ముఫ్ఫయ్యో ఏడని చిన్నబోయిన చిన్నది … ఓగ్జెన్ నాష్

.
మిరాండా అయిష్టంగా నిద్ర లేచింది
ఎండని చూస్తూనే భయపడింది
అయిష్టంగానే ఒక అడుగు ముందుకివేసింది
వణుకుతూ అద్దం దగ్గరికి చేరింది
.
మిరాండాకి, మిరాండా దృష్టికి
వయసు పైబడింది, జుత్తు తెల్లబడింది, అసహ్యంగా ఉంది
నిన్న రాత్రి ఇరవైతొమ్మిదే తనకి
తెల్లారగానే ముఫ్ఫై వచ్చాయి వంటికి.
.
వీనస్ లా తళుకుమంటున్నా
ప్రభాతంలా ప్రకాశిస్తున్నా
వయసుగూర్చిన దిగులు వెంటాడగా
దుఃఖిస్తూ కూర్చుంది మిరాండా
.
ఓసి పిచ్చి పిల్లా, అందాల భరిణా,
ఏదీ అద్దాన్నిదగ్గరగా తీసుకునిచూడు!
వత్సరాల్ని చక్రం లా దొర్లించే కాలం
ప్రేమతో నీకన్ని అందాలూ కుప్పపోసింది
.
నీకు కాలమంటే కాలాతీతం;
ఈ నెలలూ సంవత్సరాల లెక్కలు మనుషులకి.
ఒక ఏడాది, ఒక ముఫ్ఫై ఏళ్లనగా ఎంత
నీలాంటి సౌందర్యాలరాశికి?
.
ఒహో మిరాండా! “రేయి”కి మళ్ళీ ముఫ్ఫయ్యో ఏడు వస్తుందా?
అయినా దాని తనువు మృదువుగా లేదూ ;
ఏదీ, నీ అద్దం చేతిలో తీసుకుని మిరాండా,
వసంతానికి వయసెంతో చెప్పు చూద్దాం?
.
