నెల: డిసెంబర్ 2011
-
స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి
. సరోవరాలకు నిలయమైన ఉదయపూర్ లో నే నోరోజు గాలి తోడుగా వ్యాహ్యాళికి బయలుదేరాను. అంతలో ఎవరో చెవిలో ఊదినట్టు ఒక పాట నా మదిలో మెదిలింది. కాని ఆ స్వరం ఇక్కడ నే చూసిన ఏ మానవమాత్రుడిదీ కాదు, గాలిలాగే, మనిషికూడా అగోచరం. . కొండలకు నెలవైన తిరుపతిలో, పర్వతారోహణ చేస్తూ శిఖరాగ్రం చేరుకునేటప్పటికి దుముకుతూ గెంతివస్తున్న సెలయేరొకటి కనిపించింది సంతోషం పట్టలేక ఆనందంతో కేకలేస్తూ. నేను శిఖరం నుండి క్రిందికి మైదానం వంకా, నీటిపాయల…
-
ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
. తుఫాను భీకరంగా గర్జిస్తోంది. తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది. అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది. . చంద్రుడు దాగున్నాడు. ఏ తారకా కాంతివంతముగా లేదు. కనుక ఆ రాత్రికి తను స్వర్గం చేరలేనట్లే. ఎందుకంటే కిరణాలే దేవదూతలకు స్వర్గానికి నిచ్చెనలు. . ప్రతి కిటికీ దగ్గరా తనకింత ఆశ్రయమిమ్మని అర్థించింది. కానీ, ప్రయోజనం లేకపోయింది… “చూడు చూడు, వర్షం ఎంత దబదబా కురుస్తోందో” అన్నాయవి. . తను వెక్కి వెక్కి…
-
అసూయ … Adelaide Anne Procter
. అతనెప్పుడూ ముందే; అదృష్టం అతని ముఖంలో తొణికిసలాడేది. నేను సంవత్సరాలతరబడి కష్టపడితే, అతను అవలీలగా విజయం సాధించగలిగే వాడు. మేం పరుగు పందెం వేసుకునే వాళ్ళం; నాకాళ్ళు రక్తాలోడేవి, అతను పందెం గెలిచేవాడు. . అతను ఎన్ని విజయాలు సాధించినా అతన్ని ఒక్కలాగే ఆదరించేరు; నా పేలవమైన ఒకే ఒక్క విజయానికి నాకెదురైనవి పరిహాసమూ, నిందా. మేం ఇద్దరం తప్పుచేస్తే, అతని మీద జాలిపడేవారు, నాకు మాత్రం అవమానమే. . నేను ఇంకా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాను,…
-
Swish of a Sword … K. Geetha
. Isn’t trying to speak about poetry As difficult as to wake up one feigning sleep? It’s unfathomable how densely poets compact poetic spirit in time, but As they recollect it incessantly, It must overwhelm the listener like a high tide. “Chalam’s “Savitri”, perhaps, has come to life Not out of his pen, but out…
-
మృత్యువా, గర్వపడకు! … జాన్ డన్.
(This translation is dedicated to Sri Ghantasala Venkateswara Rao, the IMMORTAL Singer, on his 89th Birth Anniversary) . ఓ మృత్యువా, గర్వపడకు! ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ, భయంకరమైన దానివనీ అన్నారని. నీ కంత శక్తులేం లేవు. . నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ, వాళ్ళేం మరణించలేదు. ఓసి పిచ్చి దానా! అంతెందుకు, నువ్వు నన్నే గెలవలేవు! . విశ్రాంతిలోనూ, నిద్రలోనూ కూడా మనుషులు మరణించినట్టే ఉంటారు. కనుక, వాటితర్వాత…
-
స్నేహం— హెన్రీ డేవిడ్ థొరో
. నేనో క్షణం ప్రేమను గురించి ఆలోచిస్తాను, అలా ఆలోచిస్తుంటే, అదొక లోకంలా, అమృతాశనంలా, భూమినీ – స్వర్గాన్నీ దగ్గరచేసే వారథిలా కనిపిస్తుంది. . అది నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుందని తెలుసు గాని, ఎందుకో, ఎలాగో చెప్పమంటే మాత్రం నా తరం కాదు, చచ్చినా చెప్పలేను. . నేను నా నేస్తాన్ని అడగాలనుకుంటాను అదెలాఉంటుందో… తీరా సమయం వచ్చేవేళకి అన్నిటికంటే నాకు ప్రేమే ఎంతో మనోహరంగా ఉంటుంది. దాంతో నేను మూగనైపోతాను. . నిజం తెలుసుకోగలిగితే, ప్రేమ…
-
ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్
. చంద్రముఖీ! పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు, నేను పేజీ తిప్పినడల్లా నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు . సుహాసినీ! పత్రికలోని అందాల సుందరాంగీ! ఏ మగాడైనా నిన్ను చూడగానే మంత్రముగ్ఢుడౌతాడు . నీ మీద ఎన్ని కవితలు రాసి ఉంటారు? ఓ బియాట్రిస్! నీకెంతమంది డాంటేలు ప్రేమలేఖలు వ్రాసి ఉంటారు నీ భ్రాంతిమదాకారానికి? కల్పిత భావ వివశత్వానికి? *** కానీ, ఈ రోజు నేను మరొకసారి అరిగిపోయిన మాటలనే వాడి నీ మీద…
-
Your Chariot … Viswanatha Satyanarayana
. Your chariot, O my Lord! is racing with an ordained speed, uninterrupted. This corp came under it, got crushed; spurting blood streamed in pools and dried up. . That effulgent resplendent chariot divine had not stopped a wee, cognizing any snag; Neither it made a turn around, nor divine the instant roaring screams I let out.…