దివ్య దృష్టి …జాయిస్ కిల్మర్

Image Courtesy: http://www.mlahanas.de/Greeks/Mythology

.

అంతా అంటుంటారు

“హోమరు” గ్రుడ్డివాడనీ,

అతని కళ్ళలోకి చూసి అతని కలల్ని ప్రతిఫలించే

ముఖాలను చూడలేకపోయేవాడనీ.

కానీ, అతనికి

దేవతలని వారి దివ్య క్షేత్రాలకు కూడా

అనుసరించగల దివ్యదృష్టి ఉన్నట్టు కనపడుతుంది.

.

నాకు ఏ దివ్యదృష్టీ లేదు.

పూలబాణాలు ధరించిన మన్మథుడిని  గాని,

విలయాన్ని సృష్టించగల ఇంద్రునిగాని,

అతని రాణి శచీదేవినిగాని చూడగలగడానికి.

అయినా,

ఒక అమాయకపు కన్నెహృదయంలో,

ఈ ప్రపంచంలోని ఆనందాన్నంతా

నేను చూడగలిగాను

.

జాయిస్ కిల్మర్

.

VISION

(For Aline)

Homer, they tell us, was blind and could not see the beautiful faces

Looking up into his own and reflecting the joy of his dream,

Yet did he seem

Gifted with eyes that could follow the gods to their holiest places.

I have no vision of gods, not of Eros with love-arrows laden,

Jupiter thundering death or of Juno his white-breasted queen,

Yet have I seen

All of the joy of the world in the innocent heart of a maiden.

.

Joyce Kilmer

“దివ్య దృష్టి …జాయిస్ కిల్మర్” కి 2 స్పందనలు

  1. ఒక అమాయకపు కన్నె హృదయంలో…..గొప్ప ఊహ

    మెచ్చుకోండి

  2. శర్మగారూ,
    ఈ కవితలోని సౌందర్యాన్నంతా ఆ ఒక్క ముక్కలో చెప్పాడు కవి.
    నామట్టుకు నాకు “రొమాంటిక్ మూవ్ మెంట్ ” తెచ్చిన మంచి మార్పుల్లో ప్రకృతి ఆరాధనతో పాటు, బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యాన్ని చూడగలగడం ఒకటి.
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మూర్తి

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: