ప్రజాస్వామ్యం … లాంగ్స్టన్ హ్యూజ్

.
భయం వలనా, రాజీ పడడం వలనా
ప్రజాస్వామ్యం ఇవాళా,
ఈ ఏడాదీ రాకపోవడమే కాదు,
ఎప్పటికీ రాదు.
నా రెండు కాళ్ళ మీదా నిలబడడానికీ
ఈ నేలని స్వంతంచేసుకుందికీ
అవతలి వ్యక్తికి ఎంతహక్కుందో
నాకు కూడా
అంత హక్కే ఉంది.
అన్ని విషయాలనీ ‘కాలమే నిర్ణయించనీ’
అనే వ్యక్తులను విని విని నాకు విసుగెత్తిపోయింది.
రేపు అన్నది మరో రోజు.
నేను పోయిన తర్వాత నాకు స్వాతంత్ర్యంతో పనిలేదు.
నేను రేపటి రొట్టెతిని ఇవాళ బతకలేను.
స్వేఛ్ఛ అన్నది
అత్యావశ్యకక్షేత్రంలో
నాటిన సారబీజం.
నేనూ ఇక్కడే బ్రతుకుతున్నాను.
నీలాగే
నాక్కూడా
స్వేఛ్ఛ కావాలి.
.
లాంగ్స్టన్ హ్యూజ్
