రోజు: డిసెంబర్ 12, 2011
-
ఒక కళ … ఎలిజబెత్ బిషప్
. పోగొట్టుకోడం ఒక కళ. దానిలో ప్రావీణ్యం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు; చాలా వస్తువులు అసలు పోగొట్టుకోడానికే ఉన్నాయేమోన్నట్టుంటాయి. కనుక, అవి పోగొట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదమేం జరిగిపోదు. . రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉండు. ఇంటితాళాలు పోగొట్టుకుని తర్వాత ఒక గంటసేపు గాభరాపడడానికి అలవాటుపడిపో, పోగొట్టుకునే కళలో ప్రావీణ్యం సంపాదించడమంత కష్టమేం కాదు. . తర్వాత అంతకంటే విలువైనవి పోగొట్టుకోడం, తొందరగా పోగొట్టుకోడం సాధన చెయ్యి; నువ్వెళ్ళవలసిన ప్రదేశాలూ, వూరు పేరూ, మరిచిపోతుండు.…