అనువాదలహరి

ప్రాచ్య గీతం… ఏలన్ జింజ్బెర్గ్

Image Courtesy: http://t3.gstatic.com

.

నేను నాకు గుర్తుకొస్తున్న ప్రేయసి గురించి చెబుతాను:

ఆ చంద్రముఖి ఎంతో విశ్వసనీయురాలు, తెరలమాటున ఉన్నప్పటికీ…

ఆమె పలుకకపోయినా, ఆలోచనలలో నిత్యం మెదులుతూనే ఉంటుంది

సంరక్షణ బాధ్యతలు ఆమెని నా పట్ల ఉదాసీనురాలిగా చేసినై

.

సముద్రం అంత గంభీరంగానూ, భూమి అంత గహనంగానూ

ఉంటాయని ఎన్నడూ ఊహించలేదు; గాఢనిద్రలో పడి

నేను మరో పిల్లవాణ్ణయిపోయా; లేచి చూస్తే,

 ప్రపంచం అంతా మమతతో కేరింతలుకొడుతోంది.

.

Image Courtesy: http://upload.wikimedia.org/wikipedia

.

ఏలన్ జింజ్బెర్గ్

(June 3, 1926 – April 5, 1997)

Beat Generation గ పిలవబడే రెండవ ప్రపంచ యుద్ధానంతర అమెరికను కవులలో ఏలన్ జింజ్బెర్గ్ ప్రముఖులు.  ఈ కవులు అమెరికను పెట్టుబడిదారీ వ్యవస్థనీ, అందులోని భౌతికవాదాన్నీ (materialism) తిరస్కరించి, డ్రగ్స్ లో ప్రయోగాలు చేస్తూ, ప్రాచ్యదేశాల మతాలపట్ల కుతూహలం కలిగి ఉండేవారు.  “హౌల్ (Howl) ” అన్న కవితా, దానిపై చెలరేగిన దుమారమూ, ఇతనికి ప్రాచుర్యాన్నీ కీర్తినీ తెచ్చిపెట్టింది. 1950లలో ఉండే అమెరికను సమాజములోని కొన్ని అవలక్షణాలను ఇతను తీవ్రంగా దుయ్యబట్టారు.

అతను బౌధ్ధమతావలంబి. వాసమూ, వేషమూ రెండింటిలో చాలా సాదాసీదా గా ఉంటూ, తన సంపాదనలో అధికభాగాన్ని లాభాపేక్షలేని సంస్థలకు దానం చేశారు.

Fall of America అన్న ఇతని కవితాసంకలనం 1974లో National Book Award for poetry గెలుచుకుంది.  1979లో National Arts Club వారి బంగారు పతకాన్ని గెలుచుకోవడమే గాక, 1995లో Pulitzer Prizeకి ఎన్నికైన రచయితల తుది జాబితాలోఇతనిపేరు కూడా ఉంది.

.

An Eastern Ballad

.

I speak of love that comes to mind:

The moon is faithful, although blind;

She moves in thought she cannot speak.

Perfect care has made her bleak.

.

I never dreamed the sea so deep,

The earth so dark; so long my sleep,

I have become another child.

I wake to see the world go wild.

.

Allen Ginsberg.

(June 3, 1926 – April 5, 1997)

Irwin Allen Ginsberg was a  leading figure of the Beat Generation and an antagonist to the American militarism, materialism and sexual repression of the 1950s. “Howl” is his most celebrated poem where he denounces the destructive forces of capitalism and conformity prevailing in United States.

Ginsberg was a practising Buddhist who lived modestly, buying his clothing in second-hand stores and living in downscale apartments in New York’s East Village. His book of poems Fall of America won National Book Award for poetry in 1974. He won National Arts Club gold medal in 1979 and was a Pulitzer Prize finalist in 1995.

%d bloggers like this: