అనువాదలహరి

వసివాడిన నా పసిపాపకి … లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్

.

పువ్వులు మళ్ళీ మొగ్గతొడిగి విరబూస్తాయి

మోడైన చెట్లు మళ్ళీ చిగిర్చి మారాకు హత్తుకుంటాయి

విశీర్ణమైన మైదానాన్ని పచ్చిక తివాచీలా కప్పుతుంది

కానీ, నువ్వుమాత్రం నా దరికి తిరిగి రావు!

.

నల్ల పిట్టా, గూటిగువ్వా,

రసనిష్యందమైన గీతాలాలపిస్తూ,

సిగ్గుదొంతరల వసంతాన్ని స్వాగతిస్తాయి,

కానీ, నువ్వు మాత్రం నా దరికి తిరిగి రావు!

.

లేదు! వాడిపోయిన నీ లేబుగ్గలు ఇక

ఎన్నిసార్లు వసంతం విరిసినా, మరి చిగురించవు

దేవుని దివ్యసౌధాన్నలంకరించడానికి

ఎక్కడో ఆకాశతీరాలకావల వికసిస్తాయి

.

ఇపుడు నాకొక భవబంధం తగ్గింది

స్వర్లోకాకాంక్షకొక మోహం పెరిగింది

ఓ నా పూజాప్రసూనమా! నిన్ననుసరించి

నిరతకందళితనాకతీరాలకు ఇదే వస్తున్నాను!

.

లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్ (1830?- 1865)

లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్  బ్రిటిషు కవయిత్రి.  ఈమెగురించిన సమాచారం బహుతక్కువ. అంత పెద్దగా చదువుకున్నట్టు కనిపించదు. చిన్నప్పటినుండి కవిత్వం రాస్తున్నా, బహుశా తన 18వ యేట Primitive Methodist Magazineలో మొదటి కవిత ప్రచురించబడి ఉండవచ్చు. ఆమె కవితాసంకలనం The Cottage Lyre : Being Miscellaneous Poetry బహుశా 1861 లో వచ్చి ఉండవచ్చు

.

To My Departed Baby

.

The flowers will bud and bloom again,

The leaves bedeck the forest tree

The grass enrobe the wither’d plain;-

But thou wilt not return to me!

.

The black-bird and the thrush will sing

Their songs of gushing melody,

To greet again the blushing Spring;-

But thou wilt not return to me!

.

Ah no! thy blighted buds no more

Shall blossom with returning Spring;

They bloom on yon celestial shore,

To grace the palace of their King.

.

One fetter less hath earth for me,

But heaven one bright attraction more;

My gather’d flower, I’ll follow thee

To Canaan’s ever-blooming shore.

.

(1861? or 1862)

.

Louisa A Horsfield

(1830-1865)

British Poetess

%d bloggers like this: