కవులు … జాయిస్ కిల్మర్, అమెరికను కవి
Image Courtesy: http://theplanetd.com
.
జేగంటలు విస్మృతిలోపడ్డపుడు,
అవి శిధిల దివ్య స్థలాలపై పారాడిన చిరుగాలి మోసుకొచ్చినా,
నిష్ప్రయోజనమే.
.
అంతరాంతరాల్లో
అమృతాశనముపై కాంక్షలేని వాని ప్రవచనం
అంతకంటే నిష్ఫలం.
.
భగవదేచ్ఛకులోబడని మన లొల్లాయిపదాలు,
ఊపిరితోపాటు పెదాలు దాటి వచ్చిన తక్షణమే
లయిస్తాయి.
.
మరణాన్ని చవిచూడనివారు
జీవితాన్ని చవిచూడలేరు.
.
విధివ్రాతకు కట్టుబడగలిగినవారుమాత్రమే,
సంకీర్తనను చెయ్యగలరు.
.
జాయిస్ కిల్మర్
(December 6, 1886 – July 30, 1918)
ప్రముఖ అమెరికను కవి, సాహిత్య విమర్శకుడు, విలేఖరి, సంపాదకుడు.
“చెట్లు” అన్న కవిత ఇతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
.
Poets
.
Vain is the chiming of forgotten bells
That the wind sways above a ruined shrine.
Vainer his voice in whom no longer dwells
Hunger that craves immortal Bread and Wine.
Light songs we breathe that perish with our breath
Out of our lips that have not kissed the rod.
They shall not live who have not tasted death.
They only sing who are struck dumb by God.
.
Joyce Kilmer
(December 6, 1886 – July 30, 1918)
American Poet, Literary Critic, Journalist and Editor
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి