అనువాదలహరి

వైరుధ్యం … లాంగ్స్టన్ హ్యూజ్.

.

నా ముసిలి తండ్రి తెల్లవాడు

నా ముసిలి తల్లి నల్లది.

.

ఏప్పుడైనా మా నాన్నని తిట్టుకుని ఉంటే

అవన్నీ ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను.

ఎప్పుడైనా మా అమ్మని

‘నరకానికి పోయింది కాద’ని తిట్టుకుని ఉంటే

అలా అన్నందుకు విచారిస్తున్నాను.

ఇప్పుడామె సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను.

.

మా ముసలయ్య పెద్ద భవంతిలో పోతే,

మా ముసలమ్మ గుడిసెలో చనిపోయింది.

నాకు ఎక్కడపోతానా అని ఆశ్చర్యమేస్తుంటుంది

ఎందుకంటే, నేను తెల్లవాణ్ణీ కాదు నల్లవాణ్ణీ కాదు

.

లాంగ్స్టన్ హ్యూజ్. 

(గమనిక: ఈ కవితని యధాతథంగా చూస్తే ఇందులో జాతి వివక్షకు సంబంధించిన ఛాయలున్నట్టుగా కనిపిస్తుంది పైకి.  మనం మన జీవితాల్లో మన అపజయాలకు ఎవరో ఒకరు కారణమని నిందిస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా మన తల్లిదండ్రులని వారు ఇచ్చిన వాటికీ (రంగు, రూపు, జాతి, కులం) ఇవ్వనివాటికీ (ఆస్తిపాస్తులు).  కాని మనం ఎదిగి పరిణతి చెందేక మన అపజయాలకు మనమే పూర్తిగా బాధ్యులమనీ వేరెవరూ కాదని అర్థం చేసుకుంటాం.  ఈ సత్యం మనకు విశదమైన తర్వాత మన మనసుల్లో ఎప్పుడైనా ఆవేశంలో తల్లిదండ్రులపట్ల చేసిన అపచారాలు గుర్తుకొచ్చి మనల్ని  మన్నించవలసిందిగా ప్రార్థిస్తాం. ఆదే ఈ కవిత సందేశం. ఈ భావనతో మరొక సారి ఈ కవితని చదివి చూడండి)

.

Cross

.

My old man’s a white old man

And my old mother’s black.

If ever I cursed my white old man

I take my curses back.

If ever I cursed my black old mother

And wished she were in hell,

I’m sorry for that evil wish

And now I wish her well

My old man died in a fine big house.

My ma died in a shack.

I wonder where I’m going to die,

Being neither white nor black?

.

Langston Hughes

(Note:  On the face of it this poem appears to have racial overtones.  But he is used is as a cover. We tend to blame somebody or other for our failures and when we were young we might have cursed our parents  for what they gave (colour, complexion, race and lineage) and for what they did not give (material things). But when we grow and mature in life, we realize it’s us that are squarely responsible for our successes or failures. When this wisdom dawns upon us, we realize our mistake and seek pardon of our parents. That is the essence of this poem.  Please read this poem in this light once again and make your opinion.)

%d bloggers like this: