ప్రజాస్వామ్యం … లాంగ్స్టన్ హ్యూజ్

.
భయం వలనా, రాజీ పడడం వలనా
ప్రజాస్వామ్యం ఇవాళా,
ఈ ఏడాదీ రాకపోవడమే కాదు,
ఎప్పటికీ రాదు.
నా రెండు కాళ్ళ మీదా నిలబడడానికీ
ఈ నేలని స్వంతంచేసుకుందికీ
అవతలి వ్యక్తికి ఎంతహక్కుందో
నాకు కూడా
అంత హక్కే ఉంది.
అన్ని విషయాలనీ ‘కాలమే నిర్ణయించనీ’
అనే వ్యక్తులను విని విని నాకు విసుగెత్తిపోయింది.
రేపు అన్నది మరో రోజు.
నేను పోయిన తర్వాత నాకు స్వాతంత్ర్యంతో పనిలేదు.
నేను రేపటి రొట్టెతిని ఇవాళ బతకలేను.
స్వేఛ్ఛ అన్నది
అత్యావశ్యకక్షేత్రంలో
నాటిన సారబీజం.
నేనూ ఇక్కడే బ్రతుకుతున్నాను.
నీలాగే
నాక్కూడా
స్వేఛ్ఛ కావాలి.
.
లాంగ్స్టన్ హ్యూజ్

భయం వలనా రాజీ పడడం వలనా….ఎప్పటికీ రాదు….అన్ని విషయాలనీ కాలమే నిర్ణయిస్తుందని….నేను రేపటి రొట్టె యీ వేళ తిని బతకలేను…….అద్భుతం…మాటలు రావడం లేదు. నేటి మన పరిస్థితికి సరిగా సరిపోలా?
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మగారూ,
కవిత నాడిని ఆవిష్కరించారు . అవన్నీ ఈనాటి పరిస్థితికి అద్దం పట్టడమే కాకుండా, కర్తవ్యబోధ చేస్తున్నాయి ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుందో. ఎలక్షన్లలో ఓటేసి ఊరుకోకుండా, ప్రజలు వాళ్ళకి కావలసినవి సాధించుకుందికి అవసరమైతే ప్రభుత్వాల్ని నిలదియ్యాలి కూడా. దురదృష్టవశాత్తూ, ప్రభుత్వాలు ప్రజల ఈ చర్యల్ని తమ అధికారానికి ఎసరుతెస్తున్నట్టుగా భావించి కంగారు పడుతున్నాయి. వెర్రివాడికి ఎప్పుడూ దేనిమీదో ధ్యాస అని రాజకీయపార్టీలకీ నాయకులకీ ఒక్క అధికారం మీదే ధ్యాస… ప్రజాసేవ మీద కాదు.
అభివాదములతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి