A Ditty at Dawn … K. Godavari Sarma. Image Courtesy: http://www.joshuawoods.com . I don’t think it’s an intelligent bargain To trade-off Larynx for silence. The moment my ears are awake to the Summer’s day The sweet tweeting birds Encourage me to become a poet. Kindling the fire in my gullet And shutting my mouth I continue to recline idling on the bed. Words would be cooking within. I hate to play a Dussasana With ideas sleeping cozily like creased ironed clothes, Dragging them by hair. I have the patience of a child Watching eagerly at the tree Waiting for the guava to ripen. Suddenly, like the song of Saigal On air on the Radio, An image silently blossoms in my mind. Shaking off my sleepy-bedsheet I sit up To become a Poet. . K. Godavari Sarma (17th August 1954 – 8th February 1990) . Dussasana: Is the Brother of Duryodhana the antagonist of the Mahabharata Story. He drags Droupadi into the court by her hair. Saigal: Kundan Lal Saigal (11 April 1904 – 18 January 1947) is a noted actor, Playback Singer of the Hindi Screen of yesteryears. . ఉదయగానం . స్వరపేటికని అమ్మేసి నిశ్శబ్దాన్ని కొనుక్కోవడం తెలివైన పని అని నేననుకోను. వేసవి ఉదయం చెవులు విప్పగానే కమ్మని పాటల పిట్టలన్నీ కవి కమ్మని ప్రోత్సహిస్తాయి నన్ను. గొంతులో నిప్పురాజేసి పెదవులుమాత్రం బిగించి అలాగే పడుక్కుంటాను. పదాలేవో పచనమౌతుంటాయి లోపల. మడతపెట్టిన ఇస్త్రీబట్టల్లా ముడుచుకుపడుకున్న భావాల్ని జుట్టుపట్టుకులాక్కొచ్చి దుశ్శాసించడం నాకిష్టం లేదు. జాంకాయ పలకబారడంకోసం చెట్టుకేసి చూస్తూకూర్చునే కుర్రాడిలా ఓర్పుగా నిరీక్షిస్తాను. ఉన్నట్టుండి రేడియోలో సైగల్ లా నా తలలో ఇమేజ్ ఒకటి మెత్తగా వికశిస్తుంది. నేను మత్తు దుప్పటి విదిలించి లేచికూచుని కవినౌతాను. . కె. గోదావరి శర్మ “అంతర్వాహిని” కవితా సంపుటి నుండి. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిడిసెంబర్ 14, 2011