నేనింకా నీదానను కాలేదు … సారా టీజ్డేల్ Image Courtesy: http://cdn.designrfix.com . నే నింకా నీదానకాలేదు, నీలోకరిగిపోలేదు, ఉనికికోల్పోలేదు; మధ్యాహ్నం వెలిగించిన కొవ్వొత్తిలా, మున్నీటగలిసిన మంచుతరకలా, నీలో నన్ను నే కోల్పోవాలన్న కాంక్ష ఉన్నప్పటికీ . నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిజమే! ఇప్పటికీ నువ్వు నాకొక సుందరతర తరళ తేజస్సువే. అయినా, నేను ఇంకా నేనుగానే మిగిలి ఉన్నాను వెలుగులో హరించిన వెలుగునౌ కోర్కె ఉన్నప్పటికీ . ఓహ్! నన్ను నీ ప్రేమతో ముంచెత్తు — నీ ప్రేమ జడిలో కొట్టుకుపోయి, సుడిగాలికి కొండెక్కిన దీపకళికలా, నాచేతన సమస్తమూ సమయించి, నన్నొక బధిరాంధగా మిగిలిపోనీ! . సారా టీజ్డేల్ . I Am Not Yours . I am not yours, not lost in you, Not lost, although I long to be Lost as a candle lit at noon, Lost as a snowflake in the sea. You love me, and I find you still A spirit beautiful and bright, Yet I am I, who long to be Lost as a light is lost in light. Oh plunge me deep in love — put out My senses, leave me deaf and blind, Swept by the tempest of your love, A taper in a rushing wind. Sarah Teasdale Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 19, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుమున్నీటగలిసిన మంచుతరకసారా టీజ్డేల్I Am Not YoursSara Teasdale ఏళ్ళు గడిచేక… టెడ్ కూజర్, అమెరికను కవి.పోగొట్టుకున్న స్వరం … ఏడిలేడ్ ఏన్ పార్కర్ స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.