Image Courtesy: http://2.bp.blogspot.com
.
Look! Look at those creepers!
Those ductile creepers thinner than ‘thin’
Are more like the tunes you hum within.
How beautifully they have spun!
.
Look at those fledgling sprigs!
They dangle as gently as your mirthful thoughts.
Flowers appear like the smiles you broadcast on your way
For that matter the very earth looks
As though it were a cradle made for you in the ether.
.
Behind those sprawling wings of the birds
The grace of your mirth lies;
And so does in the Cirrus wintry cloud, your pleasure.
You are the soul of my song!
You are the goal of my meditation!
So long as I live, I chant only your name!
When I am dead
Put your ear to my tomb
And you shall hear it just echoing your name!
.
A pyre could reduce the frame to ashes, but
Not its memories… Nothing could!
.
Sowbhagya.
.
చూడు! ఆ తీగల్ని చూడు!
సనసన్నగా సాగుతున్న ఆ తీగల్ని చూడు!
నీలోనువ్వే పాడుకునే రాగాల్లా
ఎంత నిర్మలంగా సాగుతున్నాయో!
ఆ చివుళ్ళని చూడు!
ఉల్లాసంగా కదిలే నీ ఊహల్లా ఉన్నాయి.
భూగోళమే శూన్యంలో నీ కోసం సృష్టించిన ఉయ్యాలలా ఉంది.
పక్షుల రెక్కల్లో
నీ పరవశవిన్యాసం ఉంది.
శరత్కాలమేఘంలో నీ సంతోషం ఉంది.
నా గానంలో నువ్వే!
నా జ్ఞానంలో నువ్వే!
బ్రతికినన్నాళ్ళూ నీ పేరే జపిస్తాను.
నేను మరణించేక
నా సమాధిపై చెవి ఆనించు
అది నీ పేరే ప్రతిధ్వనిస్తుంటుంది.
చితిలో శరీరం కాలిపోయినా
స్మృతిని ఎవరూ కాల్చలేరు కద!
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తూంది…