అనువాదలహరి

నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్

Image Courtesy: http://alanbauer.com

.

నేను మరణించిన పిదప, వానలోతడిసిన తరుల కురులను

ఏప్రిలునెల విదిలించే వేళ, నువ్వు నా సమాధిమీద

గుండెలు పగిలి శోకిస్తే శోకింతువు గాక!

నేనేం ఖాతరు చెయ్యను.

.

జడివాన తరుశాఖలను అవనతం చేసినపుడు,

పత్రాతపత్రపాదపాల ప్రశాంతత నేనవధరిస్తాను.

నువ్విప్పుడెంత మౌనంగా, నిర్దయగా ఉన్నావో

అంతకంటే మౌనంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాను.

.

నేను అమితంగా ప్రేమిస్తాను.

పరవళ్ళుతొక్కుతూ, వార్నిధిని కాంక్షించే నదిని నేను.

నేనొక ఉదార వితరణశీలిని.

ప్రేమ నన్ను త్రాగేందుకు వొదగ లేదు.

.

వర్ష, తుషార, ఛాయలు,  ఛాయామాత్రంగానైనా లేని

మరుభూములంట అతని పాదాలు తిరుగాడుతాయి,

సాంద్రనీలగగనం నుండి రిక్కలు

తమ చురుకైన చూపులతో తేరిపారి చూస్తుంటాయి.

.

నిశాభ్యంతరవేళ, నడువలేక నడువలేక,

అవధిమీరిన దాహార్తిని అనునయించడానికి

కోరికతో అతను దిగక తప్పదు

వహ్నివర్ణముగల నిలిచిన నీటియందు.

.

సారా టీజ్డేల్

.

I Shall Not Care

.

When I am dead and over me bright April

Shakes out her rain-drenched hair,

Tho’ you should lean above me broken-hearted,

I shall not care

.

I shall have peace, as leafy trees are peaceful

When rain bends down the bough,

And I shall be more silent and cold-hearted

Than you are now

.

I love too much; I am a river,

Surging with spring that seeks the sea.

I am too generous a giver

Love will not stoop to drink of me

.

His feet will turn to desert places

Shadowless, reft of rain and dew,

Where stars stare down with sharpened faces,

From heavens pitilessly blue

.

And there at midnight sick with faring,

He will stoop down in his desire

To slake the thirst grown past all bearing

In stagnant water keen as fire.

.

Sarah Teasdale

4 thoughts on “నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్”

 1. అక్షరానికి ఎలాంటి గాయాన్నయినా మాన్పించే శక్తి ఎలా ఉందో అలానే ఎటువంటి అంశాన్నయినా కళ్ళకి కట్టినట్టు చూపే శక్తి కూడా ఉంది! ఎటో తీసుకెళ్ళారు దీనితో! వారందరి రచనలను మీరింత చక్కగా రూపొందించి మా అందరి ముందుకీ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు! మీ అనువాదలహరి ఎన్నో గొప్ప గొప్ప అనువాదాలని మా ముందుకి తీసుకురావాలని నా ఆకాంక్ష!

  మెచ్చుకోండి

  1. అమ్మా రసజ్ఞా,
   “అక్షరానికి ఎలాంటి గాయాన్నైనా మాన్పగలిగిన శక్తి ఉంది” అన్నమాట చాలా పరిణతి చెందిన హృదయంలోంచి మాత్రమే రాగలదు. చిన్నదానివైనా చక్కగా చెప్పావు. కవితలోని సౌందర్యం అంతా మూల రచనలోదే. అనువాదం దానికి దగ్గరగా రావడానికి చేసే ప్రయత్నం మాత్రమే. చిన్న మాటలే అయినా, అందులో ప్రకటించిన భావం అమోఘం. టీజ్డేల్, నన్నయగారు చెప్పినట్టు, అలతి అలతి మాటలతోనే అనల్పమైన భావాలను ప్రకటించగలిగిన ప్రతిభాశాలి.
   అభినందనలతో,

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: