ఒంటరి రైతు … ఆర్. ఎస్. థామస్. వేల్సు కవి.

పాపం ఒక గిరిజన రైతు అడవిలో దారి తప్పాడు 

ఎక్కడో కదిలిన చప్పుడు, తలెత్తి మీదికి చూసాడు.

పిల్లగాలి తుర్రున పరిగెత్తడం కనిపించింది.

.

ఎక్కడినించో మాటలు గాలిలోంచి తేలివస్తున్నాయి.

ఎక్కడ? ఎక్కడ? అని పరికించాడు.

సెలయేరు తనలోతాను మాట్లాడుకుంటూ పోతోంది. అంతే!

.

వసంతంలో ఒకసారి తను బాటలో నడుస్తుండగా

ఆకులసందునుండి వినవచ్చిన కీరవం అతన్ని వంచించింది. 

ఒక్క నిముషం … ఒక్క నిముషం … నాలుగు స్వరాలు…

వెనుదిరిగేడు… వేరెవరూ కాదు…

ముళ్ళపొదల్లో ఓ పిట్ట తనగొంతు సవరించుకొంటోందంతే!

.

గిరిజన రైతు, పాపం, తనని తాను నిందించుకున్నాడు

మనుషులేమోనని భ్రమపడి

వాటిని పట్టించుకున్నందుకు.

.

కానీ ఏం ప్రయోజనం,

మళ్ళీ మళ్ళీ అలా వ్యర్థంగా ఆగుతూ, చూస్తూ, వింటూనే ఉన్నాడు.

మనసులోని భయాన్ని చెవులు రట్టుచేస్తున్నాయి.

.

ఆర్. ఎస్. థామస్. 

వేల్సు కవి, క్రైస్తవ మతాచార్యుడు.  

(29 March 1913 – 25 September 2000)

.

The Lonely Farmer

.

Poor hill farmer astray in the grass:
There came a movement and he looked up, but
All that he saw was the wind pass.

There was a sound of voices in the air,
But where,where? It was only the glib stream talking
Softly to itself. And once when he was walking 
Along a lane in spring he was deceived
By a shrill whistle coming through the leaves:
Wait a minute, wait a minute — four soft notes;
He turned, and it was nothing, only a thrush
In the thorn bushes easing its throat.

He swore at himself for paying heed,
The poor hill farmer, so often again
Stopping, staring, listening, in vain,
His ear betrayed by the heart’s need.

.

R S Thomas

(29 March 1913 – 25 September 2000)

A Welsh poet  and Clergyman.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: