అనువాదలహరి

కపాల లిఖితం … లార్డ్ బైరన్.

Image Courtesy: http://t3.gstatic.com

.

భయపడకు… నా ఆత్మ లేచిపోయిందని అపోహపడకు.

నాలో కపాలాన్ని మాత్రమే చూడు

బ్రతికున్న బుర్రల్లోంచి ప్రవహించేవాటిలా

నాలో ప్రవహించేదేదీ నిరుత్సాహం కలిగించదు

.

నీ లాగే నేనూ ఒకప్పుడు జీవించేను, ప్రేమించేను, తాగేను,

మరణించి నా ఎముకలను నేలకి అప్పగించేను.

నింపుకో… నన్ను నువ్వు బాధించ లేవు;

క్రిముల పెదాలు నీ పెదాలకంటే కంపుగొట్టేవి

.

కులకులలాడే వానపాములని పోషిస్తూ

వాటి ఆహారమై మిగిలే కన్న

మెరిసే మదిరని మోస్తూ

సురాపానపాత్రగా తిరుగాడమే మిన్న

.

నా సరసోక్తులొకప్పుడు పొరపాటున,

ఇతరులనెచట మెప్పించేయో, నన్నచట ఓ వెలుగు వెలగనీ.

పాపం! చివరికి, నా మెదడు తినేసినచోట

మదిరను మించిన ప్రత్యామ్నాయమేముంది?

.

తాగగలిగినంత సేపు తాగు; రేపు మరొక జాతి,

నువ్వూ, నీ జాతీ అంతరించిన పిదప,

నేలతల్లి ఒడినుండి నిన్ను వెలికి తీసి

పితరులకోసం చిందులేస్తూ, నృత్యగీతాలాలపిస్తారు.

.

ఏం? ఎందుకు కాకూడదు? నీ స్వల్ప జీవితం లోనే

మా తలలకటువంటి విషాద పరిణామం  కలిగినపుడు

క్రిముల్నుండి, మట్టిలో కలిసిపోవడం నుండీ మిమ్మల్ని

రక్షించే తరువాతి అవకాశం వాళ్ళదెందుకు కాకూడదు?

.

జార్జ్ గార్డన్ బైరన్

(22 January 1788 – 19 April 1824)

లార్డ్ బైరన్ గా ప్రఖ్యాతి వహించిన జార్జ్ గార్డన్ బైరన్,  బ్రిటనుకి చెందిన కవీ, రొమాంటిక్ మూమెంట్ లోని ప్రధాన వ్యక్తులలో ఒకరు.  ఇంగ్లండులోని ప్రముఖ రాయల్ సొసైటీ సభ్యుడు కూడా.

“She Walks in Beauty”, “When We Two Parted”, and “So, we’ll go no more a roving”  అన్నవి “Childe Harold’s Pilgrimage” and “Don Juan”  లతో పాటు అతనికి అమితమైన కీర్తిని తీసుకు వచ్చిన రచనలు.

అతను ఇప్పటికీ గొప్ప బ్రిటిషు కవిగా గుర్తింపబడడమేగాక, సాహిత్య పరిశోధనలమీదా, రచనల మీదా ఇప్పటికీ అతని ప్రభావం కనపడుతుంది.

Image Courtesy: http://upload.wikimedia.org.

.

Lines Inscribed Upon A Cup Formed From A Skull

.

Start not—nor deem my spirit fled:
In me behold the only skull
From which, unlike a living head,
Whatever flows is never dull.

I lived, I loved, I quaffed like thee;
I died: let earth my bones resign:
Fill up—thou canst not injure me;
The worm hath fouler lips than thine.

Better to hold the sparkling grape
Than nurse the earthworm’s slimy brood,
And circle in the goblet’s shape
The drink of gods than reptile’s food.

Where once my wit, perchance, hath shone,
In aid of others’ let me shine;
And when, alas! our brains are gone,
What nobler substitute than wine?

Quaff while thou canst; another race,
When thou and thine like me are sped,
May rescue thee from earth’s embrace,
And rhyme and revel with the dead.

Why not—since through life’s little day
Our heads such sad effects produce?
Redeemed from worms and wasting clay,
This chance is theirs to be of use

.

George Gordon Byron

FRS (22 January 1788 – 19 April 1824)

A Fellow Of Royal Society of London, and  more commonly known simply as Lord Byron, George Gordon Byron was a British poet and a leading figure in the Romantic movement.

“She Walks in Beauty”, “When We Two Parted”, and So, we’ll go no more a roving” are amongByron’s best-known works, besides the “Childe Harold’s Pilgrimage” and Don Juan”. He is regarded as one of the greatest British poets and remains widely read and influential.

%d bloggers like this: