అర్రర్రే! వాళ్ళు నీ పలక విరిచేసారా? నాకు తెలుసులే;
ఈ స్వేఛ్ఛగా ఆడుకోడాలూ, బడికెళ్ళడాలూ
త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;
అసలైన జీవితమూ, ప్రేమా త్వరలోనే ఆవహిస్తాయి.
అదిగో చిట్టితల్లీ ! ఏడవకమ్మా, ఏడవకు!
.
అదిగో చిట్టితల్లీ, ఏడవకు, ఏడవకు!
అయ్యో, వాళ్ళు నీ హృదయాన్ని బ్రద్దలు చేసారా? నాకు తెలుసులే;
ఇంద్రధనుసు తళతళలూ,
తెలివయసు తొలకరి కలలూ
త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;
నువ్వు వగచేవన్నీ భగవంతుని చేతి బందీలు…
అదిగో! ఏడవకమ్మా, ఏడవకు!
.
జేమ్స్ విట్ కూంబ్ రైలీ.
అమెరికను కవి, రచయిత
.
A Life-lesson
.
There! little girl; don’t cry! They have broken your doll, I know; And your tea-set blue, And your play-house, too, Are things of the long ago; But childish troubles will soon pass by. — There! little girl; don’t cry!
There! little girl; don’t cry! They have broken your slate, I know; And the glad, wild ways Of your schoolgirl days Are things of the long ago; But life and love will soon come by. — There! little girl; don’t cry!
There! little girl; don’t cry! They have broken your heart I know; And the rainbow gleams Of your youthful dreams Are things of the long ago; But Heaven holds all for which you sigh. — There! little girl; don’t cry!
నువ్వు వగచేవన్నీ భవంతుని చేతి బందీలు…..ఎవరికైనా చివరి మజిలీ అదే…బాగుంది
మెచ్చుకోండిమెచ్చుకోండి
విషాదం జీవితంలో అన్ని దశలలోనూ వెంటాడుతుందనీ, మనచేతులో లేనివాటిని అవగాహన చేసుకుని ఎలాసర్దుకుపోవాలో అందంగా చెప్పాడు కవి.
మెచ్చుకోండిమెచ్చుకోండి