అసూయ … Adelaide Anne Procter

.

అతనెప్పుడూ ముందే;

అదృష్టం అతని ముఖంలో తొణికిసలాడేది.

నేను సంవత్సరాలతరబడి కష్టపడితే,

అతను అవలీలగా విజయం సాధించగలిగే వాడు.

మేం పరుగు పందెం వేసుకునే వాళ్ళం;

నాకాళ్ళు రక్తాలోడేవి, అతను పందెం గెలిచేవాడు.

.

అతను ఎన్ని విజయాలు సాధించినా

అతన్ని ఒక్కలాగే ఆదరించేరు;

నా పేలవమైన ఒకే ఒక్క విజయానికి

నాకెదురైనవి పరిహాసమూ, నిందా.

మేం ఇద్దరం తప్పుచేస్తే, అతని మీద జాలిపడేవారు,

నాకు మాత్రం అవమానమే.

.

నేను ఇంకా చీకటిలోనే కొట్టుమిట్టాడుతున్నాను,

అతను మాత్రం దేదీప్యంగా వెలుగుతున్నాడు.

నా కోరికలేవీ ఫలించలేదు;

అతను అడగడమే తడవు, జరిగిపోతున్నాయి.

ఒకసారి నేను నా సర్వస్వాన్ని పణం పెట్టి ఆడేను…

అతనే గెలిచాడు.

.

నిజం; ఇప్పుడే అతన్ని చూసివస్తున్నాను,

చక్కగా, చల్లగా నవ్వుమొగంతో, శవపేటికలో పరున్నాడు. 

దేముడే నన్ను కాపాడాలి!

అతను ప్రశాంతంగా అలా విశ్రాంతి తీసుకుంటుంటే,

నే నిలా బ్రతకమని శపించబడ్డాను.

చివరికి మృత్యువుకూడా అతన్నేముందు వరించింది.

.

(1859-61)

ఏడిలేడ్ ఏన్ ప్రాక్టర్.

Adelaide Anne Procter

బ్రిటిషు కవయిత్రి, మానవప్రేమి (Philanthropist).  38 ఏళ్ళ వయసులోనే క్షయవ్యాధివల్ల తనువుచాలించిన ప్రాక్టర్, విక్టోరియా మహారాణికి అత్యంత ప్రీతిపాత్రమైన కవయిత్రి. 14 సంవత్సరముల వయసులోనే కలం పట్టిన ప్రాక్టర్ Charles Dickens తో తమ కుటుంబానికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకోదలచుకోక,  అతని పత్రికలకే మారుపేరుతో కవితలు పంపింది. ఆమె అత్యంత ప్రతిభావంతురాలని Charles Dickens కీర్తించాడు. కవిగా  లార్డ్ టెన్నిసన్ తర్వాత స్థానంలో నిలబడగలిగినదంటే, ఆమె ప్రతిభని ఊఒహించుకో వచ్చు. సోషలిస్టు భావాలు కల ఈమె జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండి, నిరుద్యోగయువతులకోసం, నిరాశ్రయులకోసం కృషిచేసింది.  ఈమె కవితలలో మంచి తూగు ఉండి  సంగీత బధ్ధం చెయ్యడానికి అనువుగా ఉంటాయి.

.

Envy

.

He was the first always; Fortune shone bright in his face.

I fought for years; with no effort he conquered the place:

We ran; my feet were all bleeding, but he won the race.

.

Spite of his  many successes men loved him the same;

My one pale ray of good fortune met scoffing and blame.

When we erred, they gave him pity, but me— only shame.

.

My home was still in the shadow, his lay in the sun:

I longed in vain: what he asked for it straightway  was done.

Once I staked all my heart’s treasure, we played— and he won.

.

Yes; and just now I have seen him, cold, smiling, and blest,

Laid in coffin. God help me! while he is at rest,

I am cursed still to live:— even Death loved him the best.

.

(1859-61)

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg/220px-Adelaide_Anne_Procter_by_Emma_Gaggiotti_Richards.jpg
Image Courtesy: http://upload.wikimedia.org

Adelaide Anne Procter

(30 October 1825 – 2 February 1864)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: