పోగొట్టుకున్న స్వరం … ఏడిలేడ్ ఏన్ పార్కర్

Image Courtesy: http://www.fwembassytheatre.org

.

ఒకరోజు నేను “ఆర్గన్” ముందు కూచున్నాను

బడలిన నా మనసు మనసులోలేదు

నా వేళ్ళు వూరికినే లక్ష్యంలేకుండా

మెట్లమీద తారాడుతూ చప్పుడుచేస్తున్నాయి

.

నేనేం వాయిస్తున్నానో నాకే తెలియడం లేదు

అసలు అప్పుడు నేనేమిటాలోచిస్తున్నానో కూడా.

అనుకోకుండా ఒక అద్భుతమైన స్వరం పలికింది

“తథాస్తు” అన్న వేదోక్త మంగళాశీర్వచనంలా

.

అంతే! సంకీర్తనానంతర ఘంటారావంలా

అది వెల్లువై ఆ సంధ్యకెంజాయని ముంచెత్తింది.

పరమప్రశాంతతాస్పర్శతో

అది నా సంతప్తహృదయం మీద నడయాడింది

.

ప్రేమ వైరాన్ని పరిహరించినట్టు

అది బాధనీ, దుఃఖాన్నీ ఉపశమింపజేసి

అపశృతుల జీవనగతిలో

శ్రావ్యమైన సుస్వరంలా నినదించింది

.

తాత్పర్యాల వైరుధ్యాలనుండి అంతస్సూత్రాన్ని వెలికిదీసి

ఒక పరిపూర్ణ శాంతి స్వరూపాన్ని సాకారంచేసింది

విడువడానికి ఇష్టంలేనట్టుగా,

వణుకుతూ వణుకుతూ నిశ్శబ్దంలోకి లయించింది

.

ఆ ఆర్గన్ ఆత్మలోంచి ఆవిర్భవించి

నా శరీరంలోకి ప్రవహించిన

ఆ పవిత్ర స్వరాన్ని పునః సృష్టిచెయ్యడానికి

విశ్వప్రయత్నం చేశాను. కానీ, అది నిష్ఫలం

.

బహుశా, మృత్యుదేవత ఒక్కటే

ఆ అమృత స్వరంలో భాషిస్తుంది.

మళ్ళీ స్వర్గంలోనే

ఆ మహత్తర స్వరాన్ని తిరిగి వినగలుగుతాను

.

(1860-61)

ఏడిలేడ్ ఏన్ పార్కర్

.

A Lost Chord

.

Seated one day at the Organ,

I was weary and ill at ease,

And my fingers wandered idly

Over the noisy keys.

.

I do not know what I was playing,

Or what I was dreaming then;

But I struck one chord of music,

Like the sound of a great Amen.

.

It flooded the crimson twilight

Like the close of an Angel’s Psalm,

And it lay on my fevered spirit

with a touch of infinite calm.

.

It quieted pain and sorrow,

Like love overcoming strife;

It seemed the harmonious echo

From our discordant life.

.

It linked all perplexed meanings

Into one perfect peace,

And trembled away into silence

as if it were loth to cease.

.

I have sought, but seek it vainly,

That one lost chord divine,

Which came from the soul of the Organ,

And entered into mine.

.

It may be that Death’s bright angel

Will speak in that chord again,—

It may be that only in Heaven

I shall hear that grand Amen.

.

(1860-61)

Adelaide Anne Procter

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: