అనువాదలహరి

1819లో ఇంగ్లండు స్వరూపం … షెల్లీ, ఇంగ్లీషు కవి

Image Courtesy: http://1.bp.blogspot.com

.

[ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని భాగానికీ…  సమాంతరంగా ఉన్న నేటి మన రాజకీయ వ్యవస్థ అచ్చం అలాగే పనిచేస్తున్నాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన “Enclosure” చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని కార్పొరేటు సంస్థలకు, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి, రైతులు “Crop Holiday”కి దిగే పరిస్థితులు తీసుకొస్తున్నాయి.  ఇక ప్రజా ప్రతినిధుల, చిన్నా చితకా అధికారులదగ్గరనుండి ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచే అధికారం ఉన్నవారిదాకా అవినీతి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. సహ చట్టలవంటివి ఉన్నా వాటిని ఎలా నీరుగార్చాలో ప్రభుత్వాలకీ, నియమింపబడిన అధికారులకీ బాగా తెలుసు. న్యాయవ్యవస్థ కలుగజేసుకోగలిగిన సందర్భాలూ, పరిమితులూ స్వల్పం. మతం ప్రజల నైతిక ప్రవర్తనని ప్రభావితం చెయ్యలేక పోవడంతో, మతం, నైతిక వర్తనా దేనికదే, గాలికూడా చొరలేని ఇరుకు గదులైపోయాయి.

కవిత ముగించిన తీరులోనే,  మనం కూడా చెయ్యగలిగింది … ఏ అద్భుతమో జరిగి, ఈ దేశంకోసం, స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన ఏ మహానుభావుడైనా పునర్జన్మించి ఈ అల్లకల్లోలవాతావరణంలో దేశానికి ఒక మార్గదర్శనం చేస్తాడని ఆశగా  ఎదురుచూడడమే.]

.

రాజు …

           అంధుడూ, వివేకశూన్యుడూ, ఉన్మత్తుడూ,

           కాటికికాళ్ళుజాచుకుని అందరూ అసహ్యించుకునే ముదుసలి;

రాజ వంశీయులు …

           పసలేని జాతి కుక్కమూతిపింజలు,

           ప్రజలు చీదరించుకునే మందులు,

           మురుగునీటి మీది మురుగు;

పాలకులు…

           చూడరూ, తెలీదు, తెలుసుకోలేరు.

           అప్పటికే నీరసించిపోయిన దేశపు రక్తాన్ని తాగితాగి

           ఆ మైకంలో కళ్ళుమూసుకుపోయి పట్టురాలి పడిపోయేదాకా వేలాడే జలగలు;

ప్రజలు…

          ఆకలితో అలమటించి, బీడుబారిన తమ పొలాల్లో హత్యచేయబడ్డవాళ్ళు

సైన్యం …

          రెండంచులకత్తిలా ఒకపక్క స్వేచ్ఛని హత్యచేస్తూ, ఇంకొకపక్క దోచుకుంటుంది

చట్టం …

          ఆశావహం, ఉత్తమం అయినప్పటికీ వక్రభాష్యాలకుగురై నిరుపయోగం

మతం …

          క్రీస్తూ లేక, దేముడూ లేక పుస్తకంలో బందీ అయిపోయింది.

పార్లమెంటు…

         కాలం రద్దుచెయ్యని ఒక చట్టం.

.

         ఇక ఈ సమాధుల్లోంచి అద్భుతమైన ఏ  ప్రేతాత్మో పునరుజ్జీవించి

         ఈ  కారుచీకటిలో వెలుగు చూపించుగాక!

.

Image Courtesy: http://upload.wikimedia.org

                                                   పెర్సీ బిష్ షెల్లీ

                                        (4 August 1792 – 8 July 1822)

ఇంగ్లీషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో కీట్స్ లా రెండవ తరానికి ప్రాతినిధ్యం వహించే కవి షెల్లీ. అతనిలాగే  చిన్నవయసులోనే కీర్తిశేషుడయ్యాడు. అతని జీవితకాలంలో సమకాలీన మత, రాజకీయ విశ్వాసాలకు చాలాభిన్నమైన అభిప్రాయాలు గలిగిఉన్నందుకు అతన్ని పక్కకితోసిపెట్టినా మరణానంతరం అతని అభిప్రాయాలకి, అతని కవిత్వంతోపాటే సమున్నతమైన గౌరవం దక్కింది. కార్ల్ మార్క్స్, బెర్నార్డ్ షా, WB Yeats, ఆస్కార్ వైల్డ్ వంటి ప్రముఖులు అతన్ని ఇష్టపడ్డారు.  చారిత్రక ప్రథానమైన కథనంలో అతను అందెవేసిన చెయ్యి. అతని  Ozymandias, Ode to the West Wind, To a Skylark అన్న కవితలు అతనికి అజరామరమైన కీర్తి  సంపాదించిపెట్టేయి. కీట్స్ స్మృత్యర్థం షెల్లీ Adonais అన్న Pastoral Elegy వ్రాసేడు.

షెల్లీ “పీటర్లూ మారణహోమం” గా పిలవబడే …  మాంచెస్టర్ లోని సెయింట్ పీటర్ ఫీల్డ్ లో 1819లో ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలపై, ఆశ్వికదళం జరిపిన దాడికి … నిరశనగా ఈ కవిత వ్రాసేడు. (ఈ దాడిలో 15 మంది మరణించి కనీసం 600 మంది గాయపడ్డారు)

.

English in 1819 … PB Shelly

.

An old, mad, blind, despised, and dying king,–

Princes, the dregs of their dull race, who flow

Through public scorn, mud from a muddy spring,–

Rulers who neither see, nor feel, nor know,

But leech-like to their fainting country cling,

Till they drop, blind in blood, without a blow,–

A people starved and stabbed in the untilled field,–

An army which liberticide and prey

Makes as a two-edged sword to all who wield,–

Golden and sanguine laws which tempt and slay;

Religion Christless, Godless, a book sealed,–

A Senate—Time’s worst statute unrepealed,–

Are graves from which a glorious Phantom may

Burst to illumine our tempestuous day.

.

Percy Bysshe Shelly

(4 August 1792 – 8 July 1822)

Shelly belongs to the second generation poets of English Romanticism but, like Keats, is one of the major poets of Romantic Movement and died as young. He was closely associated with Byron too. Ozymandias, Ode to the West Wind, To a Skylark among others are his most quoted and critically acclaimed works. He immortalised Keats through his dedicatory poem Adonais. Because of his radical and outspoken views against oppression, religion and call for revolution and change, he was somewhat unpopular. However, after his death he was largely admired for his poetry and political views by people such as  Shaw, Marx, Oscar Wilde, Yeats etc.

This poem was written as a response to the brutal Peterloo Massacre  at St Peter’s Field, Manchester when 15 were killed and at least 600 injured by cavalry attacking a mass peaceful demonstration  in August 1819.

 

నడిసముద్రంలో ఒక రాత్రి … హెర్మన్ హెస్

Image Courtesy: http://www.virtualcrate.com

.

రాత్రి, కడలి అలలఊయల ఊపుతున్నప్పుడు,

మిణుకుమిణుకుమనే ఓ చుక్క మసకవెలుతురు

దాని విశాలకెరటాలపై పరుచుకున్నప్పుడు,

నా పనులన్నీ చక్కబెట్టుకుని

బంధాలు విదుల్చుకుని ఒక్కడినీ, సడిచేయకుండా

గుండెనిండాస్వచ్ఛమైన గాలిపీలుస్తూ

వేలదీపాలప్రతిబింబాలతో, చల్లగా మౌనంగా

సముద్రపుటుయ్యాలకి నన్నునేనప్పగించుకుని నిలుచుంటాను.

అపుడు నా స్నేహితులు తలపులోకొస్తారు

నా చూపులు వాళ్ళ చూపులలతో కలుసుకుంటాయి

ఒకరివెంట ఒకరిని అడుగుతాను, ఏకాంతంగా, నెమ్మదిగా:

“నీకు నేనంటే ఇంకా ఇష్టమేనా?

నా కష్టం నీకు కష్టంగానూ,

నా మృతి నీకు శోకించదగినదిగానూ కనిపిస్తాయా?

నా ప్రేమలో నీకు ఉపశమనము లభించి,

నా దుఃఖములో నీ దుఃఖపు ప్రతిధ్వని వినిపిస్తుందా?” అని.

.

అపుడు సాగరము ప్రశాంతంగా, నా కళ్ళలోకి చూస్తూ,

చప్పుడుచేయని మొలకనవ్వునవ్వి అంది: “లేదు”అని.

మరెకెక్కడనుండీ కాదని గాని ఔననిగాని,

సమాధానాలు వినిపించలేదు.

.

Image Courtesy: http://en.wikipedia.org

హెర్మన్ హెస్

(2 జులై 1877 – 9 ఆగష్టు 1962)

1946 సంవత్సరానికి హెర్మన్ హెస్ కి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. అతని నవల లన్నిటిలో ఆత్మకథ ఛాయలతోపాటు, మనిషి తన ఉనికి గురించీ, వాస్తవికత గురించీ, ఆత్మస్వరూపం గురించీ తెలుసుకుందికి చేసే ప్రయత్నం ఉంటుంది. అతనికి భాషపైన మక్కువ తండ్రినుండి సంక్రమిస్తే, సంగీతం, కవిత్వంమీద అభిమానం తల్లినుండి సంక్రమించింది. అతనికి చిన్నప్పుడే అనుప్రాసలపై వయసుకిమించిన సాధికారత పట్టుబడింది. అయితే మహామొండి మనిషని తల్లి వాపోయింది. మతసంబంధమైన పాఠశాలనుండి పారిపోయిన తను, తల్లిదండ్రులతో విభేదాలు, ఆత్మహత్యా ప్రయత్నం, మానసిక వైద్యశాలలో ఉండవలసిరావడం వంటి సమస్యలను అధిగమించి, చివరకు ఒక పుస్తకాల షాపులో Packer గ ఉద్యోగం ఇష్టపడి సంపాదించి, తన తీరిక సమయాలలో గేథే, షిల్లర్, లెస్సింగ్ వంటి కవులూ,కళాకారులగురించీ, వాళ్ళరచనలనీ చదవడంతోపాటు, జర్మను రొమాంటిసిజం తో మొదటిసారి పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇక అతని సాహిత్యపిపాస,నిజజీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగిచూడలేదు. ఈ రోజు హెర్మన్ హెస్ అనగానే గుర్తొచ్చేవి సిధ్ధార్థ నవలతోబాటు, కార్ల్ యూంగ్ (Carl Jung) తో పరిచయం పురస్కరించుకుని వ్రాసిన మనోవైజ్ఞానిక నవల”Demian”, ఆత్మకథ ఛాయలున్న ” Steppenwolf”, అతని నోబెలు పురస్కార పత్రంలో పేర్కొన్న “The Glass Bead Game (also known as Magister Ludi) “.

.

At Night On The High Seas

.

At night, when the sea cradles me

And the pale star gleam

Lies down on its broad waves,

Then I free myself wholly

From all activity and all the love

And stand silent and breathe purely,

Alone, alone cradled by the sea

That lies there, cold and silent, with a thousand lights.

Then I have to think of my friends

And my gaze sinks into their gazes

And I ask each one, silent, alone:

“Are you still mine”

Is my sorrow a sorrow to you, my death a death?

Do you feel from my love, my grief,

Just a breath, just an echo?”

And the sea peacefully gazes back, silent,

And smiles: no.

And no greeting and no answer comes from anywhere.

.

Hermann Hesse

(July 2, 1877 – August 9, 1962)

German-Swiss Poet, Novelist, and Painter.

Hesse received Nobel Prize in Literature for the year 1946. All his novels, including Siddhartha (1922) his most famous, focus on the individual’s search for authenticity, self-knowledge and spirituality with a touch of autobiographical element. Hesse inherited taste for language from his father, and for poetry and music from his mother. He had a precocious ability to rhyme. As a rebel who ran away from a theological seminary and went through various ordeals including  intense conflicts with his parents, an attempted suicide, a stay in mental asylum, several misadventures with sundry jobs, till finally settling into a new apprenticeship with a book store with will, which changed the course of his life. He read Goethe, Lessing, Schiller and great German romantics there and his literary interests and career never looked back spite of some tragedies, problems and conflicts in the home front. Today Hesse is remembered for his novels Demian, one of the first few novels based on psychoanalysis, Steppenwolf with autobiographical under currents, and The Glass Bead Game (or, Magister Ludi) which was mentioned in the Nobel Prize citation.

వీడ్కోలు … లార్డ్ టెన్నిసన్


Image Courtesy: http://t3.gstatic.com

.

పరుగెత్తు, పరుగెత్తు చలువ సెలయేరా!
వడివడిగ వడివడిగ కడలికడకు
మెచ్చుకుని కెరటాలు కౌగిలిస్తాయిలే!
ఈ ఏటితీరాన నా కాలిగురుతులు
కనుమరగులైపోవు నింక అనవరతము.

పరుగెత్తు నెమ్మదిగ పరుగెత్తు శాంతముగ
పసరు మైదానాలలో పిల్ల సెలయేరుగా
పచ్చికబయళ్ళలో పొరలు జీవన నదిగ
నీ నీటితీరాల నా కాలిగురుతులు
కనరావు కన రావు ఇంక అనవరతము.

ఇక్కడొక “ఆల్డరు” నిట్టూర్పు విడిచితే
అక్కడొక “ఆస్పెన్” విలవిలవణుకులే
అటు యిటు తిరుగాడు ఆ నల్ల తుమ్మెదా
ఝుమ్మనుచు పాడులే ఇంక అనవరతము.

వేవేల సూర్యులూ నీ మీద మెరిసితే
ఆ వేల చంద్రులూ తేలియాడేరులే
ఏ వేళ నీ చెంత నా కాలి గురుతులూ
కనబోము కనబోము ఇంక అనవరతము.

.

Image Courtesy: http://upload.wikimedia.org

లార్డ్ టెన్నిసన్

ఆగష్టు 6, 1809 – అక్టోబరు 6, 1892


ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ విక్టోరియా మహరాణి ఏలికలో చాలాకాలం ఆస్థానకవి (Poet Laureate) గ ఉన్నాడు. అతని కవితలలో Charge of the Light Brigade అన్నది అతనికి అశేషమైన కీర్తి తెచ్చిపెట్టింది. అందులోని మాటలు కోట్స్ గా సాహిత్యం లో నిలిచిపోయేయి. అలాగే చారిత్రక విషయాలపై అతను రాసిన కవితలుగాక, ముఖ్యంగా టెన్నిసన్ అనగానే గుర్తుకు తెచ్చేవి Ulysses, In Memorium AHH, Crossing the Bar, Tears Tears Tears మొదలైన కవితలు.
ఈ కవిత తను పుట్టిపెరిగిన ఊరు Somersby లోని సెలయేటిపై తను తిరిగిరానని తెలిసి వెళుతున్నప్పుడు రాసిన అంకిత కవిత.

.

A Farewell

Flow down, cold rivulet, to the sea,
Thy tribute wave deliver:
No more by thee my steps shall be,
For ever and for ever.

Flow, softly flow, by lawn and lea,
A rivulet then a river:
Nowhere by thee my steps shall be
For ever and for ever.

But here will sigh thine alder tree
And here thine aspen shiver;
And here by thee will hum the bee,
For ever and for ever.

A thousand suns will stream on thee,
A thousand moons will quiver;
But not by thee my steps shall be,
For ever and for ever.

Alfred Lord Tennyson FRS.

(6 August 1809 – 6 October 1892)

Tennyson was a Poet Laureate during the reign of Queen Victoria and was famous for some of his short poems like “Charge of the Light Brigade” a historical poem of the battle at Balaclava during Crimean War ; his Virgilian lyric “Tears, Idle Tears” after his visit to Tintern Abbey, like William Wordsworth before him;  his elegiac Poem “Crossing the Bar” apart from many poems based on historical themes, Ulysses  and In Memorium AHH, to commemorate his friend, fellow poet and fellow student at Trinity College, Cambridge.

The above poem is a dedication to the brook in Somersby, Lincolnshire where he was born.నా భయాలు … జాన్ కీట్స్

Image Courtesy: http://www.janniefunster.com

ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు
తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను
అక్షరరూపంలో పుస్తకాలలోకి నా కలం అనువదించేదాకా
బతకనేమోనన్న భయం నన్నావహిస్తోంది.

నక్షత్రాచ్ఛాదిత నిశీధి ముఖం లోకి చూసినపుడు
దొరలాడిన మబ్బు దొంతరల శృంగారకేళీ విలాసము
తలుచుకుంటే, అదృష్టదేవత ఇంద్రజాలముచేసినా
జీవితంలో ఆ ఛాయ లనుకరించగలనని అనుకోను.

ఓ ఈక్షణిక సుందరీ!
నిన్ను మళ్ళీచూసేభాగ్యం నాకు లేదని
తలుచుకున్నప్పుడల్లా, ప్రతిఫలాపేక్షలేనిప్రేమ
సమ్మోహనశక్తిని ఆస్వాదించలేకున్నాను.

అందుకే, ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి
ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను.


.

Image Courtesy: http://upload.wikimedia.org

జాన్ కీట్స్

ఇంగ్లీషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో రెండవతరానికి ప్రాతినిధ్యం వహించే కవులలో జాన్ కీట్స్ మొదటివాడు. అతని జీవితం 25 సంవత్సరాలపాటే కొనసాగినా, అనారోగ్యం కారణంగా అతని సాహిత్య వ్యయసాయం               6 సంవత్సరాలకే పరిమితమయినా, ఆతని జీవితకాలం లో కేవలం 200 కాపీలకు మించి అతని కవిత్వం అమ్ముడుపోకపోయినా, తన స్నేహితులకు తన జ్ఞాపకార్థం విలువైన సాహిత్య కృషి మిగల్చలేదన్న విచారంతో చనిపోయినా, తర్వాత సుమారు రెండువందల సంవత్సరాలు గతించినా ఆతని కవిత్వం విశ్వవ్యాప్తంగా అభిమానుల్ని తెచ్చిపెడుతూనే ఉంది, పరిశోధనలకు పురికొల్పుతూనే ఉంది. అతని అసంతృప్తికరమైన సాహిత్య శేషమే ఇలా ఉంటే, అతను పదికాలాలపాటు బ్రతికి, తనకు మనసుకు నచ్చినట్టుగా వ్రాసి ఉండి ఉంటే, దానివిలువ ఎలా ఉండేదన్నది శేషప్రశ్న. ఈ కవితలో మృత్యు చాయలో ఉన్న అతను తన భయాలు చెబుతూ, కీర్తిప్రతిష్టలు, అవ్యాజమైన ప్రేమ అనుభవించలేని వాడికి వాటివిలువ శూన్యం అని చెబుతున్నాడు.

.

When I Have Fears

.

When I have fears that I may cease to be

Before my pen has glean’d my teeming brain,

Before high-piled books, in charactery,

Hold like rich garners the full ripen’d grain;

When I behold, upon the night’s starr’d face,

Huge cloudy symbols of a high romance,

And think that I may never live to trace

Their shadows, with the magic hand of chance;

And when I feel, fair creature of an hour,

That I shall never look upon thee more,

Never have relish in the faery power

Of unreflecting love;–then on the shore

Of the wide world I stand alone, and think

Till love and fame to nothingness do sink.

.

John Keats

31 October 1795 – 23 February 1821

A remarkable poet of the English Romantic Movement who lived for just 25 years, whose literary career spanned 6 years of writing and 4 years of publication and a measly 200 copies of his poetry sold in his life time and whose life was cut short cruelly by Consumption (TB), an incurable disease those days. Pity is that he died with a lot of dissatisfaction about his poetry  thinking that he did not leave any worthwhile work for his friends to remember.  If this corpus of work he left behind, in his opinion, did not mean anything to him, but the generations afterwards and the literary faculty found it outstanding, it is anybody’s guess what would have been the quality of his work had he lived longer and produced to the best of his satisfaction. The world at large is unfortunate.

In this poem he speaks his fears about his impending death and the futility of love and fame when they largely remain fairy.

ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు … మార్టిన్ నీమలర్

.

ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు
నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు
నేను కమ్యూనిస్టుని కాదుగదా!
.
తర్వాతవాళ్ళు  కార్మిక నాయకులకోసం వచ్చేరు.
నాకెందుకని ఊరుకున్నాను
నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి?
.
ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు
మనకెందుకని అడగలేదు
నేను యూదును కాదుగదా!
.

చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు
నన్ను వెనకేసుకుని రావడానికి
ఎవ్వరూ మిగల్లేదు.

.

మార్టిన్ నీమలర్

జర్మను  ప్రొటెస్టెంటు పాస్టరు.

(14 జనవరి 1892 – 6 మార్చి 1984)

“వాళ్ళు ముందు కమ్యూనిస్టులకోసం వచ్చేరు” అన్నవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాటలు. ఇది నాజీలు చేసిన ఘాతుకాలకు మనసు కరిగి, జర్మను మేధావులు ఏమీ పట్టకుండా ఉండడం వల్ల జరిగిన మానవమారణహోమానికి బాధతో మార్టిన్ నీమలర్ పలికిన పలుకులు. ఇవి కేవలం ఆ కాలానికే వర్తిస్తాయనుకోవడం పొరపాటు. చరిత్ర ఇప్పటికి ఎన్నోనిదర్శనాలు  ఇచ్చింది: ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత పాలకులు తమపదవిని నిలబెట్టుకుందికి ఎన్ని ఘాతుకాలు చెయ్యడానికైనా వెనుదియ్యరని. అది ప్రజాస్వామ్యమైనా, రాచరికమైనా, నియంతృత్వమైనా లేక ఇంకేరకమైన రాజ్యపాలన వ్యవస్థ అయినా. కనుక ప్రజలు వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళే అప్రమత్తులుగా ఉండాలి. ఈ కవితలో చెప్పినట్లు  అధికారులు చేసే అకృత్యాలు మనకు సంబంధం లేదని ప్రతిఘటించకుండా ఊరుకుంటే, మనకి సంబంధించిన అన్యాయం జరిగినపుడు, మనకి తోడు ఎవ్వరూ మిగలరు… అవి వాళ్ళకు సంబంధించినది కాదుగా మరి!

.

[Note: The origins of this poem were traced to the January 6, 1946, speech delivered by Martin Niemöller to the representatives of the Confessing Church at Frankfurt.  The text has several variants. For details visit: http://en.wikipedia.org/wiki/First_they_came%E2%80%A6]

.

First they came for the communists,

and I didn’t speak out

because I wasn’t a communist.

.

Then they came for the trade unionists,

and I didn’t speak out

because I wasn’t a trade unionist.

.

Then they came for the Jews,

and I didn’t speak out

because I wasn’t a Jew.

.

Then they came for me

and there was no one left

to speak out for me.

.

Deutsch: Briefmarke von Martin Niemöller
Deutsch: Briefmarke von Martin Niemöller (Photo credit: Wikipedia)

Friedrich Gustav Emil Martin Niemöller (14 January 1892 – 6 March 1984)

These are the most remarkable and controversial lines uttered by the Protestant German Pastor (and social activist) about the passiveness or pathy of the German intellectuals when the Nazi regime chose to decimate all opposition groups one after another. It is pertinent to all times and all places since people in power always try to perpetuate their reign, no matter what kind of polity it is, at the expense of people and their liberty.

సానెట్ LXVI: రాత్రి వరద భీభత్సం… ఛార్లెట్ స్మిత్

Image Courtesy: http://1.bp.blogspot.com

.

శిలలతో నిండిన సముద్రపుటొడ్డున
రాత్రి-వరద భీభత్సం సృష్టిస్తోంది:
అలుపులేక పోటెత్తిన తన కెరటాలక్రింద
సమాధికాబడ్డవాటికోసం
రంపపుపళ్ళలాంటి కొండకొనలమీదా,
చలువరాయి గుహల్లోనూ
బొంగురుగొంతుతో సముద్రం శోకిస్తోంది.

తవ్విపోస్తున్న తన కరకుకెరటాలతాకిడికి
ఎత్తైనమిట్టకొనకొమ్ము మీంచి
పచ్చికతోసహా ఒక శాలిబండ దొర్లుకుంటూ
అఖాతంలోకి దబ్బుమని నిలువుగాపడింది
నిశానిశ్శబ్దశ్రవణాలపై పిడుగుపడ్డట్టు.
దానిప్రతిధ్వనులకి ఒడ్డు ఒణికింది.

మనిషిజాడలేని ఈ తుఫాను రాత్రి
ఆకాసంలో తేలుతున్న మబ్బుతెరలమాటున
చంద్రుడు కళావిహీనంగా వెలుగుతున్నాడు;
యువతా, బడలిన శరీరాలూ హాయిగా కలతలేనిద్రిస్తుంటే,
నేనొకడినే లక్ష్యంలేకుండా తిరుగాడుతున్నాను.
నిట్టూర్పులతో ఎగసిన నా హృదయాన్ని ఉపేక్షించడమేగాక,
ఏడవడానికే మేలుకున్నకళ్ళనుకూడా తప్పించుకు తిరుగుతోంది నిద్ర!.

.

Image Courtesy: http://upload.wikimedia.org

ఛార్లెట్ స్మిత్ 

(4 May 1749 – 28 October 1806)

ఛార్లెట్ స్మిత్ జీవితం చాలాచిత్రమైనది. సంపన్నకుటుంబంలో పుట్టినా, తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో, ఆమెఎడబాటులో తండ్రి వ్యసనపరుడై దేశాలుపట్టిపోతే, పినతల్లి సంరక్షణలో పెరగడం, 15 ఏళ్ళకే ధనవంతుడేకాని చదువు అంతగాలేని, తాగుబోతు, వ్యభిచారితో వివాహం, చేసిన అప్పులుతీర్చలేని భర్తతో జైలుశిక్ష అనుభవించడం, అందులోనే మొదటిసారి సానెట్ లువ్రాయడం, అవి జనాదరణ పొందడమేగాక, డబ్బుగూడ తెచ్చిపెట్టడంతో జైలునుండి విముక్తి, ఇక తిరుగులేని రచనా వ్యాసంగం ఆమె ప్రత్యేకతలు.  ఆ కాలపు మేటి కవులు వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్, రాబర్ట్ సదే లతొ స్నేహం నెరపింది. సుమారు 10 నవలలూ, 3 కవితాసంకలనాలూ, పిల్లలకు కథలూ, ఒక నాటకం, ఇలా అనేక ప్రక్రియలలో సాహితీవ్యాసంగం, తనదైనగొంతుక, తననిజజీవితాన్ని నవలలలో ప్రతిఫలింపజేయగలశక్తీ, రొమాంటిక్  ఇతివృత్తం నుండి, సెంటిమెంటుప్రథానంగాగల ఇతివృత్తాలవైపు నవలను మలచిన తీరు, సానెట్ లను తిరిగి  ఇంగ్లీషు సాహిత్యం లోకి ప్రవేశపెట్టిన తీరూ బ్రిటిషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో ఆమెకు ఒక ప్రత్యేక  స్థానాన్ని కల్పించేయి.  Beachy Head and Other Poems, Elegiac Sonnets, The Old Manor House, ఆమెకు శాశ్వతమైన కీర్తి తెచ్చిపెట్టాయి.

.

Sonnet LXVI: The Night-Flood Rakes

.

The night-flood rakes upon the stony shore;
Along the rugged cliffs and chalky caves
Mourns the hoarse Ocean, seeming to deplore
All that are buried in his restless waves—
.

Mined by corrosive tides, the hollow rock
Falls prone, and rushing from its turfy height,
Shakes the broad beach with long-resounding shock,
Loud thundering on the ear of sullen Night;
.

Above the desolate and stormy deep,
Gleams the wan Moon, by floating mist opprest;
Yet here while youth, and health, and labour sleep,
Alone I wander—Calm untroubled rest,
.

“Nature’s soft nurse,” deserts the sigh-swoln breast,
And shuns the eyes, that only wake to weep!

.

Charlotte Turner Smith

(4 May 1749 – 28 October 1806)

Charlotte Smith is recognised as one of the leading voices of English Romantic Movement. And there is literary evidence that Wordsworth studied her and made elaborate notes on her Sonnets, before he embarked upon the joint venture Lyrical Ballads with Coleridge. She is reputed for the revival of Sonnet. She had a very chequered life due to the careless living of her father, her early marriage to another spendthrift, her having to take to writing when she was in debtor’s prison with her insolvent husband, her phenomenal success as a poet and novelist and finally, her dying … neglected and uncared for. During her long literary career she produced Ten Novels, (one of them “Desmond” called very radical for supporting French Revolution, and some others very popular for their autobiographical shades) Three volumes of poetry, some collections of short stories for children, a play and few other works. Remarkable is her courage amidst odds and equally remarkable her unflinching flair for writing to the last.  The “Elegiac Sonnets” and posthumous publication “Beachy Head and Other Poems (1807)”, The Old Manor House” and “Emmeline”(novels) have brought her a lasting fame.

ఆమె నడకే అందం… లార్డ్ బైరన్

Image Courtesy: http://1.bp.blogspot.com

.

మబ్బులేని రాత్రి,
ఆకాశంలోనిచుక్కల్నివెంటేసుకునివచ్చే చీకటిలా
ఆమె అందంగా నడుస్తోంది.
అసలు,
ఆ తెలుపు నలుపులలోని వన్నె అంతా
ఆమె కన్నులలోనూ,
రూపంలోనే మిళితమై ఉంది:
పరువానికొచ్చిన ఆ వెలుగు జిలుగు
ప్రకృతి పగటికికూడా ప్రసాదించలేదు.

ఆ నీలికురుల ప్రతి కదలికలోనూ
ఆ ముఖపు ప్రతి కవళికలోనూ
లలితంగా జాలువారే
ఆ అజ్ఞాత సౌందర్యానికి
నలుపు చిన్నమెత్తు ఎక్కువైనా,
వెలుగు ఓ రవ్వ తక్కువైనా
లోపమేమీరాదు:
ఎప్పుడూ గంభీరంగా తేనెలొలుకుతూ ఉండే
ఆ ఆలోచనల పుట్టినిల్లు
ఎంత స్వఛ్ఛమైనది! ఎంత ప్రియమైనది!

ఆ చెక్కిలి మీద,
ఆ కనుబొమల మీద
అరవిరిసిన నవ్వుల జాడ,
సుతిమెత్తగా, సుకుమారంగా
అయినా ప్రస్ఫుటంగా… ప్రకాశిస్తూ,
మంచిగా గడిపిన గతాన్ని గుర్తుచేస్తూ,
ఆ హృదయపు అమాయకపు ప్రేమనీ,
మనశ్శరీరాల సఖ్యతనీ తెలియబరుస్తోంది.

.

[ఇది లార్డ్ బైరన్ కి బాగా పేరు తెచ్చిన కవితలలో ఒకటి.

ఇది బైరన్ ఒకానొక శోక సమయంలో, వివాహం ద్వారా తనకు బంధుత్వం కలిసి, నల్లని దుస్తులుధరించి మొదటిసారి జీవితంలో అతనికి తారసపడిన సుందరి Mrs Wilmot మీద ఈ కవిత వ్రాసాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకొందరు అతని సవతి చెల్లెలు Auguata మీద వ్రాసేడని అంటారు. ]

.

లార్డ్ బైరన్

(1788–1824)

.

She Walks in Beauty

She walks in beauty, like the night
Of cloudless climes and starry skies;
And all that’s best of dark and bright
Meet in her aspect and her eyes:
Thus mellow’d to that tender light
Which heaven to gaudy day denies.

One shade the more, one ray the less,
Had half impaired the nameless grace
Which waves in every raven tress,
Or softly lightens o’er her face;
Where thoughts serenely sweet express
How pure, how dear their dwelling-place.

And on that cheek, and o’er that brow,
So soft, so calm, yet eloquent,
The smiles that win, the tints that glow,
But tell of days in goodness spent,
A mind at peace with all below,
A heart whose love is innocent!
.
1815.

Image Courtesy: http://upload.wikimedia.org

George Gordon Lord Byron

(1788–1824)

Where else is my carkless repose? … Usharani

Courtesy: Usharani (from her web album)

.

Woods are my birth place

There are comrades every way

Silken carpets of green pastures

Delicate dangling of baby branches

Ornate flowery ornaments

Fluting whispering winds

Concerts of wings on flight

Choreography of cascading steps…

.

I am a contented soul in my dominion.

.

Usharani

(Usharani is located in US and is a blogger since 2008 running her blog:  ” http://maruvam.blogspot.com/” )

The poem highlights, in my opinion, the urge for freedom and a longing for one’s roots, and asserts that one can remain safe and content in one’s own domain… may be a common urge / a recurring theme for expats.

.

అభయావాసం ఇంకెక్కడవుంది?

.

అడవి నా పుట్టినిల్లు

అడుగడుగున నేస్తాలు

పచ్చికబైళ్ళు పట్టుకంబళ్ళు

పూలసరాలు ఆభరణాలు

లేతరెమ్మలు వీవెనలు

గాలిస్వరాలు వేణువులు

ఎగిరే రెక్కల కచ్చేరీలు

కదిలే పాదాల నాట్యాలు

స్వస్థానాన నేను నవ్వే మనిషిని.

.

ఉషారాణి

.

ఉషారాణిగారు 2008 నుండి తమ “maruvam.blogspot.com” అన్న బ్లాగు  నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికావాసి.

I Have No Nat… Afsar

.

I am some limb

Lingering under a hollow head

You never told me

Where I originated from

Who brought me up or

Why I was partitioned exactly in ’47

Cutting off, or appropriating each limb of God

Else, looting them for yourself,

You did not leave anything for me.

I am an ethereal shadow

A soul disposed of secretly

Over the wall

I am wandering about countries…

Thought each one of them my own and

Each station and every door mine

But, no bumblebee gives out my address.

Some vermilion hands

Ploughed away the land under my feet

The dust from those temple towers knocked down

Piles up on my fluttering body entombing it.

Palling my eyes with eyelids

Everybody rends my cool body

Snatching his pound of flesh…

My body is now an Al Kabir!

I am dropping down dead on the gory Bombay streets

Unable to identify my own cadaver.

I am an enigmatic junction, passing over which

Nobody knows where he is heading to .

I am an inhabitant of this vacuous world, for truth

But, always an exile wherever I might live.

Sinking one half of me in darkness,

I illusion the other half is all bright

Diving into my inner vortices

I kill the soul of Time each second

I ask for no kingships and no kin-shares

I have no language

To ask for my veins deracinating them .

I am satisfied with some semblance of shelter on earth

No matter there’s no room to bury me beneath.

The land I live is sanctimonious to me, pray!

Don’t cast me off somewhere,  like a desecrated cloth.

Not with forty-seven

I ask you to divide me by myself

My rejoices, my wails

My insults and my suspicions

These molestation and murdering of me

Are not mine, and mine alone…  but yours too.

Please don’t abominate the amniotic fluid of my mother.

You foes who divide and rule!

You can’t sever me into two.

Nor, can you blow my pupils off.

 .

Afsar

.

(Written on some Dec 6)

.

నా కేజన్మభూమీ లేదు!    

 

శూన్యం తలకింద             

నేనేదో వొక అవయవాన్ని.

నే నెక్కణ్ణించిపుట్టానో 

ఎలాపెరిగానో          

’47 దగ్గిరే ఎలా విరిగానో

మీరెవరూ చెప్పలేదుగా

దేవుడిఅంగాంగాన్నిపంచుకొని కోసుకొనీ

లేదంటే దోచుకోనీ వెళ్ళినమీరంతా

నా కేమీ మిగల్చలేదుగా

నేను శరీరంలేని  నీడని

గోడమీంచో రహస్యంగా

పారేయబడిన ఆత్మని

దేశదేశాలూ పట్టుకుతిరుగుతున్నాను

అన్నిదేశాలూ నావే అనుకుంటున్నాను

ఊరూరూ ఇల్లిల్లూ నాదినాదనే అనుకుంటున్నాను

తుమ్మెదా నా చిరునామా చెప్పదు.

ఇక్కడెక్కడో నాకాళ్ళకిందనేలని           

కుంకుమచేతులు కోసుకెళ్ళిపోయాయి.    

అక్కడెక్కడోకూలిన గోపురాల దుమ్మంతా              

రెపరెపలాడ్తున్ననాదేహమ్మీద సమాధికడుతోంది.   

రెప్పలవస్త్రాలుకళ్ళకి కప్పి                 

నా వొంటిమీదిచల్లనిమాంసాన్ని          

ఎవరెవరోఅపహరిస్తున్నారు.           

నావొళ్ళువొకఅల్కబీర్!

నాకు నేనే గుర్తుతెలియనిశవాన్నయి 

బొంబాయీనెత్తుటిరోడ్లమీదకుప్పకూలిపోతున్నాను.

నే నెవ్వరికీ అంతుదొరకని కూడలిని                  

 నామీంచి ఎవరెటువెళ్తారో తెలీదు

 

నిజంగా నేనుశూన్యలోకవాసిని

ఎక్కడయినాఎప్పుడయినా ప్రవాసిని.    

నాలో గాన్నిచీకట్లోముంచి                        

ఇంకోసగం అంతావెలుగేవెలుగు అనుకుంటున్నభ్రమని.

నాలోపలివలయాల్లోకి నేనేదూకి                         

కాలంఆత్మని క్షణక్షణం హత్యచేస్తున్నవాణ్ని.

అర్ధరాజ్యాలూ అంగరాజ్యాలూ కోరను                

నా నాడుల్నినాకు కోసిమ్మనడానికి                   

భాషాలేనివాణ్ని.

శవమయిదాక్కోడానికివున్నాలేకపోయినా        

తలదాచుకోవడానికి చారెడునేల చాలంటాను.    

ఉన్నచోటే పవిత్రమనుకుంటున్నవాణ్ని                

ఎక్కడెక్కడోఆంటీముట్టనిబట్టలా విసిరేయొద్దంటాను.

నలభైఏడుతోకాదు                                   

నాతోనన్నేభాగించమంటాను.                      

నా నవ్వులూ నా ఏడ్పులూ                           

నా అవమానాలూ, నా అనుమానాలూ              

నా మానభంగాలూ హత్యలూ                       

అన్నీమీవికూడా అంటాను.

నాతల్లివుమ్మనీరుని వుమ్మిచెయ్యొద్దంటాను

విభజించిపాలించే నా శత్రువులారా,            

నన్నెవరూ రెండుగా చీల్చలేరు.                 

నా కనుపాపల్నిఎవరూపేల్చలేరు.

.

అఫ్సర్  

(ఒక డిసెంబరు ఆరు కి రాసిన కవిత…)

పిచ్చికుక్క స్మృతికి… Oliver Goldsmith

Image Courtesy: http://covers.openlibrary.org

.

మంచి మనసున్న మనుషులు మీరంతా
నా పాట కాస్త చెవొగ్గి వినండి
ఇది మీకు వింతగా అనిపించకపోతే
మీ పని మీరు చేసుకుందురుగాని

ఇస్లింగ్టన్ లో ఒక మనిషుండేవాడు
అతని గురించి లోకమేమనుకునేదంటే
అతను ప్రార్థన చెయ్యడానికి నిలబడితే
ఆ దేముడే దిగివచ్చేడా అని అనిపించేదట.

మిత్రులనీ శతృవులనీ అనునయించడానికి
అతనికి సున్నిత, దయార్ద్ర హృదయముంది
అతను వస్త్రధారణచేసేడంటే కేవలం
తన నగ్నత్వాన్ని కప్పిపుచ్చడానికే

వేటకుక్కల్లాంటి మేలుజాతి మొదలు
సంకరజాతివీ, నాటుకుక్కలదాకా
ఉన్న ఆ ఊర్లో,  ఒక కుక్క ఉంది
మిగతా కుక్కల లాగే

మొదట్లో కుక్కకీ అతనికీ మంచి స్నేహమే
కాని వాళ్ళిద్దరిమధ్యా బెడిసికొట్టినతర్వాత
దాని గొప్పచాటుకుందికేమో అన్నట్టు
పిచ్చెక్కి, అతన్ని గట్టిగా కరిచేసింది

ఆ చుట్టుపక్కల వీధుల్లోంచి
అందరూ ఆశ్చర్యపోతూ పరిగెత్తుకొచ్చేరు
అంతమంచివాడిని కరిచిందంటే, ఖచ్చితంగా
దానికి పిచ్చెక్కి ఉంటుందని తిట్టిదిగపోసారు

పచ్చి పుండులాంటి గాయం చూస్తుంటే,
క్రిస్టియన్ అన్న వాడికెవడికైనా బాధేస్తుంది
దానికి పిచ్చెక్కిందని నిందిస్తూనే, పాపం అతను
చావడం ఖాయం అని నిశ్చయించుకున్నారు

కాని అంతలోనే వింతల్లోకి వింత ఒకటి జరిగి
వాళ్ళందరూ ఎంత దుర్మార్గులో తెలిసొచ్చింది
అందరూ అనుకున్నట్టుగాగాక, అతను తేరుకున్నాడు
ఎటొచ్చీ చచ్చిపోయింది, పాపం, ఆ కుక్కే!

.

ఆలివర్ గోల్డ్ స్మిత్

(నవంబరు 10, 1730 – ఏప్రిల్ 4, 1774)

ఇంగ్లీసు-ఐరిష్ కవీ, నాటక కర్తా, నవలా కారుడూ.

[ఇస్లింగ్టన్ అన్నది ఉత్తరలండనులో ఒకప్రదేశం(ఇప్పుడు లండను మహానగరంలో ఒక భాగమైపోయింది). ఆ రోజుల్లో జల్సాలకీ, పోకిరీ రాయుళ్ళకీ ప్రసిధ్ధి. ఈ కవితలో పైకి చాలా సాదాసీదాగా కనిపిస్తుంది గాని, ఇందులో వక్రోక్తి (Irony)ద్వారా కవి మంచి సందేశాన్ని అందిస్తున్నాడు…. కుక్కకాటుకంటే మనిషికాటు ఇంకా ప్రమాదకరమైనదని. ఇక్కడ మనిషి “నగ్నత్వం (Nakedness)” (అంటే సమాజానికి ప్రకటించే స్వరూపం కాక అసలు వ్యక్తిత్వం) మీద అతని చమత్కారం గమనించదగ్గది.]

ఆలివర్ గోల్డ్ స్మిత్ అనగానే The Deserted Village అన్న గొప్ప కవితా, The Vicar of Wakefield అన్న నవలా, She Stoops to Conquer అన్న Commedy of Manners నాటకం గుర్తొస్తాయి. 18వ శతాబ్దంలో బ్రిటిషుపార్లమెంటు Inclosure చట్టాన్ని తీసుకువచ్చి రైతులని రైతుకూలీలుగా మార్చినప్పుడు, ఒక గ్రామానికి గ్రామాన్నే నేలమట్టం చేసినప్పుడు హృదయం ద్రవించి వ్రాసిన ఆర్త గీతి The Deserted Village .

.

An Elegy on the Death of a Mad Dog

.

Good people all, of every sort,
Give ear unto my song;
And if you find it wondrous short,
It cannot hold you long.

In Islington there was a man
Of whom the world might say,
That still a godly race he ran—
Whene’er he went to pray.

A kind and gentle heart he had,
To comfort friends and foes;
The naked every day he clad—
When he put on his clothes.

And in that town a dog was found,
As many dogs there be,
Both mongrel, puppy, whelp, and hound,
And curs of low degree.

This dog and man at first were friends;
But when a pique began,
The dog, to gain some private ends,
Went mad, and bit the man.

Around from all the neighbouring streets
The wond’ring neighbours ran,
And swore the dog had lost its wits
To bite so good a man.

The wound it seemed both sore and sad
To every Christian eye;
And while they swore the dog was mad,
They swore the man would die.

But soon a wonder came to light
That showed the rogues they lied,—
The man recovered of the bite,
The dog it was that died!

Image Courtesy: http://upload.wikimedia.org

Oliver Goldsmith

(10 November 1730 – 4 April 1774)

An Anglo-Irish Poet, Dramatist, and Novelist.

%d bloggers like this: