రోజు: డిసెంబర్ 16, 2011
-
నిన్నే తలుచుకున్నా … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.
. నిన్నే తలుచుకున్నా, నువ్వీ అందాన్ని ఎలా ఆశ్వాదిస్తావోనని ఆలోచిస్తూ… ఈ సుదీర్ఘమైన బీచిలో ఒక్కర్తినీ ఒంటరిగా నడుస్తూ, భంగపడుతున్న కెరటాలు ఒక క్రమంలో చేసే ఘోష వింటున్నా… నీకూ నాకూ విసుగ్గొచ్చేది ఈ ఏకశృతి వినలేక ఒకప్పుడు. . ఇపుడు నన్నావరించి ఉన్నవి… ప్రతిధ్వనించు సైకతశ్రోణులూ, దిశాభ్యంతరములునిండిన రాగరహిత విపులార్ణవ రజతశోభా. మళ్ళీ నువ్వు నాతోకలిసి ఈ తరంగధ్వని వినే సమయానికి మనిద్దరం మృత్యువులోంచి పయనిస్తాం, యుగాలు దొర్లి పోతాయి. . సారా టీజ్డేల్ (August…