ప్రత్యుపకారం … ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcTYjRmmwyh5zwnh2NGJRWSUccDQASEFsZru_N-j2MPZK-KztJHhdA
Image Courtesy: http://t1.gstatic.com

.

తుఫాను భీకరంగా గర్జిస్తోంది.

తెలిమంచు కురవడం అప్పుడే మొదలయ్యింది.

అలసిన పాదాలతో ఒక చిన్ని దేవదూత

రెక్కలల్లార్చుకుంటూ వీధిలో నడుస్తోంది.

.

చంద్రుడు దాగున్నాడు.

ఏ తారకా కాంతివంతముగా లేదు.

కనుక ఆ  రాత్రికి తను స్వర్గం చేరలేనట్లే.

ఎందుకంటే కిరణాలే దేవదూతలకు స్వర్గానికి నిచ్చెనలు.

.

ప్రతి కిటికీ దగ్గరా

తనకింత ఆశ్రయమిమ్మని అర్థించింది.

కానీ, ప్రయోజనం లేకపోయింది…

“చూడు చూడు, వర్షం ఎంత దబదబా కురుస్తోందో” అన్నాయవి.

.

తను వెక్కి వెక్కి ఏడుస్తోంది,

లోపల నవ్వులూ కేరింతలూ ఎక్కువవడం మొదలుపెట్టేయి.

“నాకు కాంత విశ్రామించడానికి చోటూ, కాస్త విశ్రాంతీ ఇవ్వండి,

ప్రతిగా మీకు కోరుకున్న దిస్తా”నని బ్రతిమాలింది.

.

ఒక భావుకుడు

తన హృదయం ఆశల సెలయేటిపై తేలియాడుతుండగా,

పొయ్యిలో మండుతున్న కట్టెలు చూస్తూ కూర్చున్నాడు…

అతనామె  ఏడుపునుకూడా తనకలలో కలగలుపేసుకున్నాడు.

.

కార్మికుడు సమయాభావంచేత కష్టపడుతూ ఉన్నాడు;

ఆత్మీయుల కోల్పోయిన ఒక దుఃఖిత,

తన విషాదం లో తానుంది.

వాళ్ళకి దుఃఖోపశమనం చేస్తానన్న వాగ్దానం వినిపించలేదు.

.

ఒక నిరుపేద కుటీరము ముందు నిలిచి,

దేవదూత మరొక్కసారి ఆశ్రయమర్థించే వేళకి,

తుఫాను

ఇంతకుముందుకంటే బాగా ముదిరింది.

.

ఒక బడలిన స్త్రీ,

రక్తవిహీన, వడలి సన్నగా ఉంది,

లేమి, అపరాధభావమూ ఆమెలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.

ఆమె ఈ చిన్నారి దేవదూత పిలుపు విని లోనికి తీసుకెళ్ళింది .

.

నెమ్మదిగా తీసుకెళ్ళి,

ఆమె రెక్కలను తుడవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. 

దయతో తనగుండెల మీద ఆశ్రయం కల్పించి,

గుండె వెచ్చదనాన్నందించింది.

.

తూరుపు తెలవారుతూనే కాంతులు విరజిమ్మసాగింది.

తొలి వెలుతురు రేకతోనే

ఆ చిన్నారి దేవదూత స్వర్గానికి ఎగసిపోయింది…

పోతూ పోతూ ఆ ముదుసలిని ముద్దాడి…శవంగా మిగిల్చింది.

.

ఏడిలేడ్  ఏన్ ప్రాక్టర్

(Oct 30, 1825 – Feb 2, 1864)

ఇంగ్లీషు కవయిత్రి

.

The Requital

.

Loud roared the tempest, fast fell the sleet;

A little Child Angel passed down the street,

With trailing pinions and weary feet.

.

The moon was hidden; no stars were bright;

So she could not shelter in heaven that night,

For the Angel’s ladders are rays of light.

.

She beat her wings at each window pane,

And pleaded for shelter, but all in vain:—

‘Listen’ they said, ‘to the pelting rain!’

.

She sobbed, as the laughter and mirth grew higher,

‘Give me rest and shelter beside your fire,

And I will give you your heart’s desire.’

.

The dreamer sat watching his embers gleam,

While his heart was floating down hope’s bright stream;

…. So he wove her wailing into his dream.

.

The worker toiled on, for his time was brief;

The mourner was nursing her own pale grief:

They heard not the promise that brought relief.

.

But fiercer the tempest rose than before,

When the Angel paused at a humble door,

And asked for shelter and help once more.

.

A weary woman, pale, worn, and thin,

With the brand upon her of want and sin,

Heard the child Angel and took her in.

.

Took her in gently, and did her best

To dry her pinions; and made her rest

with tender pity upon her breast.

.

With eastern morning grew bright and red,

Up the first beam the Angel fled:

Having kissed the woman and left her — dead.

(1860-61)

Adelaide Anne Procter.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: