అనువాదలహరి

నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.

Image Courtesy:http://infokarnata.files.wordpress.com

.

నిన్నే తలుచుకున్నా, నువ్వీ అందాన్ని ఎలా ఆశ్వాదిస్తావోనని ఆలోచిస్తూ…

ఈ సుదీర్ఘమైన బీచిలో ఒక్కర్తినీ ఒంటరిగా నడుస్తూ,

భంగపడుతున్న కెరటాలు  ఒక క్రమంలో చేసే ఘోష వింటున్నా…

నీకూ నాకూ విసుగ్గొచ్చేది ఈ ఏకశృతి వినలేక ఒకప్పుడు.

.

ఇపుడు నన్నావరించి ఉన్నవి… ప్రతిధ్వనించు సైకతశ్రోణులూ,

దిశాభ్యంతరములునిండిన రాగరహిత విపులార్ణవ రజతశోభా.

మళ్ళీ నువ్వు నాతోకలిసి ఈ తరంగధ్వని వినే సమయానికి

మనిద్దరం మృత్యువులోంచి పయనిస్తాం, యుగాలు దొర్లి పోతాయి.

.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి.

పులిట్జరు బహుమతి విజేత

.

I Thought of You

.

I thought of you and how you love this beauty,
And walking up the long beach all alone
I heard the waves breaking in measured thunder
As you and I once heard their monotone.

Around me were the echoing dunes, beyond me
The cold and sparkling silver of the sea —
We two will pass through death and ages lengthen
Before you hear that sound again with me.

.

Sarah Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American Poet and Pulitzer Prize Winner.

4 thoughts on “నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.”

 1. ఒకసారేప్పుడో విన్నాను ఈవిడ గురించి కానీ ఎప్పుడూ ఈవిడ రచనలు చదవలేదు! బాగుందండీ! మీ అనువాదాలతో వాటికి కొత్త ఊపిరినిస్తున్నారు! తెలుగులో లిపి చాలా చిన్నదిగా ఉంది కొంచెం పెద్దది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం!

  మెచ్చుకోండి

 2. అమ్మా రసజ్ఞా,
  నేను ఈవిడ కవితలు చదవడం కాకతాళీయంగా తటస్థించింది. అవి ఎంత రసవత్తరంగా, భావగర్భితంగా, క్లుప్తంగా ఉన్నాయంటే, మళ్ళీ మళ్ళీ చదవింపజేసాయి. అలాగే ఏడిలేడ్ పార్కర్ కవితలు చదివినప్పుడు కళ్ళంట నీళ్ళు ఆపుకోలేకపోయాను. వీళ్ళిద్దరివీ అనువాదాలు ఇంకా వస్తాయి నా బ్లాగులో.
  నీ సలహామేరకు Font పెంచాను. సాధారణంగా ఈ సైజులోనే ఉంచుతున్నా ప్రతి పోస్టూను. ఎందుకో నాదృష్టినుండి తప్పిపోయింది నిన్న.
  అభినందనలతో,

  మెచ్చుకోండి

 3. అవును. కాకపోతే ఎన్నియుగాలు గడిచిపోతాయో అటువంటి కలయిక జరిగేలోగా అని చెబుతూ, ఇక్కడ విరహం మీద ఎక్కువ stress ఇస్తున్నాది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: