అనువాదలహరి

బ్రతుకు ఉపదేశం — జేమ్స్ విట్ కూంబ్ రైలీ

Image Courtesy: http://t1.gstatic.com

.

అరే! చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!

వాళ్ళు నీ ఆటబొమ్మ విరిచేసారా, నాకు తెలుసులే;

నీ వంటగిన్నెలూ, బొమ్మరిల్లూ కూడా

ఎప్పుడో పాడుచేసేసారా? అర్రర్రే;

ఈ బాల్యావస్థలన్నీ త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

ఇదిగో! చిట్టితల్లీ, ఏడవకమ్మా, ఏడవకు!

.

అదిగో, చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!

అర్రర్రే! వాళ్ళు నీ పలక విరిచేసారా? నాకు తెలుసులే;

ఈ స్వేఛ్ఛగా ఆడుకోడాలూ, బడికెళ్ళడాలూ

త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

అసలైన జీవితమూ, ప్రేమా త్వరలోనే ఆవహిస్తాయి.

అదిగో చిట్టితల్లీ ! ఏడవకమ్మా, ఏడవకు!

.

అదిగో చిట్టితల్లీ, ఏడవకు, ఏడవకు!

అయ్యో, వాళ్ళు నీ హృదయాన్ని బ్రద్దలు చేసారా? నాకు తెలుసులే;

ఇంద్రధనుసు తళతళలూ,

తెలివయసు తొలకరి కలలూ

త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

నువ్వు వగచేవన్నీ భగవంతుని చేతి బందీలు…

అదిగో! ఏడవకమ్మా, ఏడవకు!

.

జేమ్స్ విట్ కూంబ్ రైలీ.

అమెరికను కవి, రచయిత

.

A Life-lesson

.

There! little girl; don’t cry!
They have broken your doll, I know;
And your tea-set blue,
And your play-house, too,
Are things of the long ago;
But childish troubles will soon pass by. —
There! little girl; don’t cry!

There! little girl; don’t cry!
They have broken your slate, I know;
And the glad, wild ways
Of your schoolgirl days
Are things of the long ago;
But life and love will soon come by. —
There! little girl; don’t cry!

There! little girl; don’t cry!
They have broken your heart I know;
And the rainbow gleams
Of your youthful dreams
Are things of the long ago;
But Heaven holds all for which you sigh. —
There! little girl; don’t cry!

.

James Whitcomb Riley

(October 7, 1849 – July 22, 1916)

American Poet and author.

%d bloggers like this: