అనువాదలహరి

నేను ఖాతరు చెయ్యను … సారా టీజ్డేల్

Image Courtesy: http://alanbauer.com

.

నేను మరణించిన పిదప, వానలోతడిసిన తరుల కురులను

ఏప్రిలునెల విదిలించే వేళ, నువ్వు నా సమాధిమీద

గుండెలు పగిలి శోకిస్తే శోకింతువు గాక!

నేనేం ఖాతరు చెయ్యను.

.

జడివాన తరుశాఖలను అవనతం చేసినపుడు,

పత్రాతపత్రపాదపాల ప్రశాంతత నేనవధరిస్తాను.

నువ్విప్పుడెంత మౌనంగా, నిర్దయగా ఉన్నావో

అంతకంటే మౌనంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటాను.

.

నేను అమితంగా ప్రేమిస్తాను.

పరవళ్ళుతొక్కుతూ, వార్నిధిని కాంక్షించే నదిని నేను.

నేనొక ఉదార వితరణశీలిని.

ప్రేమ నన్ను త్రాగేందుకు వొదగ లేదు.

.

వర్ష, తుషార, ఛాయలు,  ఛాయామాత్రంగానైనా లేని

మరుభూములంట అతని పాదాలు తిరుగాడుతాయి,

సాంద్రనీలగగనం నుండి రిక్కలు

తమ చురుకైన చూపులతో తేరిపారి చూస్తుంటాయి.

.

నిశాభ్యంతరవేళ, నడువలేక నడువలేక,

అవధిమీరిన దాహార్తిని అనునయించడానికి

కోరికతో అతను దిగక తప్పదు

వహ్నివర్ణముగల నిలిచిన నీటియందు.

.

సారా టీజ్డేల్

.

I Shall Not Care

.

When I am dead and over me bright April

Shakes out her rain-drenched hair,

Tho’ you should lean above me broken-hearted,

I shall not care

.

I shall have peace, as leafy trees are peaceful

When rain bends down the bough,

And I shall be more silent and cold-hearted

Than you are now

.

I love too much; I am a river,

Surging with spring that seeks the sea.

I am too generous a giver

Love will not stoop to drink of me

.

His feet will turn to desert places

Shadowless, reft of rain and dew,

Where stars stare down with sharpened faces,

From heavens pitilessly blue

.

And there at midnight sick with faring,

He will stoop down in his desire

To slake the thirst grown past all bearing

In stagnant water keen as fire.

.

Sarah Teasdale

%d bloggers like this: