పసి లోకం… టాగోర్

.
నాకు మా కుర్రాడి లోకంలో
ఒక మూల ప్రశాంతంగా కూర్చోగలిగితే బాగుణ్ణనిపిస్తుంది…
నాకు తెలుసు,
అక్కడ వాడితో మాట్లాడే నక్షత్రాలుంటాయి,
తన అల్లరి చిల్లరి మబ్బుతునకలతో, ఇంద్రధనుసులతో
అలరించడానికి అతని ముఖం మీదకి వంగే ఆకాశం ఉంటుంది.
మూగవైనట్టూ, అసలు కదలనే కదలలేనట్టూ భ్రమింపజేసేవన్నీ,
మెల్లగా అతని కిటికీ దగ్గరకి తమ కథలతోనూ,
తళతళలాడే ఆటబొమ్మలతోనిండిన తబుకులతోనూ
పాకుకుంటూ వస్తాయి…
ఆ బాలుడి మనోద్వారంలో మెదిలే దారులగుండా
ఏ సరిహద్దులూ లేని ప్రదేశాలకి వెళ్లగలిగితే బాగుణ్ణనిపిస్తుంది;
అక్కడ చరిత్ర యెరుగని రాజుల రాజ్యాలమధ్య
నిరంతరాయంగా వార్తాహరులు ఏదో పనిమీద పరిగెడుతూనే ఉంటారు…
అక్కడ బుధ్ధి తన చట్టాల గాలిపటాలు తానే తయారుచేసుకుని ఎగరేస్తుంటే,
సత్యం ఏ ప్రతిబంధకాలూ లేని నిజాలని ఆవిష్కరిస్తూ ఉంటుంది.
.
టాగోర్
.
I wish I could take a quiet corner in the heart of my baby’s very
own world.
I know it has stars that talk to him, and a sky that stoops
down to his face to amuse him with its silly clouds and rainbows.
Those who make believe to be dumb, and look as if they never
could move, come creeping to his window with their stories and with
trays crowded with bright toys.
I wish I could travel by the road that crosses baby’s mind,
and out beyond all bounds;
Where messengers run errands for no cause between the kingdoms
of kings of no history;
Where Reason makes kites of her laws and flies them, the Truth
sets Fact free from its fetters
.
Rabindranath Tagore
Hymn of Hope — వేదుల సత్యనారాయణ శాస్త్రి

.
When nature slips into sleep steadily in your dainty delicate hands
Surrendering to the deep dumb darkness of the night at this hour, my Lord!
Why do you push this frail, impaired Veena at me bidding to set it and sing ;
I fear the string might snap, tune may fail, or it may not twang at all.
.
I can’t play the Veena like a black cuckoo, its sweet sonorous scores
Hiding amidst the thick Mango foliage of the Spring;
Pray leave me! Contrary, If you render the hymns suffuse with love
Pervading this universe, I will be too happy to subject myself to them.
.
Should you be so insisting that I sing anyway the lyrics of love
You so passionately composed yourself and bestowed upon me ; then,
Sweeten this hushed, empty voice of mine, charging it with your glorious
Ambrosial Grace of compassion; I shall just lend my voice, and render.
.
ఆశాగానము
.
ఏ సడిలేక ఈ ప్రకృతియెల్ల గభీర నిశానిబధ్ధమై
నీ సుకుమార హస్తముల నిద్దురవోయెడి మౌన వేళ నీ
వే సరిజేసి ఈ శిధిలవీణను పాడుమటంచు నాపయిన్
ద్రోసెదవేల తీగ తెగునో, శృతి దప్పునొ, పల్కదో ప్రభూ!
.
మావులగుంపులందు మధుమాసములన్ వికసించు కోకిలా
రావమువోలె రాగ మధురమ్ముగ వీణనదించ జాల నన్
బోవగనిమ్ము, ప్రేమరసపూరిత విశ్వవిలీనగాన మీ
వేవినిపింతువేని, సుఖియించెద నేనది యాలకించుచున్.
.
ఏ విధినైన పాడుమనియే వచియింతువయేని ప్రేమమై
నీవె రచించి నాకు కరుణించినవి ప్రణయార్ద్రగీతికల్ గావున
నా విశుష్కిత గళమ్మున నీ కరుణారసామృతశ్రీ వి
భవమ్ము నిల్పి మధురింపుము, నే శృతిగల్పి పాడెదన్.
.
— వేదుల సత్యనారాయణ శాస్త్రి
Love Letters 1 … పింగళి- కాటూరి

.
Attuning it, I held Veena
To render songs dedicated you,
But, Oh me! What to speak when even
Hand gets choked, just as the throat!
.
There is eagerness to somehow fly
And land at your feet; but strangely,
This body is denied what the mind is blessed:
That pair of wings within the reach of Sadhyas.
.
Note: Sadhyas are a class of Demigods
.
ప్రణయ లేఖలు — పింగళి- కాటూరి
.
శృతులు సరిజేసి యుష్మదంకితములైన
కృతులు పాడగ వీణ పట్టితినిగాని
కటకటా ఏమి చెప్పుదు, కంఠమునకె
గాక హస్తమునకును గాద్గద్య మొదవె!
ఎగిరి నీ పాదములచెంతకెట్లొ వచ్చి
వ్రాలుదునొ యన్న యుత్సుకత్వమ్ము గలదు
సాధ్యసాధనమైన పక్షములజంట
హృదయమునకుండి లేదు శరీరమునకు;
.
పింగళి (లక్ష్మీకాంతం)- కాటూరి (వెంకటేశ్వర రావు)
(ముద్దుకృష్ణ- వైతాళికులనుండి)
A Blind Beggar … Viswanatha Satyanarayana.

[Opie, John (1761-1807) – The Blind Beggar of Bethnal Green and his Daughter (Ashmolean Museum of Art, University of Oxford, U.K.)]
.
Whenever I travelled by train
I found him getting into it at some station
His daughter walking him, and following
.
He always rendered one poem or the other, taking
Only from the Dasarathi Satakam
.
And his voice remained the same—
Like one drowning in a well, in his former life,
Calling out for help and nobody within reach to listen.
.
That call echoed, ringing thin and died down
struggling to stay alive in the gullet,
And at last, reached out to him in this life.
.
His eyes were those two sockets,
Which had yearningly looked around, then,
For help in hope, and stalled…
Life lay suspended in those eye slots
Till they found him, once more, in this life.
.
All through his singing; and
Whenever I looked at his eyes,
A feeling charged up in my heart
To rescue that drowning man from the well.
.
Meanwhile, stopping his song,
Begging for a coin here and a copper there, he would get down
After his daughter… and I was left there behind.
.
Viswanatha Satyanarayana
Note:
Dasarathi Satakam is a work in the genre “Satakams” in Telugu Literature consisting of 100 quatrains (Usually 108) of any one form (or more) of poetry with a refrain in the end… stretching either for the entire length of fourth line or part thereof. In case of ‘Seesam’ , another form of poetry of 12 lines, it may extend to last two lines.
.
అంధ భిక్షువు
.
అతడు, రైలులో నే బోయినప్పుడెల్ల
నెక్కడో ఒక్కచోట దా నెక్కు – వాని
నతని కూతురు నడిపించు చనుసరించు.
అతడు దాశరథీశతకాంతరస్థ
మైన పద్యమె పఠించు ననవరతము.
అతని యాగొంతు కట్లనే – అతడు పూర్వ
జన్మమందున నే నూతిలోననో చచ్చిపోవు
చెంతపిలిచిన వినువారలేని లేక,
ఆ పిలుపు ప్రాణకంఠమధ్యములయందు
సన్నవడి సన్నవడి నేటిజన్మ నతని
కనుచు వెదకుచు వచ్చి చేరినది కాక-
అతని కన్నులాబొత్తలే – ఆ సమయము
నందు తన్ను రక్షింప నేరైన వత్తు
రేమొయని చూచి చూచి యట్లే నిలబడి-
అతని ప్రాణాలు కనుగూళ్ళయందు నిలిచి
మరల గనె గాక నేటిజన్మమున నతని.
అతనుపాడినయంతసే పల్ల – నట్టి
యతనికన్నులు చూచినయప్పుడెల్ల,
నూతిలో మున్గునాతని తీతునంచు
వేగిరముపుట్టు నాదు హృద్వీథియందు;
అంతలో పాటనాపి, తా నచట నచట
కానులడిగి, కూతురు ముందుగా, వినిర్గ
మించు నాతడు- నే నందు మిగిలిపోదు!
.
విశ్వనాథ
(ముద్దుకృష్ణ- వైతాళికులనుండి)
[Disclaimer: The painting displayed here is without permission and shall be removed if anybody expresses objection to it.]
బ్రతుకు ఉపదేశం — జేమ్స్ విట్ కూంబ్ రైలీ

.
అరే! చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!
వాళ్ళు నీ ఆటబొమ్మ విరిచేసారా, నాకు తెలుసులే;
నీ వంటగిన్నెలూ, బొమ్మరిల్లూ కూడా
ఎప్పుడో పాడుచేసేసారా? అర్రర్రే;
ఈ బాల్యావస్థలన్నీ త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;
ఇదిగో! చిట్టితల్లీ, ఏడవకమ్మా, ఏడవకు!
.
అదిగో, చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!
అర్రర్రే! వాళ్ళు నీ పలక విరిచేసారా? నాకు తెలుసులే;
ఈ స్వేఛ్ఛగా ఆడుకోడాలూ, బడికెళ్ళడాలూ
త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;
అసలైన జీవితమూ, ప్రేమా త్వరలోనే ఆవహిస్తాయి.
అదిగో చిట్టితల్లీ ! ఏడవకమ్మా, ఏడవకు!
.
అదిగో చిట్టితల్లీ, ఏడవకు, ఏడవకు!
అయ్యో, వాళ్ళు నీ హృదయాన్ని బ్రద్దలు చేసారా? నాకు తెలుసులే;
ఇంద్రధనుసు తళతళలూ,
తెలివయసు తొలకరి కలలూ
త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;
నువ్వు వగచేవన్నీ భగవంతుని చేతి బందీలు…
అదిగో! ఏడవకమ్మా, ఏడవకు!
.
జేమ్స్ విట్ కూంబ్ రైలీ.
అమెరికను కవి, రచయిత
.
A Life-lesson
.
There! little girl; don’t cry!
They have broken your doll, I know;
And your tea-set blue,
And your play-house, too,
Are things of the long ago;
But childish troubles will soon pass by. —
There! little girl; don’t cry!
There! little girl; don’t cry!
They have broken your slate, I know;
And the glad, wild ways
Of your schoolgirl days
Are things of the long ago;
But life and love will soon come by. —
There! little girl; don’t cry!
There! little girl; don’t cry!
They have broken your heart I know;
And the rainbow gleams
Of your youthful dreams
Are things of the long ago;
But Heaven holds all for which you sigh. —
There! little girl; don’t cry!
.
James Whitcomb Riley
(October 7, 1849 – July 22, 1916)
American Poet and author.
Creation — Ismail
.
Man and Woman,
What a creation!
Complementing each other’s pleasure
Like Cotton and Fire.
.
Man and Woman
What a creation!
For mutual annihilation
Like Cotton and Fire.
.
Md. Ismail.
.
సృష్టి
.
ఆడదీ, మగాడు
ఏమి సృష్టి !
ఒకళ్ళ ఆనందాన్ని కొకళ్ళు
పత్తీ, మంటలా.
.
ఆడదీ, మగాడు
ఏమి సృష్టి !
ఒకళ్ళ నాశనానికొకళ్ళు
పత్తీ, మంటలా
.
ఇస్మాయిల్
కొండ ఎగుడు … క్రిస్టినా రోజెటి

.
ఈ రోడ్డు అలా తిరిగుతూ తిరుగుతూ కొండ చివరిదాకా పోతుందా?
ఆహా! కొండ కొనకొమ్ము దాకా.
అక్కడికి చేరడానికి రోజంతా పడుతుందా?
మిత్రమా! ఉదయం ఎక్కడం మొదలెడితే చీకటిపడుతుంది చేరేసరికి.
.
మరి రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకుందికి వసతి ఏమైనా?
చీకటిపడగానే, ఇంటికప్పొకటి కనిపిస్తుంది.
కొంపదీసి చీకట్లో కనిపించకుండా పోదుగద?
దాన్ని కనుక్కోలేకపోయే అవకాశమే లేదు.
.
రాత్రి ఇతర బాటసారుల్ని కలిసే అవకాశం ఉంటుందా?
ఆ! నీకంటే ముందు వెళ్ళిన వారందరినీ కలవొచ్చు.
అలా అయితే, అది కనిపించగానే తలుపు తట్టాలా, లేక చూడగానే పిలవొచ్చా?
అక్కడ ద్వారం దగ్గర ఎవ్వరూ నిలబడవలసిన అవసరం రాదు.
.
కాళ్ళు పుళ్ళయిపోయి నీరసంగా ఉంది. సౌకర్యంగా ఉంటుందా?
పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది.
అక్కడ నాకూ మిగతా వాళ్లకీ చాలినన్ని పడకలుంటాయంటావా?
ఆహా! ఎంతమంది వస్తే అంతమందికీ సరిపడా.
.
క్రిస్టినా రోజెటి
.
Up-Hill
.
Does the road wind up-hill all the way?
Yes, to the very end.
Will the day’s journey take the whole long day?
From morn to night, my friend.
.
But is there for the night a resting place?
A roof for when the slow dark hours begin.
May not the darkness hide it from my face?
You cannot miss that inn.
.
Shall I meet the other wayfarers at night?
Those who have gone before.
Then must I knock, or call when just in sight?
They will not keep you standing at that door.
.
Shall I find comfort, travel-sore and weak?
Of labour you will find the sum.
Will there be beds for me and all who seek?
Yes, beds for all who come.
.
Christina Rosetti.
My Heart Coos…. Afsar, Telugu, Indian
.
1
Yours is
A rattling voice that flows with a tremble…
An agitated river…
Collecting itself …much like a feverish child under a blanket.
Lowering a pregnant hovering cloudlet to earth,
You flash like lightning bowing on its splitting vein.
Shrinking into silence like her … a disquiet Godavari.
For the last time before snapping,
In the wellspring of your voice,
There’s a feverish yearning, stumbling for life
In the grating of your words.
2
There’s a song storming within,
Consummating a rumbling cloud and a parched heart
Raining on the bouldered city,
Befriending light in the night,
And in the day, concealing darkness within.
3
There’s nothing to write, till the humming of the heart ceases
Not sure if it were fear, like when an uncharted train passes through a tunnel.
4
O, My Deliverer!
Don’t I hold my breath and grip my body in my fist?
Don’t stop, don’t stop your song,
Till my blind run comes to an end.
.
Afsar
.
దిల్ హూ హూ కరే…
1
వణుకుతూ ప్రవహించే గొంతు నీది; జ్వరపడిన పిల్లాడిలాగా
దుప్పట్లో మునగదీసుకునే కలత నది.
కడుపుతో వున్న వొక మబ్బు తునకని నేల మీదికి దింపి,
చిట్లిపోతున్న దాని నరం మీద కమానుతో
తటిల్లున మెరిసే మెరుపు నువ్వు; దిగులు పడిన గోదారయి,
మౌనంలోకి ముడుచుకుపోయే ఆమెలాగా.
చిదిమిపోతూ నీటి బుగ్గ గొంతులో చివరి సారి
తడబడిన జీవన జ్వర వాంఛ నీ పదాల రాపిడిలో.
2
వొక మేఘ ఘర్జననీ
ఇంకో గుండె పగులునీ కలిపి పాడిన లోపలి పెనువాన
కురుస్తూ వుంది రాత్రి వెలుగుని తోడు పెట్టుకొని
పగలు చీకటిని కడుపులో దాచుకొని,
బండ రాళ్ళ నగరం వొంటి మీద.
3
రాయడానికేమీ లేదు, గుండె కూని రాగం ఆగేంత వరకూ.
భయమో ఏమో తెలియని రైలు దూసుకుపోతున్నట్టే, సొరంగంలోంచి.
4
ప్రాణం వుగ్గబట్టుకున్నానా, వొళ్ళు పిడికిలిలో దాచుకున్నానా,
పాట ఆపకు, నా చీకటి పరుగు ఆగేంత దాకా, నా జహాపనా!
.
అఫ్సర్
(Courtesy: http://www.afsartelugu.blogspot.com/2011_11_01_archive.html)
దివ్య దృష్టి …జాయిస్ కిల్మర్
