పసి లోకం… టాగోర్

Image Courtesy: http://www.deviantart.com

.

నాకు మా కుర్రాడి లోకంలో

ఒక మూల ప్రశాంతంగా  కూర్చోగలిగితే బాగుణ్ణనిపిస్తుంది… 

నాకు తెలుసు,

అక్కడ వాడితో  మాట్లాడే నక్షత్రాలుంటాయి,

తన అల్లరి చిల్లరి మబ్బుతునకలతో,  ఇంద్రధనుసులతో

అలరించడానికి అతని ముఖం మీదకి వంగే ఆకాశం ఉంటుంది.

మూగవైనట్టూ, అసలు కదలనే కదలలేనట్టూ భ్రమింపజేసేవన్నీ,

మెల్లగా అతని కిటికీ దగ్గరకి తమ కథలతోనూ,

తళతళలాడే ఆటబొమ్మలతోనిండిన తబుకులతోనూ

పాకుకుంటూ వస్తాయి…

ఆ బాలుడి మనోద్వారంలో మెదిలే దారులగుండా

ఏ సరిహద్దులూ లేని ప్రదేశాలకి వెళ్లగలిగితే  బాగుణ్ణనిపిస్తుంది;

అక్కడ చరిత్ర యెరుగని రాజుల రాజ్యాలమధ్య

నిరంతరాయంగా వార్తాహరులు ఏదో పనిమీద పరిగెడుతూనే ఉంటారు… 

అక్కడ బుధ్ధి తన చట్టాల గాలిపటాలు తానే తయారుచేసుకుని ఎగరేస్తుంటే,

సత్యం ఏ ప్రతిబంధకాలూ లేని నిజాలని ఆవిష్కరిస్తూ ఉంటుంది.

.

టాగోర్

.

I wish I could take a quiet corner in the heart of my baby’s very
own world.
I know it has stars that talk to him, and a sky that stoops
down to his face to amuse him with its silly clouds and rainbows.
Those who make believe to be dumb, and look as if they never
could move, come creeping to his window with their stories and with
trays crowded with bright toys.
I wish I could travel by the road that crosses baby’s mind,
and out beyond all bounds;
Where messengers run errands for no cause between the kingdoms
of kings of no history;
Where Reason makes kites of her laws and flies them, the Truth
sets Fact free from its fetters

.

Rabindranath Tagore

“పసి లోకం… టాగోర్” కి 10 స్పందనలు

  1. ఏ సరిహద్దులూ లేని ప్రదేశాలకి వెళ్ళగలిగితే….. చక్కటిరచన, అనువాదం.

    మెచ్చుకోండి

  2. Tagore has beautifully unveiled the world of a child, particularly:

    “Where messengers run errands for no cause between the kingdoms
    of kings of no history;
    Where Reason makes kites of her laws and flies them, the Truth
    sets Fact free from its fetters…”

    unless you can get into such childy world, you can’t pen those lines. Often a writer confuses with his own imaginative world as childy world.
    Thank you.

    మెచ్చుకోండి

  3. Tagore has a tremendous range of thinking… to the pure and innocent childy world to great philosophical …encompassing a whole range of human thinking, passions and activities mundane and spiritual.

    మెచ్చుకోండి

  4. అక్షర సత్యం సర్,
    (చిన్నప్పుడు ఇది మా తెలుగు lesson లోకూడా వుండేది,)

    ఈ సృష్టిలోని “ఘనత” అంత ఘనీభవించి,
    ఒక “మూర్తి” రూపం దాల్చగా దానికి నామంతారమే “టాగూర్”

    “The Legend Rabindranath Tagore”

    ?!

    మెచ్చుకోండి

  5. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువు గారూ..

    మెచ్చుకోండి

    1. Thank you subha and I wish you and all your family members that the new year unveils an era of unending happiness, pleasure, fulfilling work and commensurate rewards.
      with hearty best wishes

      మెచ్చుకోండి

  6. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్
    అనువాదం చాలా బాగుంది.
    టాగోర్ నాకు చాలా అభిమాన కవి
    నేమ్ డ్రాపింగ్ అనుకోకపోతే కొన్ని విషయాలు……..

    క్రిసెంట్ మూన్ లోని అన్ని పద్యాలను ఇదివరలో అనువదించాను. చాలా మట్టుకు పోస్ట్ చేసాను. కొన్ని ఇంకా ఉన్నాయి.
    ఇక ఈ పద్యం ఇలా మొదలయ్యింది నా అనువాదంలో

    పాపాయి లోకం
    మా పాపాయికే చెందిన ప్రపంచంలో నాకూ కాస్త చోటుదొరికితే బాగుణ్ణు.
    ఆ లోకంలో తారలు తనతో మాట్లాడతాయని,
    అంబరం తన ఇంద్రధనస్సులతోను, తింగరి మబ్బులతోనూ
    తనమోముపైకి వంగి వినోదింపచేస్తుందని నాకు తెలుసు……..

    నా అనువాదాల్ని చూసిన మిత్రుడొకరు ఇది చిన్నపిల్లల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది కనుక పదాలు కూడా లలితంగా ఉండాలి. కానీ నీ భాష కొంచెం బరువుగా ఉంది అని సూచించాడు. అప్పటి నుంచి మిగిలిన వాటిని ఎడిట్ చేసి మళ్ళీ రాయాలనిపించినా బద్దకించి ఊరుకొన్నాను. నేను పైన ఇచ్చిన నా అనువాదాన్ని (కొన్ని వాక్యాలు మాత్ర్రమే) మీ అనువాదం తో పోల్చినపుడు నా మిత్రుడు చెప్పిన విషయం స్పష్టమైంది.

    మీ అనువాద పటిమకు మరొక్కసారి ప్రణమిల్లుతూ

    ఈ క్రింది లింకులో టాగోర్ స్ట్రే బర్డ్స్ అనువాదం చదువుకొనవచ్చును

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    మెచ్చుకోండి

  7. బాబాగారూ,
    ఎంతో ప్రేమ పూర్వకంగా వ్రాసిన ఈ వ్యాఖ్యకి నేనేమి సమాధానం ఇవ్వగలను? నామీద అవ్యాజమైన అభిమానంతొనో గౌరవంతోనో అంటున్నారు గాని, మీ అనువాదం కూడ చక్కగానే ఉంది. ఇక అభిప్రాయాలంటారా మనం చదివేటప్పటి మన మనః స్థితిని బట్టిగూడా ఉంటాయి. అదిగాక లోకో భిన్న రుచీ అనికదా ఆర్యోక్తి.
    టాగోర్ నాకుకూడా అభిమాన కవే. ఇంగ్లీషులో Kumud Biswas Tagore కవిత్వాన్ని బెంగాలీ మాతృకలనుండి ఎప్పడినుండో చాలా చక్కగా అనువాదం చేస్తున్నారు. http://www.boloji.com poetry section లో మీరు చూడొచ్చు. నిజానికి ఆ అనువాదాలు చదివిన తర్వాతే నాకు టాగోరు రచనల మీద అభిమానం పెరిగింది.
    అనేక ధన్యవాదాలతో,
    మూర్తి

    మెచ్చుకోండి

  8. Nice

    Not Only the Post

    The Way of your “Sambhashana” (comments) Too

    🙂

    ?!

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: