కొండ ఎగుడు … క్రిస్టినా రోజెటి

Image Courtesy: http://www.bing.com

.

ఈ రోడ్డు అలా తిరిగుతూ తిరుగుతూ కొండ చివరిదాకా పోతుందా?

ఆహా! కొండ కొనకొమ్ము దాకా.

అక్కడికి చేరడానికి రోజంతా పడుతుందా? 

మిత్రమా! ఉదయం ఎక్కడం మొదలెడితే చీకటిపడుతుంది చేరేసరికి.

.

మరి రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందికి వసతి ఏమైనా?

చీకటిపడగానే, ఇంటికప్పొకటి కనిపిస్తుంది.

కొంపదీసి చీకట్లో కనిపించకుండా పోదుగద?

దాన్ని కనుక్కోలేకపోయే అవకాశమే లేదు.

.

రాత్రి ఇతర బాటసారుల్ని కలిసే అవకాశం ఉంటుందా?

ఆ! నీకంటే ముందు వెళ్ళిన వారందరినీ కలవొచ్చు.

అలా అయితే, అది కనిపించగానే తలుపు తట్టాలా, లేక చూడగానే పిలవొచ్చా?

అక్కడ ద్వారం దగ్గర ఎవ్వరూ నిలబడవలసిన అవసరం రాదు.

.

కాళ్ళు పుళ్ళయిపోయి నీరసంగా ఉంది. సౌకర్యంగా ఉంటుందా?

పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది.

అక్కడ నాకూ మిగతా వాళ్లకీ చాలినన్ని పడకలుంటాయంటావా?

ఆహా! ఎంతమంది వస్తే అంతమందికీ సరిపడా.

.

క్రిస్టినా రోజెటి

.
Up-Hill
.
Does the road wind up-hill  all the way?
Yes, to the very end.
Will the day’s journey take the whole long day?
From morn to night, my friend.
.
But is there for the night a resting place?
A roof for when the slow dark hours begin.
May not the darkness hide it from my face?
You cannot miss that inn.
.
Shall I meet the other wayfarers at night?
Those who have gone before.
Then must I knock, or call when just in sight?
They will not keep you standing at that door.
.
Shall I find comfort, travel-sore and weak?
Of labour you will find the sum.
Will there be beds for me and all who seek?
Yes, beds for all who come.
.
Christina Rosetti.

“కొండ ఎగుడు … క్రిస్టినా రోజెటి” కి 2 స్పందనలు

  1. పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది…జీవిత సత్యం…బాగుంది.

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      మృత్యువు గురించీ, ఎడతెగని జీవిత ప్రయాణం గురించీ ఇంత అందంగా చాల సరళమైన పదాలతో కవిత్వం చెప్పిన వాళ్ళు అరుదు. మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: