A veritable trove of abject poverty, disconsolate,
And, dabbed with endless stream of tears.
.
And in that Stygian darkness my Lord! you once
Flourished, eons ago; And, that day my humble cot
was pervaded with a passel of flowery perfumes
wafted around by the winds of ecstasy!
.
That’s all! Darkness took over the reign again.
This endless enduring darkness and I
Have been locked up in a bear-hug ever since
Reminiscing you, and your profile of that moment.
.
Viswanatha Satyanarayana
.
స్వామి! పరిగాఢ శర్వరీఛ్ఛవి, దరిద్ర
తానిధానము, తేజోవిహీన, మనవ
రతపరిసృతభాష్పధారామిళితము
నన్ను నీ వుండుమన్నంగణంబు తండ్రి!
.
ఈ మహాంధకారంబున నెపుడొ యొక్క
సారి మెరిసితి, వానాడు సామి! నా కు
టీర మానందవాయుప్రచారశతస
హస్ర కుసుమపరీమళవ్యాపృతంబు!
.
దానితో సరి, మరల నాంధ్యమ్ము క్రమ్మె,
తొలి చివరలేని ఈ చీకటులును, నేను
ఒక్కరొక రప్పళించుకొంచుండినాము,
నిన్ను, నీ నాటి మెరుపు మన్నించుకొంచు!
.
విశ్వనాధ సత్యనారాయణ
(10 September 1895 – 18 October 1976)
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతివేంకటకవుల శిష్యులు, తెలుగులో తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్, అక్షరాలా శతాధికగ్రంథ కర్త. పరమ ఛాందసుడనీ, “పాషాణపాకప్రభో” అనీ సమకాలీనులలో కొందరు అతని భావజాలానికీ, రచన శైలికీ విమర్శించినా, తనదైన మార్గంలో, అసమాన మేధాసంపత్తితో నిర్భయంగా సాగిన కవి. అయితే, అద్భుతమైన కల్పనాశక్తితో పాటు, అతని రచనలలో కొన్నిచోట్ల సరళతా, సమకాలీన ప్రతీకలూ కూడ కనిపిస్తాయి.