ముఫ్ఫయ్యో ఏడని చిన్నబోయిన చిన్నది … ఓగ్జెన్ నాష్

Image Courtesy: http://data1.blog.de

.

మిరాండా అయిష్టంగా నిద్ర లేచింది
ఎండని చూస్తూనే భయపడింది
అయిష్టంగానే ఒక అడుగు ముందుకివేసింది
వణుకుతూ అద్దం దగ్గరికి చేరింది
.

మిరాండాకి,  మిరాండా దృష్టికి
వయసు పైబడింది, జుత్తు తెల్లబడింది, అసహ్యంగా ఉంది
నిన్న రాత్రి ఇరవైతొమ్మిదే తనకి
తెల్లారగానే ముఫ్ఫై వచ్చాయి వంటికి.
.

వీనస్ లా తళుకుమంటున్నా
ప్రభాతంలా ప్రకాశిస్తున్నా
వయసుగూర్చిన దిగులు వెంటాడగా
దుఃఖిస్తూ కూర్చుంది మిరాండా
.

ఓసి పిచ్చి పిల్లా, అందాల భరిణా,
ఏదీ అద్దాన్నిదగ్గరగా తీసుకునిచూడు!
వత్సరాల్ని చక్రం లా దొర్లించే కాలం
ప్రేమతో నీకన్ని అందాలూ కుప్పపోసింది
.

నీకు కాలమంటే కాలాతీతం;
ఈ నెలలూ సంవత్సరాల లెక్కలు మనుషులకి.
ఒక ఏడాది, ఒక ముఫ్ఫై ఏళ్లనగా ఎంత
నీలాంటి సౌందర్యాలరాశికి?
.

ఒహో మిరాండా! “రేయి”కి మళ్ళీ ముఫ్ఫయ్యో ఏడు వస్తుందా?
అయినా దాని తనువు మృదువుగా లేదూ ;
ఏదీ, నీ అద్దం చేతిలో తీసుకుని మిరాండా,
వసంతానికి వయసెంతో చెప్పు చూద్దాం?
.

Image Courtesy: http://baltimoreauthors.ubalt.edu

ఓగ్జెన్ నాష్

(ఆగష్టు 19, 1902 – మే 19, 1971)

అమెరికను కవి . అతను తన అంత్యానుప్రాసలకీ, హాస్య/ చతుర కవితలకీ సుప్రసిధ్ధుడు.

న్యూయార్క్ టైమ్స్ పత్రిక అతని మరణవార్త ప్రకటిస్తూ, “అసాంప్రదాయక అనుప్రాసలతో కూడిన అతని హాస్య కవితలు, దేశంలోని ప్రముఖహాస్య కవిగా గుర్తింపబడేలా చేశాయి” అని వ్రాసింది.

.

A Lady Who Thinks She Is Thirty

.
Unwillingly Miranda wakes,
Feels the sun with terror,
One unwilling step she takes,
Shuddering to the mirror.

Miranda in Miranda’s sight
Is old and gray and dirty;
Twenty-nine she was last night;
This morning she is thirty.

Shining like the morning star,
Like the twilight shining,
Haunted by a calendar,
Miranda is a-pining.

Silly girl, silver girl,
Draw the mirror toward you;
Time who makes the years to whirl
Adorned as he adored you.

Time is timelessness for you;
Calendars for the human;
What’s a year, or thirty, to
Loveliness made woman?

Oh, Night will not see thirty again,
Yet soft her wing, Miranda;
Pick up your glass and tell me, then–
How old is Spring, Miranda?
.
Ogden Nash
(August 19, 1902 – May 19, 1971)
Frederic Ogden Nash (August 19, 1902 – May 19, 1971) was an American poet well-known for his light verse.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: