in the first stanza treats the ephemeral nature of life, in the second she subtly mixes up the ephemeral nature of the universe itself with the way people remember the dead for a while, maybe for the lifetime of the offspring and friends, before the person and his memories pass into infinite nothingness … never to be mentioned or never to be heard of, after that. Just as, the creation itself falls into a long dreadful eternal silence after its tenure is over
This is a poem with great philosophical depth.)
స్పందించండి