అనువాదలహరి

కొండ ఎగుడు … క్రిస్టినా రోజెటి

Image Courtesy: http://www.bing.com

.

ఈ రోడ్డు అలా తిరిగుతూ తిరుగుతూ కొండ చివరిదాకా పోతుందా?

ఆహా! కొండ కొనకొమ్ము దాకా.

అక్కడికి చేరడానికి రోజంతా పడుతుందా? 

మిత్రమా! ఉదయం ఎక్కడం మొదలెడితే చీకటిపడుతుంది చేరేసరికి.

.

మరి రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందికి వసతి ఏమైనా?

చీకటిపడగానే, ఇంటికప్పొకటి కనిపిస్తుంది.

కొంపదీసి చీకట్లో కనిపించకుండా పోదుగద?

దాన్ని కనుక్కోలేకపోయే అవకాశమే లేదు.

.

రాత్రి ఇతర బాటసారుల్ని కలిసే అవకాశం ఉంటుందా?

ఆ! నీకంటే ముందు వెళ్ళిన వారందరినీ కలవొచ్చు.

అలా అయితే, అది కనిపించగానే తలుపు తట్టాలా, లేక చూడగానే పిలవొచ్చా?

అక్కడ ద్వారం దగ్గర ఎవ్వరూ నిలబడవలసిన అవసరం రాదు.

.

కాళ్ళు పుళ్ళయిపోయి నీరసంగా ఉంది. సౌకర్యంగా ఉంటుందా?

పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది.

అక్కడ నాకూ మిగతా వాళ్లకీ చాలినన్ని పడకలుంటాయంటావా?

ఆహా! ఎంతమంది వస్తే అంతమందికీ సరిపడా.

.

క్రిస్టినా రోజెటి

.
Up-Hill
.
Does the road wind up-hill  all the way?
Yes, to the very end.
Will the day’s journey take the whole long day?
From morn to night, my friend.
.
But is there for the night a resting place?
A roof for when the slow dark hours begin.
May not the darkness hide it from my face?
You cannot miss that inn.
.
Shall I meet the other wayfarers at night?
Those who have gone before.
Then must I knock, or call when just in sight?
They will not keep you standing at that door.
.
Shall I find comfort, travel-sore and weak?
Of labour you will find the sum.
Will there be beds for me and all who seek?
Yes, beds for all who come.
.
Christina Rosetti.
%d bloggers like this: