Accident – Nirmala Ghantasala Image Courtesy: http://godandshoes.files.wordpress.com Whenever I lift a morsel to my mouth… A bleeding brawn appears ‘fore my eyes, Whenever I hear the sound of a horn… I hear A silent wail of a mother with a lump in her throat, ‘Accident is a mishap’ defines the ’Learn English in 30 days’ book ‘A sudden unexpected occurrence’ says the world at large… But accident means… The rattling of the mind witnessing in front, A life struggling to cease or no… Burden of a freaky sin that follows us to our last breath… An egregious guilt we can’t shed to the end of our lives. ** ** ** We never know until that moment That we love so much …the innocent… the hapless… And the boys that run across the road! And lesser still That the innocent, the hapless, and those at the threshold of death Love us as dearly! That with no trace of envy they admit their trespass, and Stretch their hands to the cool hug of death in despair! Insufferable embarrassment When people enquire about you unmindful of the felled nearby, More than the grief that simmers within them, The compassion of the injured’s parents touches deep within, If you forget for a moment… the Supreme Being… Act of Sin… Ephemeral life … a moment’s lapse FIR… Additional Judge…and the rest… The boy… felled speeding for a stalk of sugarcane… Is A spear dug deep in my spine for life… One Who attained divinity bathing in blood without batting an eyelid… Battling to bid his last adieu by hand To the metallic world that wrote his childy-impishness off at Eight… Is The truth…shadow…charge…crime and punishment and everything for me!!! ** ** ** Do you have licence? Yes! (Thank god, I have!) Did you renew it? Yes, I did. I did. (Thank God! I am saved!) Wrong route? Root is wrong! (Power and pelf play ping-pong with life) That’s not what I say, is the route wrong? Everything is wrong with our roots Where we bend for the tinkle of a coin! ** ** ** Suffering hell for four days He spilt over the lifeless eyes of his father And was lost cuddled up in his unkempt beard! It was he, who capsized in the dried up tears of his mother!! He was the mash in the potholes of the road!!! Darting truth into my heart, and Appropriating to himself the blame… That he ran across the road … and, Reassuring that I need not have to Run around to beat the rap, Ginning himself of the body He bravely walked away in search of other worlds! What is it we are left with for the rest of our lives When he takes all our courage away? Unable to wail hollow Over the sentence for an uncommitted crime, Unable to milk loans to the dear ward, unrelated Towards his ward charges at hospital; What else could I do… than to freeze in my heart’s mortuary The ‘kin’ly soul that bade me last good bye? Putting to sleep at midnight those pairs of searching eyes That dared not ask if he was dead, with food-packets I warmed my cooled night-out tea-cup with hiccups… Balancing in darkness innocent life against a long inventory of loans! . Oh, Boy! We… Who poked our eyes with the finger that steers the power-wheel Who choked you to death with your own statement Whom sleep eschews to draw near today, and Whose hearts were poke-marked with your death… Cry hoarse that we aren’t at fault, Ready ourselves to light candles at your funeral! O, you boy! Who ran across our path all of a sudden! Oarsman of your family boat of sustenance unto the last! The dismal shadow of sin that trails me to my eternal rest! A life-size blood stain in my plate ! These hands are helpless trudging the cross across That they can’t even pay their last homage to you!!! . Telugu Original: Ghantasala Nirmala . ది యాక్సిడెంట్ ముద్ద ఎత్తితే- కంటెదుట విసిరిపడిన ఎరుపుముద్ద శబ్దం చెవినపడితే – గొంతుపెగలని తల్లి మూగరోదన యాక్సిడెంట్ అంటే ప్రమాదం అని అర్థం చెబుతుంది “ఆరునెలలల్లో ఆంగ్లబోధిని” ఒక హఠాత్ ఘటన అని మాత్రమే లోకమంటుంది యాక్సిడెంట్ అంటే- కళ్ళెదుట గిలగిల కొట్టుకునే ప్రాణాన్ని చూస్తూ మనసుపడే విలవిల చిట్టచివరి నిశ్వాసవరకూ మనతోనే వచ్చే నిర్నిమిత్త పాపభారం ఆజన్మాంతం అసలే వదలని పెను అపరాధభావం * ఆ క్షణం వరకూ తెలీదు- అమాయకుల్నీ నిస్సహాయుల్నీ, రోడ్డుమీద అడ్డంగా పరిగెత్తే కుర్రాళ్ళనీ మనం అంతగా ప్రేమిస్తామని! అంతకంటే తెలీదు – అమాయకులూ, నిస్సహాయులూ మృత్యుముఖాన ఉన్నవాళ్ళుకూడా మనల్ని అంతగా ప్రేమిస్తారని!! ఎటువంటి ఉక్రోషమూ లేకుండా హద్దుమీరిన తప్పునొప్పుకుని మరణదండానికి నిస్పృహగా చెయ్యి చాస్తారని!!! పడిపోయిన వాళ్ళని వదిలి మనల్ని పరామర్శించే ప్రపంచపు దయ భరించలేని స్థితి గాయపడ్డవాడి అమ్మానాన్నల మెలిపెట్టేశోకం కంటే వాళ్ళ క్షమ హృదయ శల్యం పరంజ్యోతీ పాపకర్మా నిమిత్తమాత్రం బ్రతుకూ నిమిషమాత్రపరాకూ ఎఫ్ఫయ్యారూ ఎడిషనల్ జడ్జీ – అన్నీ అటుంచి చెరుకుగడకోసం దుందుడుకుగా పరిగెత్తి రాలిపడిన అబ్బాయి- జీవితాంతం నా వెన్నున దిగిన గునపం! ఎనిమిదేళ్లకే తన చిలిపితనానికి చెల్లు చీటీ రాసిన లోహమయలోకానికి రక్తం లో మునిగి తేలుతూ చెయ్యెత్తి చివరిగా మొక్కబోయి అనిమిషుడై ఆగిపోయిన చిన్నవాడు నా పాలిట నిజమూ నీడా నిందా నేరమూ శిక్షా అన్నీ తానే అయిన వాడు * లైసెన్సుందా? ఉంది! హమ్మయ్య!! రెన్యూవల్ చేసావా? చేసాంచేసాన్! బతికాన్రా బాబూ!! రాంగ్ రూటా? రూటే రాంగ్! ప్రాణం బంతితో అధికారం ఐశ్వర్యం పింగ్ పాంగ్!!! అదికాదయ్యా – రూటు రాంగా? రూపాయికోసం అడ్డంగా పరిగెత్తే మన మూలాలనిండా తప్పులే! * నాలుగురోజులు నరకయాతన పడిన కుర్రాడు నాన్న గాజుకళ్ళలో పొంగిపొర్లి జీబురుగడ్డం లో చిక్కి సొక్కిపోయాడు వాడివత్తలైన అమ్మ చెంపలమీద చిట్లిన కన్నీటి బిందువుల్లో తలక్రిందులుగా వాడే!! అచ్చంగా రోడ్డుగతుకులో చెదరిపడిన ఛిద్రాలజాడే!! తానే ఆడ్డదారిన పరుగెత్తానని వాజ్ఞ్మూలమిచ్చి నా గుండెలో సత్యమనే శూలం గుచ్చి కేసు తట్టుకునేందుకు ఏ అడ్డదారీతొక్కనవసరంలేదని అభయమిచ్చి పింజలు పింజలుగా విచ్చి మరో లోకాన్ని వెతుక్కుంటూ ధైర్యంగా వెళిపోయాడు! ధైర్యమంతా వాడు మూటగట్టుకుపోతే మనమిగిలినబ్రతుక్కి ఏముంది? చెయ్యని తప్పుకి చిక్కిన కఠోరఫలితానికి బోలుగా ఏడవలేక ఏమీకాని ఆత్మబంధువుకి ఆస్పత్రిలో అప్పులుతెచ్చిపొయ్యలేక కడసారి శలవడిగిన ఏమీకాని బంధువుఆత్మకి హృదయపు మార్చురీలో చోటివ్వక ఏం చేసాను? ప్రాణంపోయిందేమో అడగ సాహసించని ప్రశ్నల జతల కళ్ళని అర్థరాత్రి అన్నంపొట్లాలతో నిదురపుచ్చి చల్లబారిన నా జాగారం టీకప్పుని వెక్కిళ్ళతో వెచ్చజేసాను అలవిమాలిన అప్పులకీ ఆపలేకపోయిన పసి ప్రాణానికీ చీకట్లో తూకం వేసాను. * చక్రం తిప్పే వేళ్ళతో కన్ను పొడుచుకున్న వాళ్లం కన్నుపొడుచుకున్నా ఇవాళ నిద్ర పట్టని వాళ్ళం నీ సాక్ష్యంతో నీ గొంతే నొక్కిన వాళ్లం నీ మరణం మరక పడిన బరకగుండెల వాళ్లం మా తప్పులేదంటూ గొంతు రుధ్ధమైన వాళ్ళం నీ సమాధిబల్లమీద కొవ్వొత్తివిందుకు సిధ్ధమైన వాళ్ళం- హఠాత్తుగా రోడ్డుకి అడ్డం వచ్చిన కుర్రాడా అయినవాళ్ళందర్నీ మోసే ఉపాధిపడవకి ఆఖరివరకు సరంగైనవాడా జీవితాంతం ననువీడని పాపపు నీడా నా రోజువారీ రొట్టెల పీటమీద నిలువెత్తు నెత్తుటిజాడా నీకు కడగొట్టు నమస్కారం చెయ్యాలంటే- కుదరనివ్వని శిలువమోత చేతులివి! . ఘంటశాల నిర్మల (నిర్వచనం కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 8 వ్యాఖ్యలుజనవరి 6, 2012