నా నూత్నసంవత్సర సంకల్పాలు — రాబర్ట్ ఫిషర్

.

(http://i.dailymail.co.uk/i/pix/2011/02/04/article-1353570-04F0F3670000044D-448_468x370.jpg)

HAPPY NEW YEAR 2012

(నా బ్లాగ్మిత్రులకీ, సందర్శకులకీ 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకూ మీ కుటుంబానికీ, మీరు అభిమానించే వారికీ, మిమ్మల్ని అభిమానించే వారికీ అందరికీ ఆయురారోగ్యములూ ఆనందోత్సాహాలూ తీసుకురావాలనీ, మీరు తలపెట్టినపనులు నెరవేరి కొత్తపనులుచేపట్టడానికి తగిన ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించాలని కోరుకుంటూ…  ఈ కానుక)

.

నేను పిల్లిపిల్లని కిటికీ లోంచి అవతలకి విసిరెయ్యను,

మా చెల్లెలి దుప్పటిలో  కప్పని దాచను,

మా అన్నయ్య రెండు షూ లేసుల్నీ కలిపేసి ముడివెయ్యను, 

మా నాన్న షెడ్డు మీద నుండి దూకను,

మా అత్త పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాను,

వారానికోసారి నా గది సర్దుకుంటాను,

మా అమ్మ చేసిన వంటగురించి సణగను (చచ్చాన్రా దేవుడా మళ్ళీ “ఫిష్ ఫింగర్” లే చేస్తోంది)

మా అమ్మని వెవ్వెవ్వే అనను,

చాతనయితే ముక్కు గొలుక్కోకుండా ఉంటాను,

నా బట్టలు నేనే మడతపెట్టుకుంటాను, 

తల దువ్వుకుంటాను,

“ప్లీజ్” అనీ “థాంక్స్” అనీ చెబుతాను (నాకా ఉద్దేశ్యం లేకపోయినా )

ఉమ్మడం  అరవడం చెయ్యను, ఒట్ట్లు కూడా పెట్టను ,

ప్రతిరోజూ తప్పకుండ నా దినచర్య రాస్తుంటాను,

బడిలో అందరికీ సాయం చెయ్యడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను,

వృధ్ధస్త్రీలు రోడ్డు దాటడానికి సహాయపడతాను(వాళ్ళు వద్దన్నా) 

అవతలివాళ్ళు మోటుగా ప్రవర్తించినా నేను ప్రశాంతంగా ఉంటాను,

సూర్యాస్తమయంతో పడుక్కుని, సూర్యోదయంతో లేస్తాను,

నే వెళుతున్నప్పుడు తలుపులన్నీ మూసి మరీ వెళతాను,

ప్రతిసారీ ట్యూబ్  అడుగునుండి నొక్కి టూత్ పేస్ట్ పెట్టుకుంటాను,

తగువులకి దూరంగా ఉంటాను,

నేను మళ్ళీ మొదటినుండి మొదలెట్టి, కొత్త జీవితం ప్రారంభిస్తాను,

నా పాత చెడ్డ అలవాట్లని శాశ్వతంగా వదిలేస్తాను,

ఇంతకీ ఇవి కొత్త సంవత్సరం నుండి మొదలెట్టనా,  లేక మళ్ళీ సంవత్సరం నుండా,

లేదా తర్వాత ఎప్పుడో ,  లేక…..?

.

రాబర్ట్ ఫిషర్

(Courtesy: http://www.123newyear.com/newyear-poems/) కి కృతజ్ఞతలతో.

.

My New Year’s Resolutions  

.

I will not throw the cat out the window

Or put a frog in my sister’s bed

I will not tie my brother’s shoelaces together

Nor jump from the roof of Dad’s shed

I shall remember my aunt’s next birthday

And tidy my room once a week

I’ll not moan at Mum’s cooking (Ugh! fish fingers again!)

Nor give her any more of my cheek.

I will not pick my nose if I can help it

I shall fold up my clothes, comb my hair,

I will say please and thank you (even when I don’t mean it)

And never spit or shout or even swear.

I shall write each day in my diary

Try my hardest to be helpful at school

I shall help old ladies cross roads (even if they don’t want to)

And when others are rude I’ll stay cool.

I’ll go to bed with the owls and be up with the larks

And close every door behind me

I shall squeeze from the bottom of every toothpaste tube

And stay where trouble can’t find me.

I shall start again, turn over a new leaf,

leave my bad old ways forever

shall I start them this year, or next year

shall I sometime, or …..?

.

Robert Fisher

(Courtesy: http://www.123newyear.com/newyear-poems/)

“నా నూత్నసంవత్సర సంకల్పాలు — రాబర్ట్ ఫిషర్” కి 4 స్పందనలు

 1. 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో…..
  నూతనోత్సాహం ( శిరాకదంబం )

  మెచ్చుకోండి

  1. రావుగారూ,
   మీ శిరాకదంబం ఇంతింతై వటుడింతయై… అన్నట్లుగా అంతర్జాలం నభోవీధిలో బాగా ఎదగాలనీ, దానికి 2012 ఒక మైలురాయి కావాలనీ ఆకాంక్షిస్తున్నాను.
   అభివాదములతో,
   మూర్తి

   మెచ్చుకోండి

 2. అనువాదం చాలా బాగుంది. అంతేకాదు మంచి సేకరణ. క్రియాశీల రహిత యువత నైజానికి ఒక చక్కని ఉదాహరణ…
  2012 నూతన ( ఆంగ్ల ) సంవత్సర శుభాకాంక్షలతో…..
  శ్రీనిక

  మెచ్చుకోండి

  1. శ్రీనిక గారూ,
   2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
   కాకపోతే ఇది నాలాంటి నిత్యనూతన “resolutionalist”లకు కూడా వర్తిస్తుంది.
   ఈ కవితలోని చమత్కారమల్లా ఆ చివరి లైన్లే.
   మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
   మూర్తి

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: