అనువాదలహరి

ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు … ఆక్టేవియో పాజ్

http://www.awazpk.com/enews/posts/userfiles/143836,xcitefun-6.jpg
Image Courtesy: http://www.awazpk.com

.

చంద్రముఖీ!   

పొద్దుతిరుగుడుపువ్వు సూర్యుడివైపు తన దళాలు తిప్పినట్లు,

నేను పేజీ తిప్పినడల్లా

నీ ముఖారవిందాన్ని నా కభిముఖంగా తిప్పుతావు

.


సుహాసినీ!

 పత్రికలోని అందాల సుందరాంగీ!

ఏ మగాడైనా

నిన్ను చూడగానే మంత్రముగ్ఢుడౌతాడు

.

నీ మీద ఎన్ని కవితలు రాసి ఉంటారు?

ఓ బియాట్రిస్!

నీకెంతమంది డాంటేలు ప్రేమలేఖలు వ్రాసి ఉంటారు

నీ భ్రాంతిమదాకారానికి?

కల్పిత భావ వివశత్వానికి?

***

కానీ, ఈ రోజు

నేను మరొకసారి అరిగిపోయిన మాటలనే వాడి

నీ మీద కవిత వ్రాయదలుచుకో లేదు.

చాలు, చాలు! 

ఇక  ఈ రొడ్డకొట్టుడు పదప్రయోగాలు.

.

ఎవరి సౌందర్యం  తెచ్చిపెట్టుకున్నదిగాక,

వాళ్ళ స్వయం ఆకర్షణ శక్తిలో ఉంటుందో,

వాళ్ళ  తెలివితేటలలో ఉంటుందో,

వాళ్ళ సహజసిధ్ధమైన నడవడిలో ఉంటుందో 

అటువంటి స్త్రీలకి

నేనీ కవితని అంకితం ఇస్తాను

.

ఈ కవిత షహజాదేలా

ప్రతిరోజూ ఒక కొత్త కథని చెప్పడానికి మేల్కొనే స్త్రీలకోసం,

కొత్తదనాన్ని ఆలపించే కథలు…

యుధ్ధాలని ఆహ్వానించే కథలు… 

పెనవెసుకునే హృదయాల ప్రేమకై యుధ్ధం…

ప్రతి దినమూ మనసులో రగిల్చే వినూత్న రాగాలకై యుధ్ధం…

ఉపేక్షించబడ్డ  హక్కులకై యుధ్ధం…

లేదా, మరొక్క రాత్రి బ్రతికి బయటపడడానికి సలిపే యుధ్ధం.

.

అవును, బాధామయజగత్తులోని స్త్రీలు మీకందరికీ,

సతతవ్యయశీలమైన ఈ విశ్వంలో ప్రకాశించే  నక్షత్రాలవంటి మీకు,

వెయ్యిన్నొక్కరాత్రులు పోరు సల్పిన నీకు,

నా  ఆప్తస్నేహితురాలివైన నీకు.

.

ఇక నుండీ,

అందాన్ని చూడడానికి నేను పత్రికలలో వెతకను…

దానికి బదులు

రాత్రినీ,

వినీలాకాశం లోని మెరిసే తారకల్నీ ఊహిస్తాను.

చాలు! 

ఇక అరిగిపోయిన పదబంధాలొద్దు.

.

(షహజాదే : వెయ్యిన్నొక్క రాత్రులనబడే అరేబియన్ నైట్స్ కథల్లో, తెల్లవారేదాకా రోజుకొక కథ చెబుతూ, కథలోని ఉత్సుకత నిలబెడుతూ తనజీవితాన్ని మరొక్కరోజు పొడిగించుకుంటూ అతి చతురతతో తన లక్ష్యాన్ని నిర్వహించిన కథానాయిక)

.

ఆక్టేవియో పాజ్

.

No More Clichés

.

Beautiful face
That like a daisy opens its petals to the sun
So do you
Open your face to me as I turn the page.

Enchanting smile
Any man would be under your spell,
Oh, beauty of a magazine.

How many poems have been written to you?
How many Dantes have written to you, Beatrice?
To your obsessive illusion
To your manufactured fantasy.

But today I won’t make one more Cliché
And write this poem to you.
No, no more clichés.

This poem is dedicated to those women
Whose beauty is in their charm,
In their intelligence,
In their character,
Not on their fabricated looks.

This poem is to you women,
That like a Shahrazade wake up
Everyday with a new story to tell,
A story that sings for change
That hopes for battles:
Battles for the love of the united flesh
Battles for passions aroused by a new day
Battles for the neglected rights
Or just battles to survive one more night.

Yes, to you women in a world of pain
To you, bright star in this ever-spending universe
To you, fighter of a thousand-and-one fights
To you, friend of my heart.

From now on, my head won’t look down to a magazine
Rather, it will contemplate the night
And its bright stars,
And so, no more clichés.

.

Octavio Paz

%d bloggers like this: