రోజు: డిసెంబర్ 18, 2011
-
ఏళ్ళు గడిచేక… టెడ్ కూజర్, అమెరికను కవి.
. ఈరోజు నేను దూరం నుండి గమనించేను నువ్వు అలా నడుచుకుంటూ నిష్క్రమించడం… మెరిసే హిమానీ నదమొకటి చప్పుడు చెయ్యకుండా సముద్రంలోకి జారుకుంది. ఎప్పటిదో తాతలనాటి సింధూర వృక్షమొకటి, నామమాత్ర పత్రావశిష్టమై, నదిలోకి వాలిపోయింది. కోడిపిల్లలకు గింజలు వెదజల్లుతున్న ముదుసలి ఒకతె తృటికాలం తలెత్తి చూసింది. . మన పాలపుంతకావల, ముప్ఫైఐదుమంది సూర్యులపెట్టు నక్షత్రమొకటి విస్ఫోటనచెంది, తోడులేని నాహృదయ ద్వారసీమల నిలిచిన ఖగోళశాస్త్రజ్ఞుడి నేత్రపటలమ్మీద ఒక పచ్చని చుక్క పొడిచి అదృశ్యమయిపోయింది. . టెడ్ కూజర్ (…