రోజు: డిసెంబర్ 19, 2011
-
నేనింకా నీదానను కాలేదు … సారా టీజ్డేల్
. నే నింకా నీదానకాలేదు, నీలోకరిగిపోలేదు, ఉనికికోల్పోలేదు; మధ్యాహ్నం వెలిగించిన కొవ్వొత్తిలా, మున్నీటగలిసిన మంచుతరకలా, నీలో నన్ను నే కోల్పోవాలన్న కాంక్ష ఉన్నప్పటికీ . నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిజమే! ఇప్పటికీ నువ్వు నాకొక సుందరతర తరళ తేజస్సువే. అయినా, నేను ఇంకా నేనుగానే మిగిలి ఉన్నాను వెలుగులో హరించిన వెలుగునౌ కోర్కె ఉన్నప్పటికీ . ఓహ్! నన్ను నీ ప్రేమతో ముంచెత్తు — నీ ప్రేమ జడిలో కొట్టుకుపోయి, సుడిగాలికి కొండెక్కిన దీపకళికలా, నాచేతన సమస్తమూ…