స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి

Image Courtesy: http://t1.gstatic.com

.

సరోవరాలకు నిలయమైన ఉదయపూర్ లో 

నే నోరోజు గాలి తోడుగా వ్యాహ్యాళికి బయలుదేరాను.

అంతలో ఎవరో చెవిలో ఊదినట్టు

ఒక పాట నా మదిలో మెదిలింది.

కాని ఆ స్వరం ఇక్కడ నే చూసిన

ఏ మానవమాత్రుడిదీ కాదు,

గాలిలాగే, మనిషికూడా అగోచరం.

.

కొండలకు నెలవైన తిరుపతిలో,

పర్వతారోహణ చేస్తూ శిఖరాగ్రం చేరుకునేటప్పటికి

దుముకుతూ గెంతివస్తున్న సెలయేరొకటి కనిపించింది

సంతోషం పట్టలేక ఆనందంతో కేకలేస్తూ.

నేను శిఖరం నుండి క్రిందికి మైదానం వంకా,

నీటిపాయల వంకా చూసేను.

నన్ను కొండ అంచున కలిసిన సెలయేటికంటే

నేనే ఆనందంగా ఉన్నాను.

.

లక్కదీవులలో సముద్రం మీద తెరచాపనెత్తి నే పోతుంటే

గాలిఊదిన మాట, సెలయేటి మాట, ఈ కెరటాల మాట

నాకు స్పష్టం అయ్యేయి.

“మనమెలాగున్నామో తను అలా లేనప్పటికీ

మనమెలాగున్నామో, తనూ అలాగే ఉంటాడు..

అనిలాన్ని శాశించగల బలవంతుడున్నాడా?

సింధువుని బంధించగల సేతువులు ఉన్నయా?

.

ఏలిస్ మిలిగన్

ఐరిష్ కవయిత్రి

(1866-1953)

Cavan: ఇది ఐర్లండులో సరస్సులకు ప్రసిధ్ధిచెందిన ఒక స్థలం

Inish-Owen: ఇది ఉత్తర ఐర్లండులో కొండలకు ప్రసిధ్ధి

Connaucht’s isles: వాయవ్య ఐర్లండులో ఎక్కువ దీవులున్న ప్రాంతం.

(అనువాదం లో మనదేశ భౌగోళిక స్థితులకు తగ్గట్టుగా ఆయా  ప్రదేశాలను

ఎక్కువగా పోలిన ప్రదేశాల పేర్లు (నాకు తెలిసినంత మేరకి) ప్రతిక్షేపించేను. 

రసజ్ఞులు గ్రహింతురుగాక. )

.

A Song of Freedom
.

In Cavan of the little lakes,
As I was walking with the wind,
And no one seen beside me there,
There came a song into my mind:
It came as if the whispered voice
Of one, but none of the human kind,
who walked with me in Cavan there,
And he invisible as wind.
.
On Urris of Inish-Owen,
As I went up the mountain side,
The brook that came leaping down
Cried to me—- for joy it cried;
And when from off the summit far
I looked o’erland and water wide,
I was more joyous than the brook
That met me on the mountain side.
.
To Ara of Connaucht’s isles,
As I went  sailing o’er the sea,
The wind’s word, the brook’s word,
The wave’s word, was plain to me—
‘As we are, though she is not
As we are, shall Banba be—
There is no King  can rule the wind,
There is no fetter for the sea.’
.

(1908)
.

ALICE MILLIGAN

.

(1866-1953)

.

An Irish Nationalist Poet and Writer

Notes:

Cavan:  It is County Town in Northern Ireland famous for lakes.
Inish-Owen:  Is famous for low mountains of Northern Ireland
Connaucht’s isles: They are a group of Islands of Northwest Ireland

These images are substituted with the nearest places with respect to India in the translation.

“స్వేఛ్ఛాగానం … ఏలిస్ మిలిగన్, ఐరిష్ కవయిత్రి” కి 2 స్పందనలు

  1. చక్కని భావం. ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

    1. అమ్మా జ్యోతిర్మయీ,
      ఇంతకుముందు వ్రాసినట్టుగా, 19వ శతాబ్దపు కవయిత్రులు వాళ్ళ ఆలోచనలలో, భావవ్యక్తీకరణలో, అద్భుతమైన ప్రతిభ చూపించారు. కాని ఎందుకో వారికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. నేను కాకతాళీయంగా British Council Libraryలో వెదికినప్పుడు Oxford Anthology అనే పుస్తకం దొరికింది ఈ విషయం మీద. దానికి Editors ISOBEL ARMSTRONG and JOSEPH BRISTOW with CATH SHARROCK. దాని ISBN 0-19-818483-2. Adelaide Anne Procter లాంటి వాళ్ళని చదువుతుంటే, నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఆపుకోవడం కష్టమయింది. అవకాశం ఉంటే ప్రయత్నించండి.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: