ఒక కళ … ఎలిజబెత్ బిషప్

.

పోగొట్టుకోడం ఒక కళ. దానిలో ప్రావీణ్యం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు;

చాలా వస్తువులు అసలు పోగొట్టుకోడానికే ఉన్నాయేమోన్నట్టుంటాయి.

కనుక, అవి పోగొట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదమేం జరిగిపోదు.

.

రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉండు. ఇంటితాళాలు పోగొట్టుకుని

తర్వాత ఒక గంటసేపు గాభరాపడడానికి అలవాటుపడిపో,

పోగొట్టుకునే కళలో ప్రావీణ్యం సంపాదించడమంత కష్టమేం కాదు.

.

తర్వాత అంతకంటే విలువైనవి పోగొట్టుకోడం, తొందరగా పోగొట్టుకోడం సాధన చెయ్యి;

నువ్వెళ్ళవలసిన ప్రదేశాలూ, వూరు పేరూ, మరిచిపోతుండు.

దానివల్ల పెద్ద ప్రమాదమేం జరిగిపోదు.

.

నేను మా అమ్మ వాచీ పోగొట్టుకున్నాను. ఆమాటకొస్తే, నా మూడిళ్ళలో,

ఆఖరుదో, దాని ముందుదో పోగొట్టుకున్నాను.

పోగొట్టుకునే కళలో పట్టు సాధించడం అంత కష్టమేం కాదు.

.

నేను రెండు గొప్ప మహానగరాలను పోగొట్టుకున్నాను.

అంతకంటే విశాలమైనవి,  రెండు నదుల్నీ, ఒక ఖండాన్నీ పోగొట్టుకున్నా.

అవి లేకపోవడం వెలితే, అయితే, అదేమంత కొంపమునిగిపోయే విషయం కాదు.

.

అంతెందుకు?  నిన్ను పోగొట్టుకోవడం

(ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే నీ గొంతు నాకెంతో ఇష్టం)… నే నబధ్ధం ఆడలేను.

ఇప్పుడు   తేటతెల్లమయింది గదా, పోగొట్టుకునేకళలో పట్టుసాధించడం,

అదొక ఉపద్రవం లా కనిపించినప్పటికీ (రాసుకో),  ఎంత సుళువో!

.

ఎలిజబెత్ బిషప్

(ఫిబ్రవరి 8, 1911 – అక్టోబరు 6, 1979)

అమెరికను కవయిత్రి, కథారచయిత్రి. 1949-50 సంవత్సరానికి అమెరికాదేశపు ఆస్థాన కవి, 1956 వ సంవత్సరములో పులిట్జరు ప్రయిజు విజేత, 1970 సంవత్సరపు నేషనల్ బుక్ ఎవార్డ్ గ్రహీత. Great Village, Nova Scotia లోని గృహం ఇప్పుడు ఆమె స్మృతి చిహ్నంగా కళాకారులకు విడిది.  ఎలిజబెత్  బిషప్ 20 వశాతాబ్దపు అతి ముఖ్యమైన, విశిష్టమైన అమెరికను కవయిత్రిగా గుర్తింపు పొందింది.

.

One Art

.

The art of losing isn’t hard to master;
so many things seem filled with the intent
to be lost that their loss is no disaster,

Lose something every day. Accept the fluster
of lost door keys, the hour badly spent.
The art of losing isn’t hard to master.

Then practice losing farther, losing faster:
places, and names, and where it was you meant
to travel. None of these will bring disaster.

I lost my mother’s watch. And look! my last, or
next-to-last, of three beloved houses went.
The art of losing isn’t hard to master.

I lost two cities, lovely ones. And, vaster,
some realms I owned, two rivers, a continent.
I miss them, but it wasn’t a disaster.

— Even losing you (the joking voice, a gesture
I love) I shan’t have lied. It’s evident
the art of losing’s not too hard to master
though it may look like (Write it!) a disaster.

.

Elizabeth Bishop

(February 8, 1911 – October 6, 1979)

American poet and short-story writer. She was the Poet Laureate of the United States from 1949 to 1950, a Pulitzer Prize winner in 1956 and a National Book Award Winner for Poetry in 1970. Elizabeth Bishop House is an artists’ retreat in Great Village, Nova Scotia dedicated to her memory. She is considered one of the most important and distinguished American poets of the 20th century

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: