అనువాదలహరి

Swish of a Sword … K. Geetha

Image Courtesy: http://www.google.co.in

.

Isn’t trying to speak about poetry

As difficult as to wake up one feigning sleep?

It’s unfathomable how densely poets compact poetic spirit in time, but

As they recollect it incessantly,

It must overwhelm the listener like a high tide.

“Chalam’s “Savitri”, perhaps, has come to life

Not out of his pen, but out of such voice.

Maybe, even ‘Poetry’ becomes poetry

Only when what swells up at heart finds expression

restive to stay quiet within.

Isn’t dreaming about poetry every hour

Like conferring Laureateship on him to a poet?

How wholly poetry churns out the heart !

To tributary the grace of words audibly

From the barrage of heart

To the attentive ears in front

Over his batting eyelids, channeling

Through the corrugated movements of the brow,

varying according to the tonal fluctuations;

To swish the sword of poetry

From the dense cumulus clouds of heart

Onto the parched terrains of people like a pelting shower;

To experience poetry always as easily as one speaks

And to recreate it time and again

as happily as one experiences it;

.

Well!

Then, can any poet’s heart that listens to it ever become a desert-dry?

Can his pen ever stop writing even if it were time for it to cease?

 .

K. Geetha:

Khadga Chalanam.

From “Drava Bhaasha”

.

ఖడ్గ చాలనం

.

కవిత్వం గురించి మాట్లాడడం  అంటే

నిద్ర నటించే వాళ్లని నిద్రలేపడం అంత కష్టం కదా.

ఎంతగా కవితాత్మని కాలంనిండా కుదించుకున్నారో కానీ

నిరంతరం జ్ఞప్తికొచ్చినవి వొచ్చినట్టల్లా

సముద్రపు అలల్లా ఎదుటివార్ని ముంచెత్తాల్సిందే

 “సావిత్రిచలం కలం లోంచి కాదు

గొంతు నించే పుట్టిందేమో

 “కవిత్వమైనాకవిత్వమయ్యేది

హృదయంలో ఘోషెత్తి నిలువలేక వెల్లడయ్యేప్పుడేనేమో

 కవిత్వం గురించి ప్రతి ఝామూ పలవరించడం అంటే

కవులకి గండపెండేరసత్కారమే కదా!

ఎంతగా కవిత్వం హృదయాంతర్మధిస్తుందో కానీ

ఎలుగత్తి పదాల విన్యాసాన్ని

వేగంగా ఆర్పే కన్రెప్పల మీదుగా

ధ్వని హెచ్చుతగ్గుల కనుగుణంగా ఎగరేసే నుదిటిత్రోవగుండా

తిన్నగా మనసు ఆనకట్టునించి ఎదుటికర్ణికలకు నదీపాయలుగా కర్ణాకర్ణం గావించడమంటే

దట్టపు మనో మేఘాలనుంచి మనుష్యుల ఎండిన కాలాలలోకి

ధారాపాతంగా

కవిత్వాన్ని అనుక్షణం ఖడ్గచాలనం  చేయించడమంటే

కవిత్వాన్ని సదా మాటలాడినంత సులభంగా అనుభూతించడమంటే

అనుభూతించినంత సౌఖ్యంగా పదే పదే బిగ్గరగా చవులూరించడమంటే

నిజంగా విన్న కవి హృదయమైనా ఎడారి అవుతుంది?

ఆగిపోయే వయస్సులోనైనా కలం ఆగకుండా లిఖించడం మానుతుందా?

.

కే. గీత

ద్రవభాష కవితా సంకలనం నుండి

%d bloggers like this: