అనువాదలహరి

రూపాంతరాలు … థామస్ హార్డీ

Image Courtesy: http://www.hedgedruid.com

.

‘యూ’ చెట్టు లోని ఈ భాగం

మా తాతగారికి తెలుసు,

దాని మొదలులో

కనిపించకుండా దాగున్న ఈ కొమ్మ

బహుశా అతని భార్య అయి ఉండవచ్చు…

జీవం తొణికిసలాడే మానవ జీవితం ఇపుడు

లేజివురుగా రూపాంతరం చెందింది

ఈ పచ్చికలు, గత శతాబ్దంలో

ప్రశాంతత కోసం నిరంతరం

ప్రార్థనలు చేసిన ఆమె కావచ్చు;

నేను చాలా సార్లు పరిచయం చేసుకోవాలని

ఉబలాటపడ్డ ఆ అందమైన పిల్ల

బహుశా ఈ గులాబీలో ప్రవేశిస్తోందేమో!

.

కనుక, వాళ్ళేమీ మట్టిగా మిగిలిపోలేదు.

అనంతమైన జీవవాహికలై,

ప్రాణస్పందనతో కళకళలాడే

ఈ వాతావరణంలో,

ఎండా వానా ఆస్వాదిస్తూ,

వాళ్ళని వాళ్లుగా చేసిన

ప్రాణశక్తిని తిరిగి అనుభవిస్తున్నారు

.

Image Courtesy: http://upload.wikimedia.org

థామస్ హార్డీ

(2 June 1840 – 11 January 1928)

హార్డీ ఒక ప్రసిధ్ధ ఆంగ్ల కవీ, నవలా కారుడూ. ప్రాథమికంగా కవిని అని అతను చెప్పుకున్నా అతని కీర్తి అతని ముఖ్యమైన రెండు నవలలమీద ఆధారపడి ఉంది. అవి: (1) Tess of the d’Urbervilles (2) Far from the Madding Crowd. అతను 1880-1940ల మధ్యకాలంలో ఆంగ్లసాహిత్యంలో వచ్చిన సహజత్వవాదం (Naturalism)కి చెందిన రచయిత. ఈ వాదం మనిషిమీద అతని చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులూ, వాతావరణమూ, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని లక్షణాలూ ప్రభావితం చేస్తాయి అన్న డార్విను సిధ్ధాంతాన్ని నమ్ముతుంది.  అందుకే వీరి రచనలలో భావవాదాలూ, అధివాస్తవిక ప్రతీకలకు బదులుగా నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనలకీ, సందర్భాలకీ ప్రాధాన్యత కనిపిస్తుంది

.

Transformations

.

Portion of this yew
Is a man my grandsire knew,
Bosomed here at its foot:
This branch may be his wife,
A ruddy human life
Now turned to a green shoot.

These grasses must be made
Of her who often prayed,
Last century, for repose;
And the fair girl long ago
Whom I often tried to know
May be entering this rose.

So, they are not underground,
But as nerves and veins abound
In the growths of upper air,
And they feel the sun and rain,
And the energy again
That made them what they were!

.

Thomas Hardy (2 June 1840 – 11 January 1928)

English novelist and poet.   Tess of the d’Urbervilles and Far from the Madding Crowd are his most famous novels, though he considered himself to be more a poet. His works belong to the Naturalism Movement, a movement between 1880s to 1940s which endorsed Darwinian theory of evolution and depicted events suggesting that environment, social conditions and heredity etc., have a larger say in shaping the human nature than the other movements like Surrealism and symbolism.

%d bloggers like this: