ఏళ్ళు గడిచేక… టెడ్ కూజర్, అమెరికను కవి.

http://www.stargazer-observatory.com/4490+sn2008ax.gif
Image Courtesy: http://www.stargazer-observatory.com

.

ఈరోజు

నేను దూరం నుండి గమనించేను

నువ్వు అలా నడుచుకుంటూ నిష్క్రమించడం…

మెరిసే హిమానీ నదమొకటి

చప్పుడు చెయ్యకుండా సముద్రంలోకి జారుకుంది.

ఎప్పటిదో తాతలనాటి సింధూర వృక్షమొకటి,

నామమాత్ర పత్రావశిష్టమై, నదిలోకి వాలిపోయింది.

కోడిపిల్లలకు గింజలు వెదజల్లుతున్న ముదుసలి ఒకతె

తృటికాలం తలెత్తి చూసింది.

.

మన పాలపుంతకావల,

ముప్ఫైఐదుమంది సూర్యులపెట్టు

నక్షత్రమొకటి విస్ఫోటనచెంది, 

తోడులేని నాహృదయ ద్వారసీమల నిలిచిన

ఖగోళశాస్త్రజ్ఞుడి నేత్రపటలమ్మీద

ఒక పచ్చని చుక్క పొడిచి

అదృశ్యమయిపోయింది.

.

టెడ్ కూజర్

( 25 April 1939 -)

అమెరికను కవి.  

2005 పులిట్జరు బహుమతి గ్రహీత.

.

After Years …

.

Today, from a distance, I saw you
walking away, and without a sound
the glittering face of a glacier
slid into the sea. An ancient oak
fell in the Cumberlands, holding only
a handful of leaves, and an old woman
scattering corn to her chickens looked up
for an instant. At the other side
of the galaxy, a star thirty-five times
the size of our own sun exploded
and vanished, leaving a small green spot
on the astronomer’s retina
as he stood on the great open dome
of my heart with no one to tell.

.

Ted Kooser

( 25 April 1939 -)

American Poet

2005 Pulitzer Prize Winner

“ఏళ్ళు గడిచేక… టెడ్ కూజర్, అమెరికను కవి.” కి 2 స్పందనలు

  1. విలువకట్టలేని భావాలను అక్షరరూపంలో ఎంత చక్కగా చూపించారో!

    మెచ్చుకోండి

  2. Thanks Rasagna for your appreciation of Ted Kooser.

    For some time, he also featured the best contemporary American poetry in AllPoetry.com.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: