గీతం … క్రిస్టినా రోజేటి

.
ప్రియతమా! నేను పోయిన తర్వాత నాకోసం
శోక గీతాలాలపించకు;
నా తలదగ్గర గులాబీలుంచడం గాని,
నీడకోసం తమాలవృక్షం
నాటడం గాని చెయ్యకు:
బదులుగా నా సమాధిమీద
చినుకులతో, మంచుబిందువులతో
తడిగా ఉండే గరికవి కా.
నీకు ఇష్టమయితే, గుర్తుంచుకో,
మరిచిపోవాలనిపిస్తే, మరిచిపో!
.
నేనిక నీడనీ వీక్షించలేను
వర్షాన్నీ అనుభవించలేను
బాధతో పొగిలినట్టు ఆలపించే
కుహూరవాల్నీ వినలేను;
ఉదయాస్తమయాలు అనుసరించని
సంధ్యలో కలలుగంటూ
ఆనందంగా గుర్తుంచుకోవచ్చు,
ఆనందంగా మరిచిపోనూవచ్చు.
.
(1862)
.
క్రిస్టినా రోజేటి
.